ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 తాజా సమాచారం
చికిత్సపొందేవారికంటే వేగంగా పెరుగుతున్న కోలుకున్నవారి శాతం
చికిత్సపొందుతున్నవారికంటే కోలుకున్నవారు లక్షమంది ఎక్కువ
Posted On:
27 JUN 2020 5:50PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు, సానుకూల చర్యలు తగిన ఫలితాలు ఇస్తున్నాయి. చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారి సంఖ్య దాదాపు లక్ష గా నమోదైంది. ఇప్పటికీ ఇంకా చికిత్సలో ఉన్నవారి సంఖ్య 1,97,387 కాగా కోలుకున్నవారు 2,95,880మంది కావటంతో వీరి సంఖ్య 98,493 ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఈ విధంగా చూసినప్పుడు కోలుకున్నవారి శాతం 58.13% కు చేరినట్టయింది. కోలుకున్న కేసుల సంఖ్య పరంగా మొదటి15 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఇవి.
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం
|
కోలుకున్నవారు
|
1
|
మహారాష్ట్ర
|
73,214
|
2
|
గుజరాత్
|
21,476
|
3
|
ఢిల్లీ
|
18,574
|
4
|
ఉత్తరప్రదేశ్
|
13,119
|
5
|
రాజస్థాన్
|
12,788
|
6
|
పశ్చిమ బెంగాల్
|
10,126
|
7
|
మధ్య ప్రదేశ్
|
9,619
|
8
|
హర్యానా
|
7,360
|
9
|
తమిళనాడు
|
6,908
|
10
|
బీహార్
|
6,546
|
11
|
కర్నాటక
|
6,160
|
12
|
ఆంధ్రప్రదేశ్
|
4,787
|
13
|
ఒడిశా
|
4,298
|
14
|
జమ్మూ కాశ్మీర్
|
3,967
|
15
|
పంజాబ్
|
3,164
|
కోలుకున్నవారి శాతం పరంగా మొదటి 15 రాష్ట్రాలు ఇవి:
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం
|
కోలుకున్న శాతం
|
1
|
మేఘాలయ
|
89.1%
|
2
|
రాజస్థాన్
|
78.8%
|
3
|
త్రిపుర
|
78.6%
|
4
|
చండీగఢ్
|
77.8%
|
5
|
మధ్యప్రదేశ్
|
76.4%
|
6
|
బీహార్
|
75.6%
|
7
|
అండమాన్ నికోబార్ దీవులు
|
72.9%
|
8
|
గుజరాత్
|
72.8%
|
9
|
జార్ఖండ్
|
70.9%
|
10
|
చత్తీస్ గఢ్
|
70.5%
|
11
|
ఒడిశా
|
69.5%
|
12
|
ఉత్తరాఖండ్
|
65.9%
|
13
|
పంజాబ్
|
65.7%
|
14
|
ఉత్తరప్రదేశ్
|
65.0%
|
15
|
పశ్చిమ బెంగాల్
|
65.0%
|
దేశ వ్యాప్తంగా కోవిడ్ పరీక్షల లాబ్ ల్ నెట్ వర్క్ ను విస్తృతం చేసేందుకు భారత వైద్య పరిశోధనామండలి(ఐసీఎం ఆర్ ) చర్యలు తీసుకుంటున్నది. ఇప్పుడు భారత్ లో మొత్తం లాబ్ ల సంఖ్య 1026 కు చేరింది. వీటిలో 741 ప్రభుత్వ లాబ్ లు, 285 ప్రయివేట్ లాబ్ లు.
ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది.
- తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్ : 565 (ప్రభుత్వ: 360 + ప్రైవేట్: 205)
- ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 374(ప్రభుత్వ: 349 + ప్రైవేట్: 25)
- సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 87 (ప్రభుత్వ: 32 + ప్రైవేట్: 55)
గడిచిన 24 గంటల్లో పరీక్షలు జరిపిన శాంపిల్స్ మరో 2,20,479 పెరగటంతో ఇప్పటివరకు పరీక్షలు జరిపిన మొత్తం శాంపిల్స్ సంఖ్య 79,96,707 కు చేరింది.
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf చూడండి
*****
(Release ID: 1634813)
Visitor Counter : 217