ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19-1 తాజా సమాచారం

భారతదేశంలో ఇప్పుడు 2 లక్షల మందికి పైగా కోవిడ్ -19 నుంచి కోలుకున్నారు.

రికవరీ రేటు 53.79% కి పెరిగింది.

Posted On: 19 JUN 2020 3:21PM by PIB Hyderabad

గత 24 గంటల్లో కోవిడ్ -19 నుంచి కోలుకున్న 10,386 మంది రోగులతో కలిపి, ఇప్పటి వరకూ ఈ వైరస్ నుంచి  మొత్తం 2,04,710 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 53.79% కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,63,248 క్రియాశీల కోవిడ్ కేసులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాయి.

రోజూ నమోదౌతున్న కేసుల సంఖ్యతో పోల్చి చూస్తే రికవరీ రేటు మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ -19 పెరుగుదలకు, రికవరీ రేటు మధ్య నిష్పత్తి పెరుగుతుండటం సకాలంలో భారతదేశం ఈ మహమ్మారిని ఎదుర్కొంటున్న వ్యూహానికి, సానుకూలమైన తీరుకు నిదర్శనం.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమన్వయం చేస్తూ, భారతదేశం లాక్ డౌన్ అమలు చేయటం, సాధారణ ప్రజల్లో ఈ వైరస్ పట్ల అవగాహన పెంపొందించటం లాంటివి ఈ మహమ్మారి క్రియాశీల వ్యాప్తిని గణనీయంగా పరిమితం చేశాయి. ప్రభుత్వానికి పరీక్షా సదుపాయాలు, ఆరోగ్య మౌలిక సదుపాయాలు లాంటివి పెంచేందుకు లాక్ డౌన్ సమయం వెసులుబాటు అందించింది. ఇది కోవిడ్ -19 కేసులను సకాలంలో గుర్తించటం మరియు క్లినికల్ నిర్వహణ ద్వారా మెరుగైన రికవరీ రేటు దిశగా దేశాన్ని ముందుకు తీసుకువెళుతోంది. ఈ తేడా ప్రభుత్వం సకాలంలో ముందుస్తుగా తీసుకున్న నిర్ణయాలతో పాటు ఎంతో మంది ముందు వరుస కార్మికుల సమిష్టి కృషికి నిదర్శనం.

 

ప్రభుత్వ పరీక్షా కేంద్ర సంఖ్యను 703కు, ప్రైవేట్ పరీక్షా కేంద్రాల సంఖ్యను 257కు (మొత్తం 960) పెంచారు. దీని విభజన ఈ క్రింది విధంగా ఉంది.

రియల్ టైమ్ ఆర్.టి.పి.సి.ఆర్. ఆధారిత పరీక్షా కేంద్రాలు – 541 ( 349 ప్రభుత్వ, 192 ప్రైవేట్)

ట్రూనాట్ ఆధారిత పరీక్షా కేంద్రాలు – 345 (328 ప్రభుత్వ, 17 ప్రైవేట్)

సి.బి.ఎన్.ఏ.ఏ.టి. ఆధారిత పరీక్షా కేంద్రాలు – 74 ( 26 ప్రభుత్వ, 48 ప్రైవేట్)

గత 24 గంటల్లో 1,76,959 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకూ పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 64,26,627.

కోవిడ్ మరియు నాన్ కోవిడ్ ఆసుపత్రి విభాగాల్లో పని చేసే ఆరోగ్య సంరక్షణ కార్మికుల నిర్వహణ కోసం మంత్రిత్వ శాక ఓ అడ్వైజరీని విడుదల చేసింది.

Page 1 of 4 Dated 18th June, 2020 Ministry of Health & Family Welfare Directorate General of Health Services (EMR Division).

 కోవిడ్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలకు సంబంధించిన ఇల్లస్ట్రేషన్ గైడ్ ను కూడా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

https://www.mohfw.gov.in/pdf/Illustrativeguidelineupdate.pdf

కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు మరియు సలహాలకు సంబంధించిన అన్ని ప్రామాణికమైన మరియు తాజా సమాచారం కోసం దయచేసి క్రమం తప్పకుండా ఈ క్రింది లింక్ ను సందర్శించండి.

https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA

కోవిడ్ -19కు సంబంధించిన సాంకేతిక ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in కు మరియు ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva కు పంపవచ్చు.

కోవిడ్ -19 కు సంబంధించి ఇతర ప్రశ్నలు ఏవైనా ఉంటే దయచేసి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్ లైన్ నంబర్ + 91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ)కు కాల్ చేయండి. కోవిడ్ -19 రాష్ట్ర / కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ సంఖ్యల జాబితా

COVID-19 పై ఏవైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నెం.: + 91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) వద్ద కాల్ చేయండి. COVID-19 లోని స్టేట్స్ / యుటిల హెల్ప్‌లైన్ సంఖ్యల జాబితా https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  లింక్ లో అందుబాటులో ఉంది.

 

***


(Release ID: 1632750) Visitor Counter : 493