సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

దివ్యాంగుల కోసం కోవిడ్ -19 పరీక్షలు, క్వారంటైన్ సౌకర్యాలు మరియు ఆసుపత్రులు, చికిత్స కేంద్రాల్లో ప్రాథమిక భౌతిక ప్రాప్యత లక్షణాలను నిర్థారించడానికి వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసిన సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

Posted On: 29 APR 2020 5:00PM by PIB Hyderabad

కోవిడ్ -19 పరీక్షలు మరియు దిగ్బంధం సౌకర్యాలతో పాటు ఆసుపత్రులు మరియు ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స కోసం కేంద్రాల్లో సరైన వసతి ప్రకారం దివ్యాంగులు (పి.డబ్య్లు.డి)కోసం ప్రాథమిక భౌతిక ప్రాప్యత లక్షణాలను నిర్థారించాలని సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, వికలాంగుల సాధికారత విభాగం (డి.ఈ.పి.డబ్ల్యు.డి) కార్యదర్శి శ్రీమతి శకుంతల డి.గామ్లిన్ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో, ఈ మహమ్మారి ప్రభావాలను తగ్గించడానికి అనేక కోవిడ్ -19 కేంద్రాలను కంటైనేషన్ యూనిట్లు, ఐసోలేషన్ ట్రీట్మెంట్ సెంటర్లుగా గుర్తించాలని, వైద్య అవసరాల కోసం హోల్డింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయోగశాలల్లో పరీక్షించే సామర్థ్యాన్ని పెంచాలని కోరారు. ప్రస్తుత సంక్షోభంలో దివ్యాంగులకు వారి తక్కువ/ రాజీలేని రోగనిరోధక శక్తి, సమాచారాన్ని గ్రహించగల లేదా అర్థం చేసుకోగల సామర్థ్యం వల్ల మాత్రమే కాకుండా, భౌతిక వాతావరణంలో ప్రాప్యత లక్షణాలు అందుబాటులో లేకపోవడం మరియు అటువంటి కోవిడ్ సంబధిత సౌర్యాల వద్ద అందించిన వాతావరణ వ్యవస్థ కారణంగా కూడా వారికి ముప్పు ప్రమాదం లేకుండా చూడాలని ఇందులో తెలిపారు.

ప్రత్యామ్నాయ ప్రాప్యత ఫార్మాట్లలో సమాచార వ్యాప్తి, వికలాంగులకు చికిత్స (పి.డబ్ల్యు.డి) మరియు భద్రత, ఆరోగ్యకరమైన జీవనం మరియు పి.డబ్ల్యు.డి.లు, అంటెండర్లు, సంరక్షణ ఇచ్చే వారు మరియు సంకేత భాషా వ్యాఖ్యాతలు వంటి ప్రాప్యత చేయగల సేవా ప్రదాతలకు సంబంధించిన మార్గదర్శకాలను డి.ఈ.పి.డబ్ల్యూ.డి ఇప్పటికే ప్రచురించింది. అదనంగా కోవిడ్ -19 పరీక్ష మరియు క్వారంటైన్ సౌకర్యాలతో పాటు ఆసుపత్రులు మరియు ఆరోగ్య కేంద్రాలతో చికిత్స కేంద్రాలలో సహేతుకమైన వసతి ప్రకారం, ప్రాథమిక భౌతిక ప్రాప్యత లక్షణాలు నిర్ధారించబడడం కూడా అవసరం.

ప్రాప్యత యొక్క ఈ ప్రాథమిక లక్షణాలను తెలియజేసేలా అవసరమైన చర్యలను అత్యవసరంగా ప్రారంభించాలని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు అభ్యర్థనలు పంపారు. తద్వారా పి.డబ్య్లు.డిలు పరిమితం చేయబడిన చైతన్యం ఉన్న వ్యక్తులు మరియు అటెండర్లు లేదా సంరక్షకుల మీద ఆధారపడే వారు మరింత అసౌకర్యానికి గురి కాకుండా, ముఖ్యంగా ఈ మహమ్మారి కాలంలో, ప్రాప్యత యొక్క ప్రాథమిక లక్షణాలు ఈ క్రింది విధంగా సూచించారు.

 

1.   అన్ని అపరేటింగ్ మరియు కంట్రోల్ మెకానిజమ్స్ మరియు స్వీయ ఆపరేటెడ్ పరికరాలు (శానిటైజర్ డిస్పెన్సర్లు, గ్లోవ్ కేసులు, సబ్బులు, వాష్ బేసిన్లు) పి.డబ్ల్యు.డి.లకు ముఖ్యంగా వీల్ చైర్ వినియోగదారులకు,అందుబాటులో ఉండాలి.

2.   రంగు మరి కాంట్రాస్ట్ యొక్ ప్రామాణిక అవసరాల ప్రకారం గ్రాఫికల్ మరియు సాధారణ, ప్రముఖ సంకేతాలు ఉండాలి.

3.   రైలింగ్ లతో ర్యాంప్ లు (గ్రేడియంట్ 1:12) అందుబాటులో ఉండాలి.

4.   రిసెప్షన్, పరీక్షా ప్రాంతాలు మరియు ఫార్మసీల్లో కనీసం ఒక తక్కువ ఎత్తు యాక్సెస్ కౌంటర్ అందుబాటులో ఉండాలి.

5.   ముఖ్యమైన వార్తల బహిరంగ ప్రకటనల కోసం ఆడియో ప్రకటనలు మరియు వీడియో శీర్షికలు అందుబాటులో ఉండాలి.

6.   పి.డబ్లు.డి.లకు సహాయం అందించడానికి లిఫ్ట్ లలో ప్రాప్యతను నిర్ధారించుకోవాలి. లేదా కనీసం ఒక లిఫ్ట్ లో ఒక లిఫ్ట్ మ్యాన్ ను అందుబాటులో ఉంచాలి.

7.   అందుబాటులో ఉన్న మరుగుదొడ్లలో పి.డబ్య్లు.డి.ల కోసం సౌకర్యం అందించగల ప్రాంతాలు/ గదులు / వార్డులను కేటాయించాలి.

8.   COVID-19 రోగుల అటెండర్లకు ముఖ్యంగా మేధో వైకల్యం మరియు మానసిక అనారోగ్యంతో ఉన్నవారి విషయంలో వెస్టిబ్యులర్ క్యాబిన్లు ఉండాలి. 

 

***


(Release ID: 1619367) Visitor Counter : 238