ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ - 19 తాజా సమాచారం

24 గంటల్లో కోవిడ్ - 19 బాధితులలో కోలుకున్న వారు 11,264 మంది
తాజాగా 24 గంటల్లో పెరిగిన 4.51% తో 47.40% కు పెరిగిన కోలుకున్నవారి శాతం
89,987 నుంచి 86,422 కు తగ్గిన చికిత్స పొందుతున్న వారి సంఖ్య
నిన్న పరీక్షించిన శాంపిల్స్ 1,26,842

Posted On: 30 MAY 2020 5:14PM by PIB Hyderabad

గడిచిన 24 గంటల్లో మొత్తం 11,264 మంది కోవిడ్ - 19 బాధితులు కోలుకున్నారు. ఒక్క రోజులో ఇంతమంది కోలుకోవటం ఒక రికార్డు. ఇప్పటిదాకా 82,369 మంది కోవిడ్ - 19  బాధితులు కోలుకున్నారు.  దీనివలన కోలుకున్నవారి శాతం నిన ఒక్కరోజే 4.51%  మంది కోలుకొని మొత్తంగా కోలుకున్నవారిశాతాన్ని 47.40% కు చేరేలా చేసింది.


కోలుకున్న వారి సంఖ్య  గణనీయంగా ఉండటంతో చికిత్స పొందుతున్నవారి సంఖ్య కూడా మే 29న ఉన్న  89,987 మంది నుంచి 86,422 కు తగ్గింది. ఈ బాధితులందరూ వైద్య పర్యవేక్షణలో  చికిత్స పొందుతున్నారు. మృతుల శాతం 2.86% గా నమోదైంది. మే 29 నాటికి 2.55% శాతం మంది కోవిడ్ -  19 బాధితులు ఐసియు లో ఉండగా 0.48%  మంది వెంటిలేటర్ల మీద, 1.96% మంది ఆక్సిజెన్ సాయంతో ఉన్నారు. 462 ప్రభుత్వ ఆస్పత్రులు,  200  ప్రైవేటు లేబరేటరీలతో దేశంలో పరీక్షల సామర్థ్య కూడా పెరిగింది. ఇప్పటిదాకా మొత్తం 36,12,242 కోవిడ్ పరీక్షలు జరిగాయి. వాటిలో నిన్న ఒక్కరోజే 1,26,842 శాంపిల్స్ పరీక్షించారు.
కోవిడ్ -19  నిర్వహణ విషయానికొస్తే వైద్య మౌలిక సదుపాయాల్య్ కూడా బాగా పెరిగాయి. ప్రత్యేకంగా కోవిడ్ చికిత్సకే పరిమితమైన ఆస్పత్రుల సంఖ్య ప్రస్తుతం 942 ఉండగా వాటిలో 1,58,908 ఐసొలేషన్ పడకలు, 20,608  ఐసియు పడకలు,   69,384 ఆక్సిజెన్ సహాయక పడకలు ఉన్నాయి. కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు 2,380 ఉండగా వాటిలో 33,678 ఐసొలేషన్ పడకలు; 10,916 ఐసియు పడకలు, 45,750 ఆక్సిజెన్ సహాయక పడకలు ఉన్నాయి. కేంద్రం ఇప్పటిదాకా 119.88   లక్షల ఎన్95 మాస్కులు, 96.14 లక్షల వ్యక్తిగత రక్షణ పరికరాలు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు, కేంద్ర సంస్థలకు అందజేసింది. 
కోవిడ్-19  తో సహజీవనం తప్పదు గనుక తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి. బహిరంగ ప్రదేశాలలోను, కార్యాలయాలలోను భౌతిక దూరం సహా అన్ని మార్గదర్శకాలూ పాటించటం తప్పనిసరి. తరచూ చేతులు కడుక్కోవటం సహా చేతి శుభ్రత, ఊపిరితిత్తుల ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవటం, ముఖాన్ని కప్పుకోవటం వంటివి పాటించాలి. ప్రతి ఒక్కరూ ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే  కోవిడ్-19  నివారణ సాధ్యమవుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి. లాక్ డౌన్ సమయంలో  మినహాయింపులు ఇచ్చినా వాటిని అవసరమైనమేరకే వాడుకోవాలి.
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టొల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  చూడండి.

***



(Release ID: 1627974) Visitor Counter : 316