రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

దేశంతో కలిసి కోవిడ్-19 యోధులకు కృతజ్ఞతాభివందనలు సమర్పించిన భారత తీర ప్రాంత గస్తీ దళం

Posted On: 02 MAY 2020 5:33PM by PIB Hyderabad

నావికులకుముఖ్యంగా మత్స్యకారుల సంఘంఓడరేవులుఇతర ఏజెన్సీలకు అవగాహన కల్పించడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సామజిక చైతన్య  కార్యక్రమాలను చేపట్టింది భారత తీర ప్రాంత గస్తీ దళం . తద్వారా కరోనావైరస్ (కోవిడ్-19) వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు భారత తీర ప్రాంత గస్తీ దళం (ఐసిజి) సంఘీభావం తెలుపుతుంది. 

ఆయా ప్రాంతాల్లోని పేదలువలస కూలీలకు రేషన్ / ఆహారాన్ని పంపిణీ చేయడంలో ఐసిజి యూనిట్లు స్థానిక పాలన యంత్రాంగానికి సహాయం చేస్తున్నాయి. అంతేకాకుండాకోవిడ్ యోధుల చర్యలను అభినందించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఓడి) తీసుకునే చొరవలో ఐసిజి ముందంజలో ఉంది.

కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రులపై పూలు జల్లడంషిప్పులను విద్యుత్ దీప కాంతులతో అలంకరించడంవంటి కార్యక్రమాలతో ‘ఇండియా థాంక్స్ కోవిడ్ -19 వారియర్స్’ చొరవలో ఐసిజి చురుకుగా పాల్గొంటోంది. 

మారు మూల ప్రాంతాలతో సహా  అండమాన్  నికోబార్ దీవులులక్షద్వీప్మినికోయ్ ద్వీపాల వంటి  సుదూర ద్వీప భూభాగాలతో సహా దేశంలోని మొత్తం తీరప్రాంతాన్ని కప్పి ఉంచే 25 ప్రదేశాలలో   మే 3వ తేదీన ఓడలను దేదీప్యమాన విద్యుత్ దీపాలంకరణ చేయనున్నారు. దీని ద్వారా కోవిడ్-19 పై పోరాటం చేస్తున్న యోధులకు తమ ఓడల నుండి అభినందనలు సమర్పించుకున్నారు. దీనితో పాటు ఐసిజి హెలికాప్టర్లు ఐదు చోట్ల కోవిడ్ -19 ఆసుపత్రులపై పూల వానను కురిపించనున్నాయి.

కృతజ్ఞతాభివందనాలు సమర్పించే ఈ కార్యక్రమంలో 46 తీరప్రాంత గస్తీ దళాల షిప్పులు, 10హెలికాఫ్టర్లు పాల్గొనున్నాయి. ఈ కార్యక్రమాలు జరిగే ప్రాంతాలు:

వరుస సంఖ్య

ప్రదేశం

నౌక 

హెలికాప్టర్ 

01

పోర్బందర్ 

దమన్

02

ఓఖ 

ముంబై 

03

రత్నగిరి 

గోవా 

04

దహను 

చెన్నై 

05

మురుద్ 

పోర్ట్ బ్లెయిర్ 

06

గోవా 

 

07

న్యూ మంగళూరు 

 

08

కావ్రట్టి 

 

09

టుటికోరిన్ 

 

10

కన్యాకుమారి 

 

11

చెన్నై 

 

12

కృష్ణపట్నం 

 

13

నిజాంపట్నం 

 

14

పుదుచ్చేరి 

 

15

కాకినాడ 

 

16

పరదీప్ 

 

17

గోపాలపుర్/పూరి 

 

18

సాగర్ ఐలాండ్ 

 

19

పోర్ట్ బ్లెయిర్ 

 

20

దిగిలిపూర్ 

 

21

మయాబందుర్ 

 

22

హట్బే 

 

23

క్యాంప్బెల్ బే 

 

 

ఐసిజి నౌకలువిమానాలు సముద్రంలో గట్టి నిఘా తో ఉంటాయి. భారత ఉపఖండం చుట్టూ సముద్ర ప్రాంతాలు సురక్షితమైనఅత్యంత భద్రతతో కూడిన అప్రమత్తత ఉంటుంది.  తీరప్రాంత నిఘా రాడార్ నెట్‌వర్క్ ద్వారా మన తీరాల వెంబడి 24x7 ఎలక్ట్రానిక్ నిఘా ఉంటుంది. 

                                                *********

 
image.png
image.png
 
 
 
***

(Release ID: 1620477) Visitor Counter : 230