ప్రధాన మంత్రి కార్యాలయం

ఇండియా గ్లోబల్ వీక్ ప్రారంభ సమావేశంలో ప్రసంగించిన - ప్రధానమంత్రి

ప్రపంచ పునరుజ్జీవనంలో భారతదేశం ప్రముఖ పాత్ర పోషిస్తోంది : ప్రధానమంత్రి

Posted On: 09 JUL 2020 3:17PM by PIB Hyderabad

ఇండియా గ్లోబల్ వీక్ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.

ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను ప్రస్తావిస్తూ, ప్రపంచ పునరుజ్జీవనంలో భారతదేశం ప్రముఖ పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.   ఇది రెండు అంశాలతో దగ్గరి సంబంధం కలిగి ఉందని ఆయన అన్నారు.  మొదటిది - భారత దేశ ప్రతిభ కాగారెండవది - సంస్కరణ, చైతన్యం నింపే భారతదేశ సామర్థ్యం. 

భారతదేశ ప్రతిభా శక్తి  యొక్క సహకారం, ముఖ్యంగా భారతీయ సాంకేతిక పరిశ్రమ మరియు సాంకేతిక నిపుణుల సహకారం ప్రపంచవ్యాప్తంగా  బాగా గుర్తింపు పొందిందని, ఆయన వివరించారు.

భారతదేశం ప్రతిభావంతుల శక్తి-నిలయంగా ఆయన అభివర్ణించింది.  భారతీయులు సహజ సంస్కర్తలు అని, సామాజికంగా లేదా ఆర్థికంగా అయినా భారతదేశం ప్రతి సవాలును అధిగమించినట్లు చారిత్రిక ఆధారాలున్నాయని ఆయన అన్నారు.

భారతదేశం పునరుజ్జీవనం గురించి మాట్లాడేటప్పుడు, పర్యావరణం మరియు ఆర్థిక వ్యవస్థ రెండింటికీ, అది : జాగ్రత్తగా పునరుజ్జీవనం, కరుణతో పునరుజ్జీవనం, స్థిరమైన పునరుజ్జీవనంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

మొత్తం ఆర్థిక చేరిక, అధిక సంఖ్యలో గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాల, సులభతర వాణిజ్యం, జి.ఎస్.‌టి. తో సహా సాహసంతో కూడిన పన్ను సంస్కరణలు వంటి గత ఆరు సంవత్సరాలలో సాధించిన విజయాల జాబితాను ప్రధానమంత్రి వివరించారు.

అసాధారణమైన భారతీయ స్ఫూర్తి కారణంగా చిగురిస్తున్న ఆర్థిక పునరుద్ధరణ ఫలితాలను ఇప్పటికే చూడవచ్చునని, ప్రధానమంత్రి చెప్పారు.

ఉచిత వంట గ్యాస్, బ్యాంకు ఖాతాల్లో నగదు, లక్షలాది మందికి ఉచిత ఆహార ధాన్యాల సరఫరా వంటి అనేక ఇతర ప్రయోజనాలు ప్రతి లబ్దిదారునికీ నేరుగా చేరుకోవడానికి ఈ రోజున సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో సహాయపడుతోందనిఆయన చెప్పారు.

భారతదేశం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన బహిరంగ ఆర్థిక వ్యవస్థలలో ఒకటి అనీ, తమ వ్యాపారాలను నెలకొల్పడానికి అన్ని బహుళజాతి కంపెనీలను భారతదేశం ఆహ్వానిస్తోందనీ, ప్రధానమంత్రి చెప్పారు.  భారతదేశం అత్యంత అనుకూలమైన, అవకాశాల నిలయంగా ప్రధానమంత్రి అభివర్ణించారు.

వ్యవసాయ రంగంలో ప్రారంభించిన వివిధ సంస్కరణలను ఆయన వివరించారు. ఇవి ప్రపంచ పరిశ్రమ రంగానికి చాలా ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను కల్పిస్తామని ఆయన అభివర్ణించారు.

తాజా సంస్కరణలు ఎం.ఎస్.‌ఎం.ఈ. రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు, అవి పెద్ద పరిశ్రమల రంగాన్ని మెరుగుపరుస్తాయని, ప్రధానమంత్రి పేర్కొన్నారు.

రక్షణ రంగంలో, అంతరిక్ష రంగంలో పెట్టుబడులకు  అవకాశాలున్నాయని ఆయన చెప్పారు.

భారతదేశ ఫార్మా పరిశ్రమ భారతదేశానికి మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికి ఒక ఆస్తి వంటిదని కోవిడ్ మహమ్మారి మరొకసారి నిరూపించిందని ప్రధానమంత్రి అన్నారు.  ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఔషధాల ధరలను తగ్గించడంలో ఇది ప్రముఖ పాత్ర పోషించింది.

ఆత్మ నిర్భర్ భారత్ అనేది స్వీయ నియంత్రణతో ఉండటం లేదా ప్రపంచానికి దూరంగా ఉండడం గురించి కాదు, కానీ స్వయం సమృద్ధిగా మరియు స్వయం ఉత్పాదకతతో ఉండడం అని అర్ధం.

ఇది సంస్కరణ, పనితీరుతో పాటు రూపాంతరం చెందుతున్న భారతదేశం.  ఇది ఒక కొత్త ఆర్థిక అవకాశాలను అందించే భారతదేశం.  అభివృద్ధికి మానవ కేంద్రీకృత మరియు సమగ్ర విధానాన్ని అనుసరిస్తున్న భారతదేశం ఇది.  భారతదేశం మీ అందరి కోసం ఎదురుచూస్తోందని, ఆయన అన్నారు.

భారతీయ శాస్త్రీయ సంగీతం యొక్క సౌందర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన పండిట్ రవిశంకర్ శతజయంతి ని కూడా ఈ వేదిక ద్వారా జరుపుకుంటున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.  ఒకరినొకరు పలకరించుకోడానికి నమస్తే ఈ రోజున ఎలా  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందీ, ఆయన వివరించారు.  ప్రపంచ హితం కోసం, శ్రేయస్సు కోసం భారతదేశం, తాను చేయగలిగినదంతా చేయటానికి సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు.

 

*****(Release ID: 1637592) Visitor Counter : 96