రక్షణ మంత్రిత్వ శాఖ
నవ్య కరోనా వైరస్ విచ్ఛిన్నం చేయడానికి మైక్రోవేవ్ స్టెరిలైజర్ అభివృద్ధి
Posted On:
30 APR 2020 6:22PM by PIB Hyderabad
‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్’ మద్దతుతో పని చేస్తున్న పూణేలోని ‘డిఫెన్స్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ’ సంస్థ కోవిడ్-19 వైరస్ విచ్ఛినం చేయడానికి ‘అతులియా’ అనే మైక్రోవేవ్ స్టెరిలైజర్‌ను అభివృద్ధి చేసింది. ‘అతులియా’ అనే మైక్రోవేవ్ స్టెరిలైజర్ 560 నుండి 600 సెల్సియస్ ఉష్ణోగ్రతల పరిధిలో అవకలన తాపన ద్వారా వైరస్ విచ్ఛిన్నమవుతుంది. సరసమైన ధరలో అందుబాటులో ఉండేలా ‘అతులియా’ అనే మైక్రోవేవ్ స్టెరిలైజర్‌ను రూపొందిచడం జరిగింది. ఇది పోర్టబుల్ లేదా స్థిర సంస్థాపన విధానంలో ఏర్పాటు చేసుకొని వినియోగించేలా దీనిని రూపొందించారు. ఈ స్టెరిలైజర్ వ్యవస్థ మానవ / ఆపరేటర్ భద్రత అంశాలను పరీక్షిస్తూ సురక్షితంగా ఉండేలా అభివృద్ధి చేయడమైంది. స్టెరిలైజ్ చేసే వివిధ వస్తువుల పరిమాణం మరియు ఆకారాన్ని బట్టి కేవలం 30 సెకన్ల నుండి నిమిషం వ్యవధిలో ‘అతులియా’ వాటిని క్రిమిరహితం చేస్తుంది. ఈ స్టెరిలైజర్ సుమారు మూడు కిలోగ్రాముల బరువు ఉంటుంది. లోహరహిత వస్తువుల స్టెరిలైజేషన్‌కు కూడా ఉపయోగించేందుకు వీలుగా దీనిని తయారు చేశారు.
***
(Release ID: 1619738)
Visitor Counter : 206
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada