ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 తాజా సమాచారం
సిజిహెచ్ఎస్ ఎంపానెల్డ్ ఆస్పత్రులు, రాష్ట్ర ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రులలో
సిజిహెచ్ ఎస్ లబ్ధిదారులకు చికిత్సాసౌకర్యం
Posted On:
10 JUN 2020 11:30AM by PIB Hyderabad
సిజిహెచ్ ఎస్ కింద నమోదైన అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో సిజిహెచ్ ఎస్ లబ్ధిదారులకు సేవలందించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలలో చికిత్స అందుకోవటంలో ఎదురవుతున్న ఇబ్బందులు తమ దృష్టికి రావటంతో ఈ విషయం సమీక్షించిన మంత్రిత్వశాఖ అధికారులు ఈ మేరకు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలకు ఆదేశాలు జారీచేశారు.
మంత్రిత్వశాఖ ఆదేశాల ప్రకారం సి జి హెచ్ ఎస్ కింద నమోదై కోవిడ్ ఆస్పత్రులుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చేత ప్రకటించబడిన ఆస్పత్రులీ సిజిహె ఎస్ నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారులకు చికిత్స చేయాలి. అదే విధంగా కోవిడ్ ఆస్పత్రులుగా నమోదు కాకపోయినా సి జి హెచ్ ఎస్ కింద ఎంపానెల్ అయి ఉంటే ఆ ఆస్పత్రులు కూడా సిజిహెచ్ ఎస్ లబ్ధిదారులకు ఇతర చికిత్సలు నిరాకరించటానికి వీల్లేదని కూడా ఈ ఉత్తర్వులు స్పష్టం చేశాయి. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన పక్షంలో కఠిన చర్యలు తీసుకోవలసి వస్తుంది.
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf చూడండి.
***
(Release ID: 1630681)
Visitor Counter : 262
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam