ప్రధాన మంత్రి కార్యాలయం
కతర్ అమీర్ శ్రీ శేఖ్ తమీమ్ బిన్ హమద్ అల్- థానీ తో టెలిఫోన్ లో సంభాషించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
26 MAY 2020 7:51PM by PIB Hyderabad
స్నేహశీలురైనటువంటి కతర్ ప్రజల కు ఈద్-ఉల్-ఫిత్ర్ శుభాకాంక్షల ను వ్యక్తం చేసేందుకు గాను కతర్ అమీర్ శ్రీ శేఖ్ తమీమ్ బిన్ హమద్ అల్- థానీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.
కోవిడ్-19 విశ్వమారి విరుచుకుపడ్డ ప్రస్తుత కాలం లో భారతీయ పౌరుల సంక్షేమాని కి పూచీ పడేందుకు అమీర్ వ్యక్తిగతం గా తీసుకొంటున్న శ్రద్ధ ను ప్రధాన మంత్రి హృదయపూర్వకం గా అభినందించారు. దీనికి ప్రతి గా, అమీర్ గారు కతర్ లో భారతీయ సముదాయం అందిస్తున్నటువంటి తోడ్పాటు ను ప్రత్యేకించి భారతీయ ఆరోగ్య కార్యకర్త లు పోషిస్తున్నటువంటి పాత్ర ను ప్రశంసించారు.
వర్తమాన స్థితి లో భారతదేశం నుండి కతర్ కు అత్యవసర వస్తువుల సరఫరా లో ఎటువంటి అంతరాయాన్నైనా సరే నివారించడానికి భారతదేశ అధికార వర్గాలు శ్రద్ధ వహిస్తున్నాయన్న సంగతి ని కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు.
త్వరలో రాబోయే అమీర్ గారి 40వ జన్మదినాన్ని దృష్టి లో పెట్టుకొని ప్రధాన మంత్రి ఆయన కు ఆత్మీయ శుభాకాంక్షలు పలుకుతూ, వారి కి ఎల్లప్పుడూ చక్కని ఆరోగ్యం తో పాటు అన్ని కార్యాల లో సఫలత సిద్ధిస్తూ ఉండాలి అనే అభిలాష ను వ్యక్తం చేశారు.
***
(रिलीज़ आईडी: 1627094)
आगंतुक पटल : 280
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam