ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

గత 24 గంటల్లో అత్యధికంగా 28,472 మంది కోవిడ్ రోగులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
ఇప్పటివరకు 7.5 లక్షలకు పైగా కోవిడ్ రోగులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

రికవరీ రేటు 63 శాతం దాటింది.

19 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల్లో రికవరీ రేటు 63.13 శాతం కంటే ఎక్కువగా నమోదయ్యింది.

Posted On: 22 JUL 2020 12:34PM by PIB Hyderabad

ఒకే ఒక్క రోజులో అత్యధిక సంఖ్యలో 28,472 రికవరీలు నమోదయ్యాయి.  గత 24 గంటల్లో అత్యధికంగా కోవిడ్-19 రోగులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.  దీంతో, కోవిడ్-19 నుండి కోలుకున్న మొత్తం రోగుల సంఖ్య 7,53,049 కి చేరింది.  కోవిడ్-19 రోగుల రికవరీ రేటును 63.13 శాతానికి పెరగడానికి ఇది దోహదపడింది. 

కోలుకుంటున్న రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది.  చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులు మరియు చికిత్స అనంతరం కోలుకున్న వ్యక్తులు (ఈ రోజు 4,11,133) మధ్య వ్యత్యాసం మరింత విస్తరించి  3,41,916 గా నమోదయ్యింది.   ఈ వ్యత్యాసం క్రమంగా పైకి పెరుగుతున్న ధోరణి కనబడుతోంది. 

జాతీయ రికవరీ రేటు మెరుగుపడింది, 19 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు జాతీయ సగటు కంటే ఎక్కువగా రికవరీ రేటును నమోదు చేస్తున్నాయి.

రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల పేరు 

 

రికవరీ రేటు 

ఢిల్లీ 

84.83%

లడఖ్ (యు.టి)

84.31%

తెలంగాణ 

78.37%

హర్యాణా 

76.29%

అండమాన్ &

నికోబార్ దీవులు 

75.00%

రాజస్థాన్ 

72.50%

గుజరాత్ 

72.30%

ఛత్తీస్ గఢ్ 

71.81%

అస్సాం 

71.05%

ఒడిశా 

70.96%

తమిళనాడు 

70.12%

మణిపూర్ 

69.48%

చండీగఢ్ 

68.97%

ఉత్తరాఖండ్ 

67.99%

పంజాబ్ 

67.86%

మధ్యప్రదేశ్ 

67.47%

దాద్రా, నగర్ హవేలీ &

డామన్, డయ్యూ 

65.67%

హిమాచల్ ప్రదేశ్ 

64.72%

బీహార్ 

63.95%

కోలుకుని డిశ్చార్జి అయిన రోగుల సంఖ్య పెరగడం అదే విధంగా, చికిత్స పొందుతున్న పాజిటివ్ రోగుల సంఖ్యకు, కోలుకుని డిశ్చార్జి అయినా రోగుల సంఖ్యకు మధ్య వ్యత్యాసం పెరగడం, కేంద్రం అనుసరించిన మరియు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు అమలు చేసిన వ్యూహాలు ఆశించిన ఫలితాలను సాధించాయనడానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు.  ఇంటింటి సర్వేలు, నిఘా, కాంటాక్ట్ గుర్తించడం, సమర్థవంతమైన నియంత్రణ ప్రణాళికలు, దుర్బల ప్రజలకు స్క్రీనింగ్ పరీక్షలు చేయడం, భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం వంటి చర్యల ద్వారా కోవిడ్ పాజిటివ్ రోగులను ముందుగానే గుర్తించడంపై ప్రాథమిక దృష్టి నిలపడం జరిగింది.  మూడు అంచెల ఆరోగ్య మౌలిక సదుపాయాలు మరియు ఆసుపత్రులలో ప్రామాణిక వైద్య విధానాలు అమలుచేయడంతో పాటు, ఇళ్ళలోనే ఐసోలేషన్ కొనసాగించడం వంటి చర్యలు సమర్థవంతమైన చికిత్సకు సహాయపడ్డాయి.

న్యూఢిల్లీ ఎయిమ్స్ తో పాటు రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలోని అత్యున్నత వైద్య కేంద్రాలు -వైద్య చికిత్స, ఐ.సి.యు. రోగులకు క్లిష్టమైన వైద్య రక్షణకు బలం చేకూర్చాయి, తద్వారా భారతదేశంలో కేసు మరణాల రేటును తగ్గించడానికి అవకాశం ఏర్పడింది.  మరణాలను తగ్గించే లక్ష్యంతో కేంద్ర-రాష్ట్ర సహకారానికి మరో ఉదాహరణగా, న్యూఢిల్లీ ఎయిమ్స్ లో అమలుచేస్తున్న -.సి.యు. కార్యక్రమం నిలిచింది.  రాష్ట్రాల్లోని కోవిడ్-19 చికిత్స కోసం పనిచేస్తున్నపెద్ద ఆసుపత్రులకు .సి.యురోగుల క్లినికల్ మేనేజ్మెంట్లో భాగస్వామ్య అనుభవాలనుదేశీయ నిపుణుల సాంకేతిక సలహాలను వారానికి రెండు సార్లు టెలీ-కన్సల్టేషన్ కార్యక్రమాల ద్వారా  మార్గదర్శకత్వం మరియు మద్దతును సమకూర్చడం జరుగుతోంది.   అంకిత భావంతో చేసే ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల సేవల ఫలితంగా రికవరీలు మెరుగుపడుతున్నాయి, కేసు మరణాల శాతం నిరంతరం తగ్గుతోంది, ఇది ప్రస్తుతం 2.41 శాతంగా ఉంది.

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలుమార్గదర్శకాలు,

సలహాలుసూచనలపై ప్రామాణికమైనతాజా సమాచారం కోసం

 వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి : 

 https://www.mohfw.gov.in/   మరియు  @MoHFW_INDIA.

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను

దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు : 

 technicalquery.covid19@gov.in 

ఇతర సందేహాలుఅనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న

 మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు  :  

 ncov2019@gov.in   మరియు   @CovidIndiaSeva .

కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలుసమస్యలుసమాచారానికైనా,

ఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన 

ఉచిత  హెల్ప్ లైన్ నెంబర్ :    +91-11-23978046  

లేదా  1075  టోల్ ఫ్రీ ను సంప్రదించవచ్చు

వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన

కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం  వెబ్ సైట్ ని చూడండి :  

 https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

*****(Release ID: 1640468) Visitor Counter : 16