హోం మంత్రిత్వ శాఖ

ట్రక్కులు లేదా వస్తు వాహనాలు స్వేచ్ఛగా కదిలాలి, దేశంలో వస్తువులు మరియు సేవల సరఫరా గొలుసు నిర్వహణ ఆవశ్యకం - రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ సూచన

దేశ వ్యాప్తంగా అంతర్ – రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాల రాకపోకల విషయంలో ప్రత్యేక పాసులు అవసరం లేదనే విషయాన్ని స్థానిక అధికారులకు స్పష్టం చేయండి – కేంద్ర హోం శాఖ

Posted On: 30 APR 2020 7:27PM by PIB Hyderabad

దేశంలోని వివిధ ప్రాంతాల్లో అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ట్రక్కుల కదలికల విషయంలో ఇబ్బందులతో పాటు, ఆయా రాష్ట్రాల స్థానిక అధికారుల వద్ద వివిధ నియమనిబంధనల విషయంలో సమస్యలు ఎదురౌతున్నాయి.

లౌక్ డౌన్ చర్యలపై సవరించిన ఏకీకృత మార్గదర్శకాల ప్రకారం, ఖాళీ ట్రక్లు సహా వస్తు వాహనాల విషయంలో ప్రత్యేక పాసులు అవసరం లేదనది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు మరోసారి స్పష్టం చేసింది.

లాక్ డౌన్ కాలంలో దేశ వ్యాప్తంగా వస్తువులు మరియు సేవల సరఫరా గొలుసు నిర్వహించడానికి వాహనాలు స్వేచ్ఛగా తిరగడం ఎంతో అవసరమని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2020 ఏప్రిల్ 15న కోవిడ్ -19తో పోరాడేందుకు ఏర్పాటు చేసిన లాక్ డౌన్ చర్యలపై సవరించిన ఏకీకృత మార్గదర్శకాలను జారీ చేసింది.

MVA, 15.04.2020 న, COVID-19 తో పోరాడటానికి లాక్డౌన్ చర్యలపై ఏకీకృత సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది.

(https://www.mha.gov.in/sites/default/files/MHA%20order%20dt%2015.04.2020%2C%20with%20Revised%20Consolidated%20Guidelines_compressed%20%283%29.pdf). ఈ ఏకీకృత మార్గదర్శకాలలో ట్రక్కులు / వస్తువుల వాహనాల ద్వారా అన్ని వస్తువుల సరఫరా స్వేచ్ఛగా సాగడానికి అనుమతించబడుతుందని స్పష్టంగా పేర్కొంది.

ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా, పైన పేర్కొన్న సూచనల గురించి జిల్లా అధికారులు మరియు క్షేత్రస్థాయి సంస్థలు సున్నితంగా వ్యవహరించేలా చూడాలని కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. దీని ప్రకారం భూ రవాణా విషయంలో ఎలాంటి అస్పష్టత లేదు. ట్రక్కులు మరియు ఖాళీ ట్రక్కులతో సహా వస్తువుల రవాణా వాహనాలు ఎలాంటి అడ్డంకి లేకుండా అనుమతించబడతాయి.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జారీ చేసిన అధికారిక సమాచారం కోసం ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి.


(Release ID: 1619743) Visitor Counter : 184