PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 27 JUN 2020 6:28PM by PIB Hyderabad

 

పత్రికా సమాచార సంస్థ

సమాచార – ప్రసార మంత్రిత్వ శాఖ

భారత ప్రభుత్వం

(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య శాఖ తాజా సమాచారం: యాక్టివ్‌ కేసులను దాటి లక్షకు చేరువగా కోలుకునేవారి సంఖ్య; ‌కోలుకునే శాతం 58.13కు చేరిక‌

దేశంలో కోవిడ్‌-19 నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య మొత్తం కేసుల సంఖ్య‌ను వేగంగా దాటుతూ ల‌క్ష‌కు చేరువ‌వుతోంది. ఈ మేరకు రెండింటి మ‌ధ్య వ్య‌త్యాసం నేడు 98,493కు చేరింది. ప్ర‌స్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 1,97,387 కాగా, వ్యాధి న‌య‌మైన‌వారి సంఖ్య 2,95,880గా న‌మోదైంది. ఈ ఉత్సాహకర పరిస్థితుల నడుమ కోలుకునేవారి శాతం 58.13కు చేరింది. వ్యాధి నయమైనవారికి సంబంధించి కోలుకునేవారి శాతం అధికంగాగల 15 రాష్ట్రాల వివరాలు కిందివిధంగా ఉన్నాయి.

 

.

సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

కోలుకునే శాతం

1

మేఘాలయ

89.1%

2

రాజస్థాన్‌

78.8%

3

త్రిపుర

78.6%

4

చండీగఢ్‌

77.8%

5

మధ్యప్రదేశ్‌

76.4%

6

బీహార్‌

75.6%

7

అండమాన్‌-నికోబార్‌ దీవులు

72.9%

8

గుజరాత్

72.8%

9

ఝార్ఖండ్‌

70.9%

10

ఛత్తీస్‌గఢ్‌

70.5%

11

ఒడిషా

69.5%

12

ఉత్తరాఖండ్‌

65.9%

13

పంజాబ్‌

65.7%

14

ఉత్తరప్రదేశ్‌

65.0%

15

పశ్చిమబెంగాల్‌

65.0%

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634813

కోవిడ్-19 సంబంధిత అంశాల‌పై డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షతన మంత్రుల బృందం 17వ సమావేశం; ప్రస్తుత పరిస్థితి... నియంత్రణ చర్యలపై సమీక్ష

కోవిడ్-19 సంబంధిత అంశాల‌పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షతన ఇవాళ ఉన్నత స్థాయి మంత్రుల బృందం 17వ సమావేశం జరిగింది. ఇందులో దేశంలోని ప్రస్తుత మొత్తం యాక్టివ్ కేసుల‌కుగాను 85.5 శాతం మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో న‌మోదుకాగా, మ‌ర‌ణాల్లోనూ 87 శాతం ఈ 8 రాష్ట్రాల్లోనే నమోదైనట్లు తెలుసుకున్నారు. కాగా, దేశవ్యాప్తంగా వివిధ పద్ధతుల్లో రోజువారీ కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల సామర్థ్యం పెరుగుతున్నదని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ భార్గవ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ మేరకు గడచిన 24 గంటల్లో 2,20,479 పరీక్షలు నిర్వహించగా, నేటిదాకా మొత్తం 79,96,707 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం ఈ పరీక్షల నిర్వహణకు 1026 ప్రయోగశాలలు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఇక 2020 జూన్‌ 27నాటికి 1039 కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రులు ఉండగా- 1,76,275 ఏకాంత చికిత్స పడకలు, 22,940 ఐసీయూ పడకలు, 77,268 ప్రాణవాయు మద్దతు పడకలు ఉన్నట్లు మంత్రుల బృందానికి అధికారులు వివరించారు. వీటితోపాటు 2,398 కోవిడ్‌ ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో 1,39,483 ఏకాంత చికిత్స పడకలు, 11,539 ఐసీయూ పడకలు, 51,321 ప్రాణవాయు మద్దతు పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇవేకాకుండా 8,958 కోవిడ్ రక్షణకేంద్రాల్లో 8,10,621 పడకలు సిద్ధంగా ఉన్నాయన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634777

ఢిల్లీలో కోవిడ్ నిర్వహణ చర్యలకు కేంద్రం బలమైన మద్దతు

ఢిల్లీలోని జాతీయ రాజ‌ధాని ప్రాంతంలో నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం బ‌ల‌మైన మ‌ద్ద‌తునిస్తోంది. ఈ మేరకు ఛత్త‌ర్‌పూర్‌లోని “రాధా స్వామి సత్సంగ్ బియాస్” ప్రాంగ‌ణంలో 10,000 పడకలతో “సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్”ను ఏర్పాటు చేస్తోంది. త‌గు సంఖ్య‌లో వైద్య సిబ్బందిని స‌మకూర్చ‌డంతోపాటు ఈ కేంద్రం నిర్వహణ బాధ్యతను కేంద్ర సాయుధ పోలీసు దళాలు స్వీక‌రిస్తాయి. ఇందులో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. కాగా, ఈ కేంద్రంలో ప్ర‌స్తుతం సుమారు 2,000 పడకలు సిద్ధం చేస్తున్నారు. మ‌రోవైపు ధౌలా కౌన్ ప్రాంతంలో డీఆర్‌డీవో నిర్మించిన‌ 1000 పడకల ఆస్పత్రిలో సైన్యానికి చెందిన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది వచ్చే వారంనుంచి పనిచేయటం ప్రారంభిస్తారు. ఇక కేంద్ర ప్ర‌భుత్వం కేంద్రీయంగా కొనుగోలు చేసిన 11.11 లక్షల ఎన్-95 మాస్కులు, 6.81 లక్షల పీపీఈ కిట్ల‌తోపాటు 44.8 లక్షల హెచ్‌సీక్యూ మాత్రలను పంపిణీ చేసింది. అలాగే ఢిల్లీకి కేటాయించిన 425 వెంటిలేటర్ల‌ను ఇప్ప‌టికే గ్రేట‌ర్ జాతీయ రాజ‌ధాని ప్రాంతంలోని ఆస్పత్రులకు అందజేశారు. ప్ర‌స్తుతం కోవిడ్‌-19 పీడితుల‌కు రోగ తీవ్ర‌త‌నుబ‌ట్టి చికిత్స అందించ‌డం కోసం ఢిల్లీ ప్ర‌భుత్వం 34 ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులు, 4 ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలు, 24 ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634755

కోవిడ్‌-19 కేసుల వైద్య నిర్వ‌హ‌ణ‌పై నవీ‌కృత మార్గ‌ద‌ర్శ‌కాలు జారీచేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19పై స‌మాచార విస్తృతి నేప‌థ్యంలో-  ప్ర‌త్యేకించి ఈ కేసుల వైద్య నిర్వ‌హ‌ణ‌లో స‌మ‌ర్థ ఔష‌ధాల వినియోగానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ న‌వీకృత మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఇవాళ జారీచేసింది. ఓ మోస్త‌రు, తీవ్ర కేసుల‌లో మిథైల్ ప్రెడ్నిసొలోన్ బ‌దులు డెక్సామెథా‌సోన్ మందు వాడ‌కంపై విధివిధానాల‌ను ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌లో పొందుప‌ర‌చింది. ఈ మందు సామ‌ర్థ్యంపై రుజువుల ప‌రిశీలన‌తోపాటు నిపుణులతో సంప్ర‌దించిన త‌ర్వాత‌ ఈ మార్పు చేసింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634756

గౌరవనీయ డాక్టర్ జోసెఫ్ మార్ థోమా మెట్రోపాలిటన్ 90వ జ‌న్మ‌దిన వేడుకలో ప్రధాని ప్ర‌సంగం: క‌రోనా యోధుల అండ‌తో కోవిడ్ -19పై భారత్ బ‌లమైన పోరు

భార‌త‌దేశం అన్ని మూలాల నుంచీ ఆధ్యాత్మిక ప్ర‌భావాల‌ను స‌దా ఆహ్వానిస్తూనే ఉన్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. “విన‌యం ఒక సుగుణం... అది అన్నివేళలా మంచిప‌నుల‌కు దారితీస్తుంది” అన్న డాక్ట‌ర్ జోసెఫ్ మార్ థోమా వ్యాఖ్య‌ల‌ను ఈ సంద‌ర్భంగా ఉటంకించారు. అలాంటి విన‌యం నుంచి పొందిన స్ఫూర్తితోనే మార్‌థోమా చ‌ర్చి కూడా స‌హ భార‌తీయుల జీవితాల్లో ప్ర‌త్యేకించి... ఆరోగ్య సంరక్షణ, విద్యారంగాల్లో సానుకూల దృక్ప‌థాన్ని ప్రోది చేసేందుకు కృషిచేసింద‌ని పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ మార్ థోమా చర్చి ముఖ్య‌ పాత్ర పోషించిందని, అదేవిధంగా జాతీయ స‌మైక్య‌త దిశ‌గా కృషిలో ముందంజలో ఉందని ఆయన అన్నారు. కోవిడ్ -19 ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే శారీరక వ్యాధి మాత్రమే కాద‌ని, మ‌న అనారోగ్య‌క‌ర జీవ‌న‌శైలిపై శ్ర‌ద్ధ‌ను పెంచుతుంద‌ని ప్రధానమంత్రి అన్నారు. ప్ర‌పంచ మహమ్మారి అంటే-  మానవాళి మొత్తానికీ చికిత్స అవసరమని, ప్ర‌పంచంలో సామరస్యాన్ని, ఆనందాన్ని నింపేందుకు శ‌క్తివంచ‌న లేకుండా కృషిచేయాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. కరోనా యోధుల సహాయంతో కోవిడ్-19పై భారత్ పోరాటం బ‌ల‌మైన రీతిలో సాగుతున్న‌ద‌ని ఆయన అన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634873

గౌరవనీయ డాక్టర్ జోసెఫ్ మార్ థోమా మెట్రోపాలిటన్ 90వ జ‌న్మ‌దిన వేడుకలో ప్రధామంత్రి ప్ర‌సంగం పూర్తిపాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634783

కోవిడ్ -19 దిగ్బంధ స‌మ‌యంలో కీల‌క ప్రాముఖ్యంగ‌ల‌ 200 నిర్వ‌హ‌ణ ప్రాజెక్టులను పూర్తిచేసిన రైల్వేశాఖ‌

కోవిడ్‌-19పై భార‌త పోరాటంలో వెన్నుద‌న్నుగా నిలిచిన‌ భారత రైల్వే యోధులు మ‌హ‌మ్మారి వ‌ల్ల విధించిన దేశ‌వ్యాప్త‌ దిగ్బంధంతో ప్ర‌యాణికుల‌ రైళ్ల నిలిపివేత‌ను ఒక అవ‌కాశంగా అందిపుచ్చుకున్నారు. ఈ మేర‌కు యార్డుల పునర్న‌‌వీక‌ర‌ణ‌, పాత వంతెనల మరమ్మతులు-పునర్నిర్మాణం, రైలు మార్గాలు డ‌బ్లింగ్‌-విద్యుదీక‌ర‌ణ‌,  సిజ‌ర్స్‌-క్రాస్ఓవర్ల పునరుద్ధరణవంటి దీర్ఘ కాలంగా నిలిచిపోయిన 200 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేసింది. చాలా ఏళ్ల నుంచీ అసంపూర్తిగా ఉన్న ఈ ప‌నుల‌వ‌ల్ల ప‌లుమార్లు ఆటంకాలు ఎదుర‌య్యేవి. ఈ నేప‌థ్యంలో ఒక‌వైపు దేశ‌వ్యాప్తంగా పార్శిల్‌-స‌రుకు ర‌వాణా రైళ్ల‌ను న‌డుపుతూ నిత్యావ‌స‌రాల స‌ర‌ఫరా శృంఖ‌లం కొన‌సాగ‌డానికి తోడ్ప‌డుతూనే ఈ చిర‌కాల నిర్వ‌హ‌ణ ప‌నుల పూర్తికి అందివ‌చ్చిన స‌మయాన్ని రైల్వేశాఖ స‌ద్వినియోగం చేసుకుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634807

వ్యవసాయ సంస్క‌ర‌ణ‌లు-వ్యూహాత్మక విధాన మార్పులు-పెట్టుబడి అవకాశాలపై వ్యవసాయ స‌హ‌కార‌-రైతు సంక్షేమ‌శాఖ వెబినార్ల నిర్వహ‌ణ‌

ఈ వెబినార్ల‌నుద్దేశించి వ్య‌వ‌సాయ స‌హ‌కార‌-రైతు సంక్షేమ‌శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ సంజ‌య్ అగ‌ర్వాల్ ప్ర‌సంగించారు. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి సంక్షోభం సంద‌ర్భంగా వ్య‌వ‌సాయ రంగంతోపాటు రైతుల సంక్షేమం కోసం శ్రీ న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం భ‌విష్య‌త్ దార్శ‌నిక‌త‌తో కూడిన విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌లు చేప‌ట్టిందని ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొనియాడారు. ఈ క‌ష్ట‌కాలంలోనూ భార‌త రైతాంగం, ప‌రిశ్ర‌మ‌ల సామ‌ర్థ్యం, కృషి పూర్తిస్థాయిలో రుజువ‌య్యాయ‌ని పేర్కొన్నారు. ఆ మేర‌కు నిరుడు ఖ‌రీఫ్‌లో 154 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో పంట‌ల సాగు చేప‌ట్ట‌గా, ఈసారి 316 ల‌క్ష‌ల హెక్టార్ల‌కు పెరిగింద‌ని చెప్పారు. ఇక గ‌డ‌చిన ఐదేళ్ల‌లో ఈ విస్తీర్ణం స‌గ‌టున 187 ల‌క్ష‌ల హెక్టార్లు మాత్ర‌మేన‌ని తెలిపారు. ఇక ప‌శుపోష‌ణ రైతుల‌కు ఏటీఎం లాంటిద‌ని, ఆ మేర‌కు చిల్ల‌ర వ్యాపారంలో పాల విక్ర‌యాల‌ను మించిన‌ది ఉండ‌ద‌ని, పాడి-ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ అతుల్ చ‌తుర్వేది వ్యాఖ్యానించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634875

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 

  • చండీగఢ్‌

ఈ కేంద్రపాలిత ప్రాంతంలో సామాజిక దూరం, మాస్కు ధారణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని తానిప్పటికే పోలీసులుసహా సంబంధిత అధికారులందరినీ ఆదేశించినట్లు పాలనాధికారి సలహాదారు పేర్కొన్నారు. సుఖ్నా సరస్సు ప్రాంతంసహా అన్ని మార్కెట్ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీని యంత్రాంగం చేపట్టనుంది. ఈ సందర్భంగా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడేవారికి జరిమానా విధిస్తారు.

  • హర్యానా

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నిర్దేశిత స్వయం సమృద్ధ భారతం దిశగా హర్యానా ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పథకం కింద బల్క్ డ్రగ్స్ పార్కు ఏర్పాటు కోసం అభివృద్ధి చేసిన 1000 ఎకరాల పారిశ్రామిక భూమిని కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు పానిపట్‌లో ఏర్పాటయ్యే బల్క్ డ్రగ్ పార్కువల్ల దేశంలో సంబంధిత ఔషధాల తయారీ వ్యయం తగ్గుతుంది. దీంతోపాటు బల్క్ డ్రగ్స్‌ కోసం విదేశాలపై ఆధారపడే అవసరం తప్పుతుంది.

  • మహారాష్ట్ర

రాష్ట్రం 5,024 కొత్త కేసుల నమోదుతో ఒకేరోజు అత్యధిక కేసులలోనూ కొత్త రికార్డు నెలకొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,52,765కు పెరిగింది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 65,829 కాగా, కొత్త కేసులలో ముంబైకి చెందినవి 1,297గా ఉన్నాయి. కాగా, ముంబైలో కరోనావైరస్ వ్యాప్తి విస్తృతిపై అంచనా కోసం నగరపాలక సంస్థ (బిఎంసి) త్వరలో మహానగరంలోని 3 వార్డులలో సీరో-సర్వే నిర్వహించనుంది. ఇందుకు నీతి ఆయోగ్‌తోపాటు  టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్ రీసెర్చ్‌సహా మరికొన్ని సంస్థలు సహకరిస్తాయి. సర్వేలో భాగంగా మురికివాడలు, ఇతర ప్రాంతాలనుంచి 10,000 యాదృచ్ఛిక రక్త నమూనాలను పరీక్షిస్తారు. కాగా, కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం ఇవాళ థానె నగరాన్ని సందర్శించి అక్కడ కోవిడ్ పరిస్థితిని సమీక్షించింది.

  • గుజరాత్

రాష్ట్రంలో తాజా సమాచారం ప్రకారం 580 కొత్త కేసులతోపటు 18 మరణాలు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 30,158కి, మరణాలు 1,722కు పెరిగాయి.

  • రాజస్థాన్

రాష్ట్రంలో ఇవాళ 127 కొత్త కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 16,787కు మరణాల సంఖ్య 389కి చేరాయి. ఇక ఇప్పటిదాకా 13149 మంది రోగులు కోలుకోగా, ప్రస్తుతం 3249మంది చికిత్స పొందుతున్నారు.

  • మధ్యప్రదేశ్

రాష్ట్రంలో 203 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 12,798కు పెరిగింది. వీటిలో ప్రస్తుతం 2,448 యాక్టివ్‌ కేసులున్నాయి.

  • ఛత్తీస్‌గఢ్‌

రాష్ట్రంలో 89 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 647కు చేరగా, కొత్త కేసులలో 39 రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోనివే కావడం గమనార్హం.

  • గోవా

రాష్ట్రంలో శుక్రవారం 44 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 1,039కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 667గా ఉంది.

  • అరుణాచల్ ప్రదేశ్

రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష సమావేశం నిర్వహించారు. దీంతోపాటు వ్యవసాయ సముదాయాలు/పౌష్టికాహార ఉద్యాన పథకం, పరిశుభ్ర-హరిత అరుణాచల్ ప్రచారోద్యమం, జిల్లాల్లో పరిశుభ్రత తదితర అంశాలపైనా చర్చించారు.

  • అసోం

రాష్ట్రంలో పలాష్‌బరీలోగల మీర్జాలోని పతంజలి యోగపీఠంవద్ద ఒక నిర్బంధవైద్య కేంద్రాన్ని 250పడకల కోవిడ్‌ ఆస్పత్రిగా మారుస్తున్నట్లు అసోం ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వశర్మ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ద్వారా తెలిపారు.

  • మణిపూర్

రాష్ట్రంలో కోవిడ్‌ ఆస్పత్రులు, సంరక్షణ కేంద్రాల సమర్థ నిర్వహణకు సంబంధించి మణిపూర్ కోవిడ్-19 సంప్రదింపుల కమిటీ ఇవాళ సమావేశమై చర్చించింది.

  • మిజోరం

 రాష్ట్రంలో సంపూర్ణ దిగ్బంధం నుంచి ప్రభుత్వం కొంత సడలింపు ఇచ్చింది. ఈ నేపథ్యంతో దిగ్బంధం ముగింపు అనంతర ప్రణాళికను రూపొందించాల్సిందిగా ప్రతిపక్ష ZPM ప్రభుత్వాన్ని కోరింది.

  • నాగాలాండ్

రాష్ట్రంలో కోవిడ్-19 మహమ్మారి సందర్భంగా టీవీ, రేడియో, ఇంటర్నెట్‌ద్వారా విద్యాబోధన కొనసాగించేలా నాగాలాండ్ ప్రభుత్వం చేసిన కృషిని అంతర్జాతీయ సంస్థ OECD విద్యావిభాగం ప్రశంసించింది. ఇక రాష్ట్రంలో 12 కొత్త కేసులు నమోదుకాగా, ఇవన్నీ మాన్‌ నిర్బంధవైద్య కేంద్రం పరిధిలోని కావడం గమనార్హం.

  • కేరళ

రాష్ట్రంలో ఆదివారాలు దిగ్బంధాన్ని పూర్తిగా సడలిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారాలో్ల దిగ్బంధం అమలువల్ల విదేశాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి తిరిగివచ్చే కేరళీయులు ఇక్కట్లు పడుతున్నట్లు వెల్లడైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, రాత్రివేళ్లలో మాత్రం ఆంక్షలు కొనసాగనుండగా, నియంత్రణ జోన్లలో పోలీసులు మరింత కఠిన ఆంక్షలను అమలు చేస్తారు. రాష్ట్రంలో నిన్న 150 కొత్త కేసులు నమోదుకాగా, ప్రస్తుతం వివిధ జిల్లాల్లో 1,540 మంది చికిత్స పొందుతున్నారు.

  • తమిళనాడు

పుదుచ్చేరిలోని ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందికి కోవిడ్‌-19 నిర్ధారణ కావడంతో కార్యాలయాన్ని రెండు రోజులపాటు మూసివేయాలని నిర్ణయించారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఇవాళ 87 కొత్త కేసులతోపాటు ఒక మరణం నమోదైంది. మరోవైపు ఇవాళ 18 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కావడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 221కి చేరింది. ఇక తమిళనాడులో కోవిడ్ ఫలితంగా ఆదాయ నష్టం నేపథ్యంలో రాష్ట్ర ద్రవ్య లోటును రూ.85,000 కోట్లుగా అంచనా వేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. డీఎంకే పార్టీకి చెందిన మరో శాసనసభ్యుడికి కోవిడ్‌ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో నిన్న 3,645 కొత్త కేసులతోపాటు 46 మరణాలు నమోదయ్యాయి. కాగా, 1,348 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుం మొత్తం కేసులు: 74,622; యాక్టివ్ కేసులు: 32,305; మరణాలు: 957; చెన్నైలో యాక్టివ్ కేసులు: 20,136గా ఉన్నాయి.

  • కర్ణాటక

రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా భవిష్యత్తులో ఆస్పత్రి పడకల అవసరంపై ప్రణాళిక సిద్ధంచేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఇక కోవిడ్‌పరంగా ప్రాణనష్టం తగ్గించడం కోసం మార్గదర్శకాలను సవరించాలని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో నిన్న445 కొత్త కేసుల నమోదుతోపాటు 246 మంది డిశ్చార్జి కాగా, 10 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 11,005; యాక్టివ్‌: 3,905; మరణాలు:180; డిశ్చార్జి అయినవి:6,916గా ఉన్నాయి.

  • ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు వారం వ్యవధిలో కరోనావైరస్ బారినపడిన నేపథ్యంలో ప్రజలను కలిసే సమయంలో ప్రజా ప్రతినిధులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆలయ పట్టణం శ్రీకాళహస్తిలో కరోనా కేసుల సంఖ్య పెరగడంతో పురపాలక అధికారులు ఆదివారం నుంచి తిరిగి దిగ్బంధం విధించారు. ఈ మేరకు పట్టణంలో దుకాణాలను ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే నడపాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా నిన్న 24,458 నమూనాలను పరీక్షించి నేపథ్యంలో 796 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే 263మంది  డిశ్చార్జ్ కాగా, 11 మరణాలు సంభవించాయి. కొత్త కేసులలో 51 అంతర్రాష్ట్ర వాసులకు చెందినవి కాగా, 5 విదేశాల నుంచి వచ్చినవారికి సంబంధించినవి. ప్రస్తుతం మొత్తం కేసులు: 12,285; యాక్టివ్: 6,648; డిశ్చార్జ్: 5,480; మరణాలు: 157గా ఉన్నాయి.

  • తెలంగాణ

రాష్ట్రంలోని పాఠశాలలు ఆన్‌లైన్‌సహా తరగతుల నిర్వహించరాదని, ఫీజు వసూలు చేయరాదని ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం నోటీసు జారీచేసింది. రాష్ట్రంలో 2020-21 విద్యాసంవత్సరం, ఆన్‌లైన్ తరగతులు తదితరాలపై పాఠశాల విద్యాశాఖ ఇంకా వివరణాత్మక మార్గదర్శకాలు జారీచేయకపోవడమే ఇందుకు కారణం. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కేసులు12,349; వీటిలో యాక్టివ్ 7,436;  కోలుకున్నవి 4,766గా ఉన్నాయి.

 

 

*****

 


(Release ID: 1634879) Visitor Counter : 273