హోం మంత్రిత్వ శాఖ

వలస కార్మికులను సజావుగా తరలించడానికి ఎక్కువ రైళ్లను నడపడానికి రాష్ట్రాలు మరియు రైల్వేల మధ్య మెరుగైన సమన్వయం అవసరం; జిల్లా అధికారులు తమ అవసరాలను రైల్వేలకు తప్పక తెలియజేయాలి.

రాష్ట్రాలలోనూ, అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లోనూ వారు సజావుగా వెళ్ళడానికి ఎక్కువ బస్సులు నడపాలి

కాలి నడకన వెళ్లే వారిని బస్సు / రైల్ స్టేషన్లకు వెళ్ళమని చెప్పాలి, వారు అలా వెళ్ళేదాకా దారిలో వారికి మరుగు దొడ్లు తో పాటు ప్రాధమిక సౌకర్యాలు కల్పించారు.

పుకార్లను తొలగించండి, రైళ్లు/బస్సులు బయలుదేరే సమయాలపై వారికి స్పష్టత నివ్వండి : హోంమంత్రిత్వశాఖ నుండి రాష్ట్రాలకు సూచనలు..

Posted On: 19 MAY 2020 11:43AM by PIB Hyderabad

చిక్కుకుపోయిన వలస కార్మికులు వారి ఇళ్లకు వెళ్లిపోవడానికి, కోవిడ్-19 సోకుతుందని భయపడటం మరియు జీవనోపాధి కోల్పోతుందేమోనన్న భయం ప్రధాన కారణాలుగా గుర్తించినట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ రాష్ట్రాలకు పంపిన ఒక ప్రకటనలో పేర్కొంది.  వలస కార్మికుల కష్టాలను తగ్గించడానికి, కేంద్రంతో సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవలసిన అనేక చర్యలను ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

అవి ఈ  విధంగా ఉన్నాయి: 

·       రాష్ట్రాలు, రైల్వే మంత్రిత్వశాఖ మధ్య సమన్వయంతో ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక రైళ్ల ఏర్పాటు. 

·       వలసదారుల ప్రయాణానికి అనువుగా బస్సుల సంఖ్యను పెంచాలి, వలసదారులను తీసుకువెళ్తున్న బస్సులను అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో అనుమతించాలి,  

·  రైళ్లు / బస్సులు బయలుదేరే వేళలను మరింత స్పష్టంగా తెలియజేయాలి, స్పష్టత లేకపోతే వదంతులవల్ల కార్మికుల్లో అసహనం పెరిగిపోతుంది

·       వలసదారులు కాలినడకన ఇప్పటికే బయలుదేరారని తెలిసిన సందర్భాల్లో వారికి మార్గమధ్యలో 

పారిశుధ్యం, ఆహారం, ఆరోగ్య పరిరక్షణ వంటి సదుపాయాలతో విశ్రాంతి కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటుచేయాలి. 

·      కాలినడకన ప్రయాణిస్తున్న వలస కార్మికులను జిల్లా అధికారులు గుర్తించి, వారు సమీప బస్సు స్టాండులు లేదా రైల్వే స్టేషన్లకు చేరుకోడానికి వీలుగా రవాణా ఏర్పాటు చేయాలి

·       వలస కార్మికుల్లో ఉన్న మహిళలు, చిన్న పిల్లలు, వృద్దుల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి తగిన ఏర్పాటు చేయాలి

·       ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలతో కలిసి విశ్రాంతి కేంద్రాల వద్ద క్వారంటైన్ ఉంటుందన్న అపోహను తొలగించడానికి జిల్లా అధికారులు కృషి చెయ్యాలి. ఎక్కడ పనిచేసే కార్మికులు అక్కడే ఉండే విధంగా వారిని ప్రోత్సహించాలి. 

·  వలస కార్మికుల చిరునామా, ఫోను నెంబర్లతో జాబితా తయారుచేయాలి. అవసరమైనప్పుడు ఈ సమాచారం, కాంటాక్ట్ ట్రేసింగ్ కు ఇది సహాయ పడుతుంది. 

ఏ వలస కార్మికుడు తన గమ్యాన్ని చేరుకోవడానికి రోడ్లపై లేదా రైల్వే ట్రాక్‌లపై నడవకుండా  జిల్లా అధికారులు తప్పక చూడాలని ఆ ప్రకటన పునరుద్ఘాటించింది.  తమ అవసరాలకు తగినంతగా, రైళ్లు నడపవలసిందిగా వారు రైల్వే మంత్రిత్వశాఖ ను కోరవచ్చు. 

రాష్ట్రాలకు జారీచేసిన అధికారికి ప్రకటన కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

*****

 


(Release ID: 1625153) Visitor Counter : 190