హోం మంత్రిత్వ శాఖ

చిక్కుకు పోయిన కార్మికులు వేగంగా వారి స్వస్థలాలకు వెళ్లేందుకు వీలుగా, "శ్రామిక్ ప్రత్యేక" రైళ్ల నిర్వహణను సమీక్షించడానికి ఆయా రాష్ట్రాల నోడల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన - హోంమంత్రిత్వశాఖ మరియు రైల్వేశాఖ అధికారులు.

స్వస్ధలాలకు వెళ్లాలనుకునే లక్షలాది మంది వలస కార్మికుల కోసం, ప్రతి రోజూ వందకు పైగా రైళ్ల చొప్పున మొత్తం 450 కి పైగా రైళ్లను ఏర్పాటు చేయడం జరిగింది.

Posted On: 11 MAY 2020 2:00PM by PIB Hyderabad

శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా వలస కూలీల తరలింపు పై కేంద్ర దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎమ్.హెచ్.ఏ.) మరియు రైల్వే మంత్రిత్వశాఖ ఈ ఉదయం ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాయి. ఈ సమావేశంలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన నోడల్ అధికారులు పాల్గొన్నారు

నిన్న నడిచిన 101 రైళ్లతో సహా మొత్తం 450 రైళ్లలో లక్షలాది వలస కార్మికులను తరలించినందుకు ఈ సమావేశం ప్రశంసించింది. 

ఈ సమావేశంలో అనేక సమస్యలను చర్చించి, పరిష్కరించారు. తమ స్వస్థలాలకు వెళ్లాలనుకునే వలస కార్మికులందరి ప్రయాణానికీ, తగిన సంఖ్యలో రైళ్లు నడుస్తాయని, వారికి భరోసా ఇవ్వాలని నిర్ణయించారు.   వలస కార్మికులు వారి స్వస్థలాలకు వేగంగా వెళ్లేందుకు వీలుగా వచ్చే కొన్ని వారాల్లో ప్రతీ రోజు వందకు పైగా రైళ్లు నడపడానికి ఏర్పాటు చేశారు

 

*****


(Release ID: 1622949)