ఆయుష్
అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడివై) సందర్భంగా టెలివిజన్‌లో ప్రసారం కానున్న ప్రధానమంత్రి సందేశం
2020 జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాను పెద్ద ఎత్తున వినియోగించనున్న ఆయుష్ మంత్రిత్వశాఖ
Posted On:
18 JUN 2020 6:32PM by PIB Hyderabad
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2020 ప్రధాన కార్యక్రమానికి , ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందేశం హైలైట్ కానుంది. ప్రధానమంత్రి సందేశాన్ని 2020 జూన్ 21 వ తేదీ ఉదయం 6 గంటలా 30 నిమిషాలకు టెలివిజన్ ద్వారా ప్రసారం చేయనున్నారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నిఆయుష్ మంత్రిత్వశాఖ పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్, డిజిటల్ ప్లాట్‌ఫారంలను వినియోగిస్తోంది.
ప్రధానమంత్రి సందేశాన్ని డిడి నేషనల్, డిడి న్యూస్, డిడి భారత్, డిడి ఇండియా, డిడి ఉర్దూ,డిడి స్పోర్ట్స్, డిడి కిసాన్, అన్ని ఆర్ ఎల్ఎస్ ఎస్ చానళ్లు, అన్ని ప్రాంతీయ కేంద్రాలు దీనిని ప్రసారం చేస్తాయి. గత యోగా దినోత్సవాల మాదిరే, ప్రధానమంత్రి సందేశం అనంతరం 45 నిమొషాల పాటు కామన్ యోగా ప్రొటోకాల్ (సివైపి)ని మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా (ఎండిఎన్ఐవై) బృందం నిర్వహిస్తుంది. సివైపి డ్రిల్‌ను వివిధ వయసుల వారు, వివిధ జీవన రంగాలకు చెందిన వారిని దృష్టిలోపెట్టుకుని నిర్వహిస్తారు. సివైపిలో శిక్షణ పొందిన వారు యోగా పట్ల అభిరుచి , దానిని అనుసరించాలన్న ఆసక్తి కలిగి ఉంటారు. అలా వారు చాలాకాలం దీనిని పాటించే అవకాశం ఉంది.
గడచిన అంతర్జాతీయ యోగా దినోత్సవాలలో వేలాది మంది ప్రజలు, బహిరంగ ప్రదేశాలలో యోగసాధన ప్రదర్శనలిస్తూఉండే వారు. కానీ ప్రస్తుతం కోవిడ్ -19 మహమ్మారి వల్ల అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఇలాంటి ప్రదర్శనలపై పెద్దగా దృష్టిపెట్టకుండా ప్రజలు తమ తమ ఇళ్లలోనే యోగాసాధన చేయడం, మొత్తం కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొనేలా చూడడంపై దృష్టి పెడుతున్నారు. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో యోగా ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.యోగా సాధన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇది వ్యాధిపై పోరాడేందుకు, వ్యక్తి శక్తి సామర్ధ్యాలను ఎంతగానో పెంపొందింప చేస్తుంది.
దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు ఆయుష్ మంత్రిత్వశాఖ నోడల్ మంత్రిత్వశాఖ గా ఉంది. ఇది ప్రస్తుత కోవిడ్ -19 సంక్షోభ సమయంలో ఇంటివద్దే యోగాసాధనను ప్రోత్సహించేందుకు వివిధ ఆన్‌లైన్, హైబ్రిడ్ ఆన్‌లైన్ వేదికల ద్వారా గత మూడు నెలలుగా పలు చర్యలు తీసుకుంటున్నది. పలు ప్రముఖ యోగా సంస్థలు ,ఆయుష్ మంత్రిత్వశాఖ కృషికి తమ చేతులు కలిపాయి. ఇందుకు సంబంధించి గత నెలరోజులుగా ముమ్మర కార్యకలాపాలు సాగుతున్నాయి. యోగా సామూహిక సాధనలో సామరస్యత సాధించేందుకు ప్రతి ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు పాటిస్తున్నట్టు కామన్ యోగా ప్రొటోకాల్ (సివైపి)పై అదనపు దృష్టిపెడుతున్నారు.
ఆయుష్ మంత్రిత్వశాఖ వివిధ ఆన్‌లైన్ కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నది. ప్రజలు యోగా సాధన చేయడానికి , ప్రొటోకాల్ పాటించడానికి ప్రతిరోజూ ఉదయం డిడి భారతి లో ఉదయంపూట సివైపి సెషన్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయుష్ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్లో, యోగా పోర్టల్ లో, అలాగే దాని సామాజిక మాధ్యమాల చానళ్ళలో యోగా సాధనకు సంబంధించి అదనపు సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. యోగా నిపుణులతచేత ప్రతిరోజూ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు.
పలువురు వ్యక్తులు, సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు,వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, సాంస్కృతిక సంస్థలు తమ సిబ్బంది, సభ్యులు, స్టేక్‌హోల్డర్ల ప్రయోజనం కోసం ఐడివై కార్యక్రమాలలో ఇళ్లనుంచే పాల్గొనేలా చేయడానికి కట్టుబడి ఉన్నాయి. ఈ కృషితో దేశవ్యాప్తంగా గల యోగా సాధకులైన వేలాది కుటుంబాలు తమ తమ ఇళ్లనుంచే ఐడివై కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
2020 అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా గల యోగా సాధకులు 2020 జూన్ 21 వ తేదీ ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ఒక్కతాటిపైకి రావాలని ఆయుష్ మంత్రిత్వశాఖ కోరుతోంది. ఆ రకంగా తమ తమ ఇళ్ల నుంచే యోగా కామన్ ప్రొటోకాల్ ప్రదర్శనలో చేతులు కలపాలని ఆయుష్ మంత్రిత్వశాఖ కోరింది.
ఈ కార్యక్రమం షెడ్యూలు కింది విధంగా ఉంటుంది.
ఉదయం 06.15 నుంచి 7.00 గంటలు- ప్రారంభ కార్యక్రమం. ఇందులో కేంద్ర మంత్రి(ఆయుష్) స్వాగతోపన్యాసం, ప్రధానమంత్రి ప్రసంగం, అనంతరం ఆయుష్ కార్యదర్శి ధన్యవాదాలు ఉంటాయి.
ఉదయం 7.00 నుంచి 07.45 గంటలు- ఎండిఎన్ఐవై చేత కామన్ యోగా ప్రొటోకాల్ ప్రత్యక్ష ప్రదర్శన
ఉదయం 7.45 నుంచి -8.00 గంటలు- యోగా నిపుణుల చర్చా కార్యక్రమం, ఐడివై ప్రధాన ఉత్సవం ముగింపు
***
(Release ID: 1632469)
Visitor Counter : 283
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada