ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 పై తాజా సమాచారం
రికవరీ రేటు 50 శాతం కంటే ఎక్కువగా నమోదయ్యింది.


మొత్తం 1,62,378 మంది రోగులు చికిత్స అనంతరం కోవిడ్-19 నుండి కోలుకున్నారు.

Posted On: 14 JUN 2020 3:35PM by PIB Hyderabad

గత 24 గంటల్లో 8,049 మంది కోవిడ్-19 రోగులు చికిత్స అనంతరం కోలుకోవడంతో, రికవరీ రేటు 50 శాతం కంటే ఎక్కువగా నమోదయ్యింది.  దీంతో ఇంతవరకు కోవిడ్-19 చికిత్స అనంతరం కోలుకున్న మొత్తం రోగుల సంఖ్య 1,62,378 కి చేరుకుంది

ప్రస్తుతం రికవరీ రేటు 50.60 శాతానికి పెరిగింది.  దీంతో కోవిడ్ -19 చికిత్స తీసుకుంటున్న మొత్తం రోగుల్లో, సగానికి పైగా రోగులు వ్యాధి నుండి కోలుకుంటున్నారన్న సంగతిని గమనించవచ్చు.  సకాలంలో కేసుల గుర్తింపు మరియు సరైన వైద్య చికిత్స అందించడం రికవరీ పెరగడానికి కారణాలుగా చెప్పవచ్చు. 

 

ప్రస్తుతంకోవిడ్-19 వ్యాధి లక్షణాలు కలిగి ఉన్న 1,49,348 మంది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు

వైరస్ సోకిన వ్యక్తిలో నోవెల్ కరోనావైరస్ ను గుర్తించడానికి ఐ.సి.ఎం.ఆర్. యొక్క పరీక్ష సామర్థ్యం క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వ ప్రయోగశాలల సంఖ్య ను 646 కు పెంచగా, ప్రైవేట్ ప్రయోగశాలల సంఖ్య 247 కు పెంచారు. దీంతో ఇప్పుడు మొత్తం 893 ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి.  గత 24 గంటల్లో 1,51,432 నమూనాలను పరీక్షించారు.  దీంతో ఇంతవరకు మొత్తం పరీక్షలు జరిపిన నమూనాల సంఖ్య 56,58,614 కు పెరిగింది. 

ఈ రోజు, కేంద్ర ఆరోగ్య మంత్రి,  కేంద్ర హోంమంత్రితో కలిసి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తోనూ, ఢిల్లీ ముఖ్యమంత్రితోనూ సమావేశం నిర్వహించి, ఢిల్లీ లో కోవిడ్ -19 పరిస్థితిని సమీక్షించారు.  నియంత్రణ చర్యలను బలోపేతం చేయడం, పరీక్షలను వేగవంతం చేయడం మరియు తగిన ఆరోగ్య మౌలిక సదుపాయాల సంసిద్ధత గురించి ఈ సమావేశంలో చర్చించారు.

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలుమార్గదర్శకాలుసలహాలుసూచనలపై ప్రామాణికమైనతాజా సమాచారం కోసం  వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి : 

https://www.mohfw.gov.in/        మరియు       @MoHFW_INDIA . 

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు 
          technicalquery.covid19@gov.in 

ఇతర సందేహాలుఅనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు  :  
            ncov2019@gov.in     మరియు    @CovidIndiaSeva. 

 కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలుసమస్యలుసమాచారానికైనాఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉచిత  హెల్ప్ లైన్ నెంబర్ :    +191-11-23978046  లేదా  1075  (టోల్ ఫ్రీ) ను సంప్రదించవచ్చు. 

వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం  వెబ్ సైట్ ని చూడండి : 
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

****(Release ID: 1631530) Visitor Counter : 59