ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 అప్‌డేట్స్

కోవిడ్ -19 నుంచి కోలుకున్న 14,183 మంది

Posted On: 06 MAY 2020 6:18PM by PIB Hyderabad

భార‌త ప్ర‌భుత్వం, కోవిడ్ -19 సంక్షోభ తీవ్ర‌త‌కు అనుగుణంగా , ముంద‌స్తు చ‌ర్య‌లు, సానుకూల వైఖ‌రి ద్వారా రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాలతో క‌ల‌సి సమిష్టి కృషితో వైర‌స్‌ నివారణ, నియంత్రణ, నిర్వహణ కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిని క్రమం తప్పకుండా ఉన్న‌త‌ స్థాయిలో సమీక్షిస్తున్నారు
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఈ రోజు గుజ‌రాత్ ఉప ముఖ్య‌మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి కూడా అయిన శ్రీ నితిన్ భాయ్ ప‌టేల్‌, మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి శ్రీ రాజేష్ తోపె ల‌తో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స‌హాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే స‌మ‌క్షంలో కేంద్ర‌, రాష్ట్ర‌ప్ర‌భుత్వాల సీనియ‌ర్ అధికారుల‌తో  క‌ల‌సి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ఈ రెండు రాష్ట్రాల‌లో కోవిడ్ -19 ప‌రిస్జ‌తి, తీసుస‌కుంటున్న చ‌ర్య‌లు, వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు స‌న్న‌ద్ధ‌త త‌దిత‌ర అంశాల‌పై  స‌మీక్షించారు.
కోవిడ్ వైర‌స్‌తో సంబంధం లేని ముఖ్యమైన వైద్య‌సేవలను నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవలసిన అవసరాన్ని డాక్టర్ హర్ష్ వర్ధన్ నొక్కి చెప్పారు. అలాగే, తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ (SARI),ఇన్ఫ్లుఎంజా వంటి అనారోగ్యాల‌ (ILI) కేసుల స్క్రీనింగ్  పరీక్షలు జరిగేలా రాష్ట్రాలు  చూడాల్సిన‌ అవసరం ఉంద‌ని చెప్పారు. ఇది  హాట్‌స్పాట్‌లుగా రూపుదిద్దుకుంటున్న ప్రాంతాల‌ను గుర్తించడంలో సహాయపడుతుంద‌ని , వాటి నిర్వహణకు సకాలంలో తగిన వ్యూహాన్ని రూపొందించుకోవ‌డానికి వీలు క‌ల్పిస్తుంద‌ని చెప్పారు. కోవిడ్ -19 బారిన ప‌డిన‌ట్టు చెప్పుకోవ‌డం , ఏదో క‌ళంకం అన్న భావ‌న తొల‌గించేందుకు  పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల‌ను  చైత‌న్య‌వంతుల‌ను చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు., ఇది సకాలంలో రిపోర్టింగ్, క్లినికల్ మేనేజ్‌మెంట్  మరణాల రేటు తగ్గింపున‌కు దోహదం చేస్తుంది.
ఇప్ప‌టివ‌ర‌కూ దేశంలో 14,183 మంది ప్ర‌జ‌లు వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి వెళ్ళారు. గ‌త 24 గంట‌ల‌లో  1457 మంది పేషెంట్లకు వ్యాధిన‌య‌మైంది. దీనితో మొత్తం రిక‌వ‌రీ రేటు 28.72 శాతానిక పెరిగింది. ప్ర‌స్తుతం దేశంలో కోవిడ్ -19 నిర్ధారిత కేసులు 49,391 . నిన్న‌టినుంచి దేశ‌వ్యాప్తంగా  2958 కోవిడ్ నిర్ధారిత కేసులు న‌మోద‌య్యాయి.
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత స‌మాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గ‌ద‌ర్శ‌కాలు, ఇత‌ర సూచ‌న‌ల కోసం క్ర‌మం త‌ప్ప‌కుండా గ‌మ‌నించండి : https://www.mohfw.gov.in/.
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాల‌పై త‌మ ప్ర‌శ్న‌ల‌ను technicalquery.covid19[at]gov[dot]in  ఈమెయిల్‌కు పంపవ‌చ్చు. ఇత‌ర ప్ర‌శ్న‌ల‌ను ncov2019[at]gov[dot]in .కు పంప‌వచ్చు.
కోవిడ్ -19పై ఏవైనా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల కోసం కేంద్ర ఆరోగ్య‌,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ హెల్ప్‌లైన్ నెంబ‌ర్ :  +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయ‌వ‌చ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు.
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

 

*****


(Release ID: 1621551) Visitor Counter : 262