ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌పంచ యువ‌జ‌న నైపుణ్యాల దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 14 JUL 2020 9:05PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ నరేంద్ర‌మోదీ, జూలై 15,2020 ప్ర‌పంచ యువ‌జ‌న నైపుణ్యాల దినోత్స‌వం సంద‌ర్భంగా
ప్ర‌సంగించ‌నున్నారు. స్కిల్ ఇండియా మిష‌న్ 5 వ వార్షికోత్స‌వాన్ని కూడా ఈరోజు సూచిస్తుంది.  ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని నైపుణ్యాభివృద్ధి, ఎంట‌ర‌ప్రెన్యుయ‌ర్‌షిప్ మంత్రిత్వ‌శాఖ ఒక డిజిట‌ల్ స‌దస్సును నిర్వ‌హించ‌నుంది.
నేప‌థ్యం:
భార‌త ప్ర‌భుత్వం దేశ యువ‌తకు నైపుణ్యాలు క‌ల్పించ‌డం ద్వారా సాధికార‌త క‌ల్పించి వారిని ఉపాధికి మ‌రింత‌గా సిద్ధం చేయ‌డం, వారి ప‌నిప‌రిస్థితుల‌లో మ‌రింత ఉత్పాద‌క‌త సాధించేందుకు నిర్దేశించిన కార్య‌క్ర‌మం స్కిల్ ఇండియా .  ఈ కార్య‌క్ర‌మం కింద వివిధ రంగాల‌కు సంబంధించి ప‌లు కోర్సులు నిర్వ‌హిస్తారు.   ప‌రిశ్ర‌మ  , జాతీయ నైపుణ్య అర్హ‌తా ఫ్రేమ్ వ‌ర్క్ కింద నిర్దేశించిన ప్ర‌మాణాల‌కు అనుగుణంగా వీటిని నిర్వ‌హిస్తారు.  ఈ కోర్సులు  వాస్త‌వ ప‌ని ప‌రిస్థితుల‌లో నైపుణ్యం సాధించ‌డంపై దృష్టిపెట్ట‌డానికి, సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవ‌డానికి ఉప‌కరిస్తాయి. దీనితో వీరు మొదటి రోజునుంచే  త‌ను చేయ‌వ‌ల‌సిన ప‌నికి సంబంధించిన నైపుణ్యంతో సిద్దంగా ఉంటారు. దీనివ‌ల్ల  ఆయా కంపెనీలు వీరు చేయ‌వ‌ల‌సిన ప‌నికి  సంబంధించి శిక్ష‌ణ కోసం ప్ర‌త్యేకంగా ఖ‌ర్చుచేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

***

 


(Release ID: 1638654) Visitor Counter : 201