ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి కి మరియు రవాండా అధ్యక్షుడు మాన్య శ్రీ పాల్ కాగామే కు మధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాషణ
Posted On:
05 JUN 2020 7:05PM by PIB Hyderabad
రవాండా అధ్యక్షుడు మాన్య శ్రీ పాల్ కాగామే తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా సంభాషించారు.
రవాండా ను 2018వ సంవత్సరం లో తాను సందర్శించిన అనంతరం ద్వైపాక్షిక సంబంధాల లో నమోదైన పురోగతి పట్ల ప్రధాన మంత్రి సంతృప్తి ని వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి శ్రీ మోదీ 2018వ సంవత్సరం లో రవాండా ను సందర్శించిన వేళ భారతదేశాని కి చెందిన 200 గోవుల ను బహుమతి గా ఇచ్చిన సంగతి ని రవాండా అధ్యక్షుడు ఉత్సాహం గా గుర్తు కు తెచ్చుకొన్నారు. ఆ ఆవులు రవాండా లో బాలల కు పాల లభ్యత ను మెరుగుపరచడం లో సహాయపడినట్లు, అలాగే రైతుల ఆదాయాన్ని కూడా పెంచినట్లు ఆయన వివరించారు.
కోవిడ్-19 కారణం గా తమ ఆరోగ్యరక్షణ వ్యవస్థ లకు మరియు ఆర్థిక వ్యవస్థ లకు ఎదురైన సవాళ్ల ను గురించి నేత లు చర్చించారు. సంక్షోభాన్ని సంబాళించడానికి మరియు పౌరుల శ్రేయాని కి పూచీ పడడానికి ఇరు దేశాల లోను తీసుకొన్న చర్యల కు సంబంధించిన సమాచారాన్ని వారు ఒకరి కి మరొకరు తెలియజేసుకొన్నారు. వర్తమాన సంకట కాలం లో తమ తమ దేశాల లోని ప్రవాసీ పౌరుల కు చేతనైన అన్ని రకాల సాయాన్ని అందించేందుకు నేతలు వారి యొక్క అంగీకారాన్ని వ్యక్తం చేశారు.
కరోనావైరస్ తో పోరాడడం లో రవాండా చేస్తున్న కృషి కి భారతదేశం వైద్యపరమైన సహాయం తో పాటు దృఢమైన మద్దతు ను అందిస్తుందని ప్రధాన మంత్రి రవాండా అధ్యక్షుని కి భరోసా ను ఇచ్చారు. వర్తమాన సంక్షోభాన్ని అధ్యక్షుడు శ్రీ కాగామే యొక్క నాయకత్వం లో ప్రభావశీలమైన రీతి లో నిర్వహిస్తున్నారని, ఈ సవాలు కు ఎదురొడ్డి నిలబడి పోరాడడం లో రవాండా ప్రజలు దృఢ సంకల్పాన్ని ప్రదర్శిస్తున్నారంటూ ఆయన ప్రశంసించారు.
వర్తమాన సంకట స్థితి లో రవాండా ప్రజల యొక్క ఆరోగ్యం కోసం మరియు వారి శ్రేయం కోసం ప్రధాన మంత్రి తన వైపు నుండి శుభాకాంక్షలు తెలిపారు.
***
(Release ID: 1629774)
Visitor Counter : 309
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam