మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

సిబిఎస్ఇ బోర్డు ప‌రీక్ష‌ల జ‌వాబుప‌త్రాల మూల్యాంక‌న‌కు దేశ‌వ్యాప్తంగా 3000 సిబిఎస్ఇ అఫిలియేటెడ్ పాఠ‌శాల‌ల‌ను అసెస్‌మెంట్ కేంద్రాలుగా ప్రారంభించ‌డానికి అనుమ‌తిచ్చిన కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ‌

ఈ అనుమ‌తి వ‌ల్ల 2.5 కోట్ల జ‌వాబుప‌త్రాల‌ను త్వ‌రగా మూల్యాంక‌నం చేయ‌డానికి మాకు స‌హాయ‌ప‌డుతుంది.- శ్రీ ర‌మేష్ పోఖ్రియాల్ నిశాంక్‌

Posted On: 09 MAY 2020 8:11PM by PIB Hyderabad

సిబిఎస్‌ఇ బోర్డు పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని సులభతరం చేయడానికి, భారతదేశం అంతటా 3000 సిబిఎస్‌ఇ అనుబంధ పాఠశాలలను అసెస్‌మెంట్ కేంద్రాలుగా ప్రారంభించడానికి హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి ఇచ్చినందుకు కేంద్ర మాన‌వ వ‌న‌రుల  అభివృద్ధి శాఖ‌ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' హోం మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.
భారతదేశం అంతటా 3000 సిబిఎస్‌ఇ అనుబంధ పాఠశాలలను అసెస్‌మెంట్ సెంటర్‌లుగా గుర్తించామని,  మూల్యాంకన ప‌రిమిత ప్ర‌యోజ‌నం  కోసం ఈ పాఠశాలలకు ప్రత్యేక అనుమతి ఇస్తామని ఆయ‌న చెప్పారు.
https://twitter.com/DrRPNishank/status/1259098061311291392?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1259098061311291392&ref_url=https%3A%2F%2Fpib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D1622553  
2.5 కోట్ల జవాబు పత్రాలను త్వరగా మూల్యాంక‌నం చేయ‌డానికి ఇది త‌మ‌కు సహాయపడుతుందని శ్రీ నిశాంక్ ఆశాభావం వ్యక్తం చేశారు. మిగిలిన బోర్డు పరీక్షలు నిర్వహించిన తరువాత ఫలితాలు ప్రకటిస్తారు (జూలై 1 - 15, 2020 మధ్యప్ర‌క‌టించాల‌ని భావిస్తున్నారు.)

కేంద్ర హోంమంత్రిత్వ‌శాక ఆఫీస్ మెమొరాండం కోసం ద‌య‌చేసి కింద క్లిక్ చేయండి.(Release ID: 1622581) Visitor Counter : 146