ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మరియు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గౌరవనీయులు బెంజమిన్ నెతన్యాహు మధ్య టెలిఫోన్ సంభాషణ.

Posted On: 10 JUN 2020 9:49PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గౌరవనీయులు బెంజమిన్ నెతన్యాహు తో టెలిఫోన్ లో మాట్లాడారు.  

ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా నెతన్యాహు ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించినందుకు శ్రీ నరేంద్రమోదీ ఆయనకు తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.  ప్రధానమంత్రిగా నెతన్యాహు నాయకత్వం మరియు మార్గదర్శకత్వంలో భారతదేశం-ఇజ్రాయెల్ మధ్య భాగస్వామ్యం వృద్ధి చెందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో, టీకాలు, చికిత్స, మరియు వ్యాధి నిర్ధారణ రంగాలలో పరిశోధన మరియు అభివృద్ధి ప్రయత్నాలతో సహా,  భారతదేశం మరియు ఇజ్రాయెల్ దేశాలు తమ సహకారాన్ని విస్తరించగల అవకాశం ఉన్న రంగాలపై ఇరువురు  నాయకులు చర్చించారు. ఇరు దేశాలకు చెందిన నిపుణుల బృందాల మధ్య కొనసాగుతున్న మార్పిడిని నిర్వహించడానికి వారు అంగీకరించారు. అలాంటి సహకారం యొక్క ఫలితాలను / ప్రయోజనాలను  మానవత్వం యొక్క విస్తృత ప్రయోజనం కోసం అందుబాటులో ఉంచాలని కూడా వారు అంగీకరించారు.

ద్వైపాక్షిక ఎజెండాలోని ఇతర ముఖ్యమైన విషయాలను ఇరువురు నాయకులు సమీక్షించారు. కోవిడ్ అనంతర ప్రపంచం అనేక రంగాలలో పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యానికి మరిన్ని మార్గాలను సృష్టిస్తుందని వారు అంగీకరించారు.  ముఖ్యంగా, ఆరోగ్య సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఆవిష్కరణ, రక్షణ-సహకారం మరియు సమాచార సాంకేతికత వంటి రంగాలలో ఇప్పటికే బలంగా కొనసాగుతున్న భారత-ఇజ్రాయెల్ సహకారాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించడానికి అవకాశాలు ఉంటాయని  వారు అంచనా వేశారు.

మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో, అభివృద్ధి చెందుతున్న అవకాశాలు మరియు సవాళ్ళపై ఒకరినొకరు సంప్రదించి, అంచనాలను పంచుకోవడానికి తరచూ కలుస్తూ ఉండాలని ఇరువురు నాయకులు అంగీకరించారు

****


(Release ID: 1630804) Visitor Counter : 285