ప్రధాన మంత్రి కార్యాలయం
పూజనీయులు డాక్టర్ జోసెఫ్ మార్ థోమా మెట్రోపాలిటన్ యొక్క 90వ జన్మ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
కరోనా యోధుల అండ తో భారతదేశం కోవిడ్-19 తో దృఢం గా పోరాడుతోందన్న ప్రధాన మంత్రి
భారతదేశం లో ప్రతి ఒక్కరి ఆర్థిక బలాని కి, ఇంకా సమృద్ధి కి ఆత్మ నిర్భర్ భారత్ పూచీపడుతుంది: ప్రధాన మంత్రి
‘స్థానికం గా తయారు చేయండి మరియు స్థానిక ఉత్పత్తుల ను కొనుగోలు చేయండి’ అంటూ ఇచ్చిన పిలుపు చాలా మంది ఇళ్ల లో సమృద్ధి జ్యోతి ని వెలిగిస్తుంది: ప్రధాన మంత్రి
Posted On:
27 JUN 2020 12:50PM by PIB Hyderabad
పూజనీయులు డాక్టర్ జోసెఫ్ మార్ థోమా మెట్రోపాలిటన్ యొక్క 90వ జన్మదిన వార్షికోత్సవం ఈ రోజు న కావడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. వారి కి ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తూ, వారి కి చక్కని ఆరోగ్యం ప్రాప్తించాలని, అలాగే వారి కి దీర్ఘాయుష్షు లభించాలని అభిలషించారు.
డాక్టర్ జోసెఫ్ మార్ థోమా వారి యొక్క జీవనాన్ని మన దేశం యొక్క మరియు మన సంఘం యొక్క అభివృద్ధి కోసం అంకితం చేశారు అని ఈ సందర్భం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ‘‘మరీ ముఖ్యం గా మహిళల కు సాధికారిత విషయం లో మరియు పేదరికం నిర్మూలన విషయం లో డాక్టర్ జోసెఫ్ మార్ థోమా ఎక్కువ గా మక్కువ ను చూపారు. యేసు ప్రభువు యొక్క ధర్మదూత అయిన సెంట్ థామస్ తాలూకు పవిత్ర ఆదర్శాల తో ద మార్ థోమా చర్చి సన్నిహిత సంబంధాన్ని కలిగివుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
భారతదేశం అనేక మూలాల నుండి ఆధ్యాత్మిక ప్రభావాల కు ఎల్లప్పుడూ సిద్ధం గా ఉన్నదని ప్రధాన మంత్రి అన్నారు. “వినమ్రత అనేది ఒక సద్గుణం, అది సదా మంచి పనుల ఫలాన్ని అందిస్తూ ఉంటుంది” అన్న డాక్టర్ జోసెఫ్ మార్ థోమా వచనాల ను అని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ఉట్టంకించారు. ఈ వినమ్రత భావన తోనే మార్ థోమా చర్చి మన తోటి భారతీయుల జీవనం లో, మరీ ముఖ్యం గా ఆరోగ్య సంరక్షణ మరియు విద్య వంటి రంగాల లో సకారాత్మకమైన పరివర్తన ను తీసుకు వచ్చేందుకు పాటుపడినట్లు ప్రధాన మంత్రి చెప్పారు. భారతదేశం యొక్క స్వాతంత్య్ర సంగ్రామం లో మార్ థోమా చర్చి ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది; అలాగే, జాతీయ సమైక్యత కోసం కృషి చేయడం లోనూ అందరి కంటే ముందు నిలచిందని ఆయన అన్నారు.
కోవిడ్-19 అనేది ప్రజల జీవితాల కు ముప్పు ను కలిగించే శారీరక అనారోగ్యం మాత్రమే కాదు, అనారోగ్యకరమైన జీవన శైలి పై కూడా మన దృష్టి ని మళ్ళిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. ఇప్పుడు యావత్తు మానవాళి కి పూర్ణ ఉపచారాల అవసరం ఉందని ఈ ప్రపంచవ్యాప్త వ్యాధి మనకు పరోక్షం గా సూచిస్తున్నదని, మన భూ గ్రహం లో మరింత సామరస్యాన్ని, ఆనందాన్ని పొందడానికి సాధ్యమయ్యే ప్రతి పని ని చేయవలసింది గా వీక్షకుల కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా యోధుల అండ తో భారతదేశం కోవిడ్-19 తో గట్టి గా పోరాడుతోందని ఆయన అన్నారు.
లాక్ డౌన్ ను విధించడం సహా ప్రభుత్వం తీసుకొన్న అనేక చర్యల తో మరియు ప్రజల సహకారం తో, భారతదేశం అనేక ఇతర దేశాల కంటే మెరుగైన స్థానం లో ఉందనీ, భారతదేశం లో రోగనివృత్తి రేటు పెరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కారణం గా వైరస్ యొక్క తీవ్రత ఊహించిన దాని కంటే చాలా తక్కువ గా ఉందన్నారు. కోవిడ్ కారణం గా మరణాల రేటు భారతదేశం లో ఒక మిలియన్ మంది కి 12 లోపు గా ఉందని, అదే, ఇటలీ లో ఒక మిలియన్ మంది కి 574 మంది వంతున ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన పోల్చి చెప్పారు. అమెరికా, బ్రిటన్, స్పెయిన్ మరియు ఫ్రాన్స్‌ల లో కూడా కోవిడ్ మరణాల సంఖ్య భారతదేశం కంటే చాలా ఎక్కువ గా ఉంది అని కూడా ఆయన అన్నారు. 85 కోట్ల మంది కి ఆశ్రయం కల్పిస్తున్నటువంటి లక్షలాది గ్రామాలు ఇంతవరకూ కరోనా వైరస్ బారి న పడలేదని ఆయన అన్నారు.
కోవిడ్-19 తో ప్రజలే సాగిస్తున్న పోరాటం ఇప్పటి వరకు సత్ఫలితాల ను ఇచ్చిందని ప్రధాన మంత్రి చెప్తూ, మనం మన రక్షణ చర్యల ను తగ్గించుకోకూడదు అన్నారు. మనం ప్రస్తుతం మరింత జాగ్రత్త గా ఉండాలని, మాస్కుల ను ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, మనిషికి మరొక మనిషికి నడుమ న రెండు గజాల ఎడం సూత్రాన్ని అనుసరించడం (‘దో గజ్ కీ దూరీ’), రద్దీ గా ఉండే ప్రదేశాల కు పోకుండా జాగ్రత్త తీసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం అని ఆయన అన్నారు.
గత కొన్ని వారాల లో, ఆర్థిక వ్యవస్థ కు సంబంధించిన స్వల్పకాలిక మరియు దీర్ఘ కాలిక సమస్యల ను భారత ప్రభుత్వం పరిష్కరించింది అని ప్రధాన మంత్రి అన్నారు. సముద్రం నుండి అంతరిక్షం వరకు, వ్యవసాయ క్షేత్రాల నుండి కర్మాగారాల వరకు ప్రజల కు స్నేహపూర్వకమైన మరియు దేశాభివృద్ధి కి అనుకూలమైన నిర్ణయాల ను తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. స్వావలంబనయుత భారతదేశం ఆవిష్కరించడం కోసం ఇచ్చిన ‘‘ఆత్మ నిర్భర్ భారత్’’ పిలుపు భారతదేశం లో ప్రతి ఒక్కరి కి ఆర్థిక బలాని కి మరియు సమృద్ధి కి పూచీ పడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఇటీవల ప్రవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఇరవై వేల కోట్ల రూపాయల కు పైగా పెట్టుబడి తో అమలయ్యే ఈ పథకం మత్స్య పరిశ్రమ రంగాన్ని మారుస్తుందని, ఎగుమతి ఆదాయాన్ని పెంచడం తో పాటు యాభై ఐదు లక్షల మంది కి పైగా ప్రజల కు ఉపాధి ని కల్పించనుందన్నారు. విలువ శృంఖలాల ను బలోపేతం చేసేందుకు పూచీ పడడానికి మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు మౌలిక సదుపాయాలను వినియోగించాలని ఆయన చెప్పారు. వివిధ పథకాల ద్వారా కేరళ లోని మత్స్యకారులు లాభం పొందగలరన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
అంతరిక్ష రంగం లో చేపట్టిన చరిత్రాత్మక సంస్కరణలు అంతరిక్ష ఆస్తులను మరియు అంతరిక్ష సంబంధిత కార్యకలాపాల ను ఎక్కువగా వినియోగించుకొనేటట్టు చేస్తాయని ప్రధాన మంత్రి అన్నారు. డేటా మరియు టెక్నాలజీ మరింత గా అందుబాటు లోకి వస్తాయి. విజ్ఞానశాస్త్రం అన్నా, సాంకేతిక విజ్ఞానం అన్నా ఎనలేని ఆసక్తి ని కనబరుస్తున్న కేరళ లోని చాలా మంది యువత, మరీ ముఖ్యం గా దక్షిణ భారతదేశం లోని యువత ఈ సంస్కరణ ల ప్రయోజనాన్ని పొందగలరని ఆయన పేర్కొన్నారు.
భారతదేశాన్ని వృద్ధి కి చోదక శక్తి గా మార్చడానికి ప్రభుత్వానికి దీర్ఘకాలికమైన దార్శనికత మరియు సూక్ష్మగ్రాహ్యత మార్గనిర్దేశం చేస్తున్నాయని ప్రధాన మంత్రి చెప్పారు. ఢిల్లీ లో సౌకర్యవంతమైన ప్రభుత్వ కార్యాలయాల నుండి కాక క్షేత్ర స్థాయి లో ప్రజల అభిప్రాయాల ను స్వీకరించి మరీ నిర్ణయాల ను తీసుకోవడం జరుగుతున్నదని ఆయన అన్నారు. ఇవి భారతదేశం లో ప్రతి ఒక్కరి కి ఒక బ్యాంకు ఖాతా ను కలిగివుండేటట్టు, పొగ లేని వంటశాల లు 8 కోట్ల కు పైగా కుటుంబాల కు అందుబాటులోకి వచ్చేటందుకు, తల దాచుకొనేందుకు గూడు లేని వారి కి 1.5 కోట్ల కు పైగా గృహాల ను ఇచ్చేందుకు పూచీ పడడం తో పాటు భారతదేశం ప్రపంచం లోకెల్లా అత్యంత పెద్దదైనటువంటి ఆరోగ్య సంరక్షణ పథకం అయిన ‘‘ఆయుష్మాన్ భారత్’’ కు సైతం నిలయం గా ఉండేటట్టు చూశాయని ఆయన వివరించారు.
ఒక దేశం- ఒక రేశన్ కార్డు పథకాన్ని ప్రవేశపెట్టడం పేద ప్రజల కు వారి ఆహార సామగ్రి ని వారు ఎక్కడ ఉన్నప్పటికి పొందడం లో సహాయపడుతోందని ప్రధాన మంత్రి అన్నారు. మధ్యతరగతి వారికి జీవన సౌలభ్యాన్ని పెంచడం కోసం అనేక కార్యక్రమాల ను తీసుకువచ్చినట్లు చెప్పారు. రైతుల కోసం ఎమ్ఎస్ పి ని పెంచడమైందని మరి వారు సరి అయిన ధర ను పొందేందుకు పూచీపడడం జరిగిందన్నారు. మహిళ ల కోసం, వివిధ పథకాల ద్వారా వారి ఆరోగ్యం పై తగిన శ్రద్ధ తీసుకొనేందుకు పూచీపడడం జరిగింది; మరి వారి కి ప్రసూతి సెలవుల ను పొడిగించడం ద్వారా వారి జీవనోపాధి మార్గం విషయం లో వారు రాజీ పడటానికి తావు లేకుండా చేయడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు.
మతం, పురుషుడు- మహిళ అనే భేదం, కులం లేదా భాష అనే వాటి మధ్య భారత ప్రభుత్వం ఎటువంటి విచక్షణ చూపదని, అలాగే 130 కోట్ల మంది భారతీయుల కు సాధికారిత ను కల్పించాలనే అభిలాష ప్రభుత్వాని కి మార్గదర్శనం చేస్తున్నదని, మరి భారతదేశం యొక్క రాజ్యాంగం మా కు దారి ని చూపే దీపం గా ఉందని ప్రధాన మంత్రి అన్నారు.
మనం చేసే కార్యాలు ఏ విధం గా దేశ అభివృద్ధి కి తోడ్పడగలవు అని ఆలోచించాలి అని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. ప్రస్తుత భారతదేశం ‘మేము స్థానికం గా ఉత్పత్తి చేస్తాము మరి అదే మాదిరి గా స్థానికంగా తయారు అయినటువంటి ఉత్పత్తుల ను కొనుగోలు చేస్తాము కూడా’’ అని అంటోందని ఆయన చెప్పారు. ఇది ఎంతో మంది ఇళ్ల లో సమృద్ధి జ్యోతి ని వెలిగిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
పూర్వరంగం:
మలంకరా మార్ థోమా సిరియన్ చర్చి ‘మార్ థోమా చర్చి’ పేరిట కూడా వ్యవహారం లో ఉంటూ, కేరళ లోని ప్రాచీనమైనటువంటి మరియు స్వదేశీ చర్చిల లో ఒకటి గా అలరారుతోంది. యేసు క్రీస్తు శిష్యులలో ఒకరైన సెంట్ థామస్ క్రీ.శ. 52 లో భారతదేశాని కి వచ్చి చర్చి ని స్థాపించాడని సాంప్రదాయకం గా నమ్ముతారు. ఈ చర్చి కి ప్రస్తుతం 21 వ మలంకరా మెట్రోపాలిటన్, పరమ పూజనీయ డాక్టర్. జోసెఫ్ మార్ థోమా ప్రముఖుని గా ఉన్నారు. వీరు గత పదమూడు సంవత్సరాలు గా ఈ చర్చి కి నాయకత్వ బాధ్యతల ను వహిస్తున్నారు. భారత స్వాతంత్య్ర పోరాటం లో, ఆత్యయిక స్థితి కాలం లో మరియు అటు తరువాత నుండి, ప్రజాస్వామ్య విలువల ను, ఇంకా జాతీయవాదాన్ని మార్ థోమా చర్చి పరిరక్షిస్తూ వచ్చింది. ఈ చర్చి మానవ జాతి రి సేవలు అందించడానికి కంకణం కట్టుకొని మరీ వివిధ సాంఘిక సంక్షేమ సంస్థ లు, అనాధ ఆశ్రమాలు, ఆసుపత్రులు, కళాశాల లు, పాఠశాల లు, సాంకేతిక సంస్థల ను నడుపుతోందిది. భూకంపం, వరద లు, సునామీ తదితర సంక్షోభాల కాలం లో వివిధ రాష్ట్రాలలో సహాయ కార్యకలాపాల్లో మరియు పునరావాస కార్యకలాపాల్లో ఈ చర్చి పాలుపంచుకొంది.
***
(Release ID: 1634873)
Visitor Counter : 266
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam