ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్ డేట్స్
Posted On:
04 MAY 2020 6:21PM by PIB Hyderabad
ఇప్పటివరకూ 11,706 మందికి కోవిడ్ -19 వ్యాధి నయమైంది
భారత ప్రభుత్వం, కోవిడ్ -19 సంక్షోభ తీవ్రతకు అనుగుణంగా , ముందస్తు చర్యలు, సానుకూల వైఖరి ద్వారా రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలతో కలసి సమిష్టి కృషితో వైరస్ నివారణ, నియంత్రణ, నిర్వహణ కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిని క్రమం తప్పకుండా ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నారు
కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, ఈరోజు మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ నరోత్తం మిశ్రాతో సమావేశమయ్యారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు, ఈ సమావేశంలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లో కోవిడ్-19 నియంత్రణ, నిర్వహణకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. వైరస్ కాంటాక్ట్‌కు కారకులైన వారని గుర్తించడం, నిఘా, ఇంటింటికీ తిరిగి యాక్టివ్ కేసులను గుర్తించడం, కోవిడ్ తో సంబంధం లేని కేసుల కుసంబంధించిన వాటి విషయంలో ఏం చేయాలి తదితర అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించడం వంటి అంశాలను ఈ సందర్భంగా చర్చించారు.
కోవిడ్ వైరస్ నుంచి కోలుకున్న వారు, మరణించిన వారికి సంబందించిన గణాంకాల ఆధారంగా అన్ని మూసివేసిన కేసులకు సంబంధించిన లెక్కలను పరిశీలిస్తే ఆస్పత్రులలో క్లినికల్ మేనేజ్‌మెంట్ స్టేటస్ తెలుస్తుంది. 2020 ఏప్రిల్ 17 నుంచి ఈ గణాంకాలను పరిశీలించి చూసినపుడు పరిస్థితిలో మెరుగుదల కనిపించినట్టు గుర్తించారు. ఏప్రిల్ 17 కు ముందు పరిస్థితి, ఆ తర్వాత పరిస్థితిని గమనించినపుడు (ఏప్రిల్ 17 కు ముందు(ఔట్‌కమ్ శాతం 80:20), ప్రస్తుతం ఔట్‌కం శాతం 90:10 గా ఉంది.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 11,706 మంది కి వ్యాధి నయం అయింది. దీనితో మన మొత్తం రికవరీ రేటు 27.52 శాతం. మొత్తం కోవిడ్ నిర్ధారిత కేసులు 42,533 కు చేరుకున్నాయి. నిన్నటినుంచి 2,553 కోవిడ్ కేసులు పెరిగాయి.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కఠినమైన కంటైన్‌మెంట్ చర్యలు తీసుకోవాలని కేంద్రం పునరుద్ఘాటించింది. ఇలాంటి చర్యల వల్ల కేసుల వ్యాప్తి తగ్గుతుందని తెలిపింది. అలాగే కోవిడ్ కేసుల మెరుగైన చికిత్సకు చర్యలుతీసుకుంటూనే , వైరస్ వ్యాప్తి నిరోధం , నియంత్రపై దృష్టి పెట్టాలని కేంద్రం సూచించింది..
లాక్ డౌన్ సడలించినప్పుడు, భౌతిక దూరానికి సంబంధించిన ప్రోటోకాల్ , ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి, చేతి పరిశుభ్రత , పరిసరాల పరిశుభ్రత వంటి నివారణ చర్యలను అనుసరించాలి. జాగ్రత్తతో, అవగాహనతో అప్రమత్తంగా ఉండటం ద్వారా కోవిడ్ -19 ను ఎదుర్కోవాలి. ఎల్లప్పుడూ ముఖానికి మాస్క్ అడ్డుపెట్టుకావాలి. కంటైన్‌మెంట్ జోన్‌ల వెలుపల కూడా ఈ జాగ్రత్తలు పాటించాలి. కోవిడ్ -19 నిరోధానికి ప్రభుత్వం ప్రకటించిన ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించాలి. నిత్యవసర సరకులు కొనుగోలు చేసేటపుడు, బహిరంగ ప్రదేశాలలో జనం ఎక్కువగా గుమికూడకుండా చూడాలి,
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనల కోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/.
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in .కు పంపవచ్చు.
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
*****
(Release ID: 1621072)
Visitor Counter : 216
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam