నౌకారవాణా మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 వల్ల పోర్ట్ ఉద్యోగులు/కార్మికులు చనిపోతే రూ.50 లక్షల నష్టపరిహారం
నేరుగా పోర్టు నియమించిన కాంట్రాక్టు కార్మికులు, ఇతర కాంట్రాక్టు ఉద్యోగులుతో పాటు పోర్ట్ ఉద్యోగులంతా ఈ పరిథిలోకి వస్తారు

Posted On: 28 APR 2020 3:04PM by PIB Hyderabad

కోవిడ్-19 వల్ల మరణించిన అన్ని ప్రధాన ఓడరేవుల ఉద్యోగులకు నష్టపరిహారం/ ఎక్స్-గ్రేషియా చెల్లించాలని షిప్ప్పింగ్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. చనిపోయిన వారిపై ఆధారపడ్డ వారు/ చట్ట బద్ధమైన సంబంధీకులకు ఈ చెల్లింపు క్రింది విధంగా ఉంటుంది:

 

క్యాటగిరి 

నష్టపరిహారం/ ఎక్స్-గ్రేషియా (రూ.ల్లో)

పోర్టు ఉద్యోగులంతా, పోర్టు నేరుగా నియమించిన కాంట్రాక్టు కార్మికులతో సహా 

50.00 లక్షలు 

ఇతర కాంట్రాక్టు కార్మికులు 

50.00 లక్షలు 

 

పోర్ట్ సంబంధిత విధులను నిర్వర్తించేటప్పుడు కోవిడ్ -19 ప్రభావం కారణంగా ప్రాణ నష్టం జరిగిన పక్షంలో  వర్తించేలా  ఈ  ద్రవ్య పరిహారం ప్రకటించబడింది. మరణానికి కారణం కోవిడ్-19 వల్ల అని నిర్ధారణ చేసుకోవడం, అందుకు నష్టపరిహారం/ ఎక్స్-గ్రేషియా చెల్లింపునకు సంబంధించిన ధ్రువీకరణ అధికారం పోర్ట్ చైర్మన్ దే. ఈ పరిహారం కోవిడ్-19 మహమ్మారి వల్ల మరణం సంభవించినదానికి  మాత్రమే వర్తిస్తుంది.  30.09.2020 వరకు అమలులో ఉంటుంది, ఆ తర్వాత సమీక్షకు లోబడి ఉంటుంది.

 

***(Release ID: 1618935) Visitor Counter : 22