ప్రధాన మంత్రి కార్యాలయం

వారాణసీ కేంద్రం గా పనిచేస్తున్న ఎన్ జిఒ ల ప్రతినిధుల తో రేపటి రోజు న సంభాషించనున్న ప్రధాన మంత్రి


లాక్ డౌన్ కాలం లో ఆహారం పంపిణీ మరియు ఇతర సహాయక చర్య ల దిశ గా కృషి చేసిన ఈ సంస్థ ల ప్రయత్నాల ను గురించి చర్చించనున్న ప్రధాన మంత్రి

Posted On: 08 JUL 2020 2:17PM by PIB Hyderabad

కోవిడ్ విశ్వమారి ని దృష్టి లో పెట్టుకొని లాక్ డౌన్ ను విధించిన కాలం లో, వారాణసీ నివాసులు మరియు సామాజిక సంస్థ ల సభ్యులు వారి సొంత ప్రయాసల ద్వారాను మరియు జిల్లా పాలన యంత్రాంగాని కి సహాయాన్ని చేయడం ద్వారాను అవసరార్థులు అందరి కి సకాలం లో ఆహారం లభ్యం అయ్యేటట్టు  చూశారు.  అటువంటి సంస్థల కు చెందిన ప్రతినిధుల అనుభవాన్ని గురించి మరియు వారి ప్రయాసల ను గురించి తెలుసుకోవడం కోసం వారి తో రేపటి రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించనున్నారు.

లాక్ డౌన్ కాలం లో, వారాణసీ లో వంద కు పైగా సంస్థ లు జిల్లా పాలన యంత్రాంగం యొక్క ఆహార విభాగం మాధ్యమం ద్వారా ను, అలాగే వాటి స్వీయ ప్రయత్నాల ద్వారా ను  దాదాపు 20 లక్ష ల ఆహార పొట్లాల ను, ఇంకా 2 లక్ష ల పొడి ఆహార పదార్థాల ను పంచి ఇచ్చాయి.

ఆహార పంపిణీ  కి తోడు, ఈ సంస్థ లు ముసుగు లు, సానిటైజర్ లు వంటి వాటి పంపిణీ లో కూడా వాటి పాత్ర ను పోషించాయి.  జిల్లా పాలన యంత్రాంగం వాటి ని కరోనా యోధులుగా గౌరవించింది..

 ఈ సంస్థ లు విద్య రంగం, సామాజిక రంగం, ధార్మిక రంగం, స్వాస్థ్య రంగం వంటి విభిన్న రంగాలు మరియు హోటల్స్/ సోశల్ క్లబ్స్ ఇంకా ఇతర వృత్తిపరమైన రంగాల లో కూడాను సేవల ను అందిస్తున్నాయి.

*******


(Release ID: 1637286) Visitor Counter : 242