కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
లాక్‌డౌన్ సమయంలో 13 లక్షల క్లెయిమ్‌లు పరిష్కరించిన ఇపిఎఫ్ఒ
పిఎంజికెవై ప్యాకేజ్‌కింద 7.40 లక్షల కోవిడ్ -19 క్లెయిమ్‌లతో సహాపరిష్కారం
Posted On:
28 APR 2020 3:52PM by PIB Hyderabad
లాక్‌డౌన్ సమయంలో ఇపిఎఫ్ సంస్జ అత్యంత వేగంగా క్లెయిమ్‌లు పరిష్కరించింది. భారత ప్రభుత్వ కార్మిక , ఉపాధి కల్పన మంత్రిత్వశాక పరిధిలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఒ) మొత్తం 12.91లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించింది. ఇందులో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద(పిఎంజికెవై)పాకేజ్ కింద పరిష్కరించిన 7.40 లక్షల కోవిడ్ -19 క్లెయిమ్ లు కూడా ఉన్నాయి..దీని ప్రకారం మొత్తం రూ 4684.52 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. ఇందులో రూ 2367.65 కోట్ల రూపాయలు పిఎంజికెవై ప్యాకేజ్‌కింద కోవిడ్ క్లెయిమ్‌లు ఉన్నాయి.
కోవిడ్ -19 మహమ్మారి కాలంలోనూ, మినహాయింపు పొందిన పిఎఫ్ ట్రస్టులు కూడా ఈ సందర్భంగా మంచి పనితీరు గమనించడం ఆనందంగా ఉంది. 27.04.2020 నాటికి రూ. ఈ పథకం కింద మినహాయింపు పొందిన పిఎఫ్ ట్రస్టుల ద్వారా, కోవిడ్ -19 కారణంగా 79,743 మంది పిఎఫ్ సభ్యులకు అడ్వాన్సు కింద 875.52 కోట్లు పంపిణీ చేశారు, 222 ప్రైవేట్ రంగ సంస్థలు 54,641 లబ్ధిదారులకు రూ .338.23 కోట్లు, 76 ప్రభుత్వ రంగ సంస్థలు 24,178 లబ్ధిదారులకు రూ .524.75 కోట్లు పంపిణీ చేస్తున్నాయి. 23 సహకార రంగ సంస్థలు 924 మంది క్లెయిమ్ దారులకు రూ .12.54 కోట్లు పంపిణీ చేస్తున్నాయి.
మెస్సర్స్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ముంబై, మెస్సర్స్ హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్. గురుగ్రామ్ మెస్ర్స్ హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ పోవై, ముంబై - ఇవి, క్లెయిమ్‌ల పరిష్కారంలొ అలాగే మొత్తం సొమ్ము పంపిణీ లో అగ్ర భాగాన ఉన్న ప్రైవేట్ రంగంలోని మినహాయింపు పొందిన మొదటి మూడు సంస్థలు,
ఇక ప్రభుత్వ రంగానికి వస్తే, మెసర్స్ ఒ.ఎన్.జి.సి, డెహ్రాడూన్, మెస్సర్స్ నైవేలి లిగ్నయిట్ కార్పొరేషన్ నైవేలి, మెస్సర్స్ బిహెచ్ ఇఎల్ ట్రిచ్‌యారే , గరిష్ట సంఖ్యలో కోవిడ్ -19 ముందస్తు దావాలను పరిష్కరించిన; మినహాయింపు పొందిన మొదటి మూడు సంస్థలు. ఇక మెస్సర్స్ నైవేలి లిగ్నయిట్ కార్పొరేషన్ ,నైవేలి, మెస్సర్స్ ఒ.ఎన్.జి.సి డెహ్రాడూన్, మెస్సర్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం సంస్థలు ఇపిఎఫ్ సభ్యులకు పంపిణీ చేసిన మొత్తం విషయంలో టాప్ 3 సంస్థలుగా నిలిచాయి.
కోవిడ్ -19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా, ఇపిఎఫ్ పథకం నుండి ప్రత్యేక ఉపసంహరణకు తీసుకువచ్చిన ప్రొవిజన్, ప్రభుత్వం ప్రకటించిన పిఎమ్‌జికెవై పథకంలో భాగం.ఇందుకు 2020 మార్చి 28న ఒక అత్యవసర నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం ఇపిఎఫ్ పథకంలో పేరా 68ఎల్ (3) చేర్చారు. ఈ నిబంధన ప్రకారం మూడు నెలల ప్రాథమిక వేతనాలు , డి.ఎ మేరకు తిరిగి చెల్లింపులేని ఉపసంహరణ లేదా ఇపిఎఫ్ ఖాతాలో సభ్యుల క్రెడిట్‌లో ఉన్న 75శాతం వరకు, ఏది తక్కువైతే అది అందించడం జరుగుతుంది.
లాక్‌డౌన్ కారణంగా మూడింట ఒకవంతు సిబ్బంది మాత్రమే పని చేయగలుగుతారు, ఈ క్లిష్ట పరిస్థితిలో ఇపిఎఫ్ఒ తన సభ్యులకు సేవ చేయడానికి కట్టుబడి ఉంది . ఈ పరీక్ష సమయాల్లో వారికి సహాయపడటానికి ఇపిఎఫ్ ఒ కార్యాలయాలు పనిచేస్తున్నాయి.
(Release ID: 1618992)
Visitor Counter : 272
Read this release in:
English
,
Gujarati
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam