హోం మంత్రిత్వ శాఖ

సింగిల్ బ్రాండ్, మల్టీ బ్రాండ్ మాల్స్ తప్ప కొన్ని రకాల దుకాణాలు తెరిచేందుకు అనుమతించాలని రాష్ర్టప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు హోం మంత్రిత్వ శాఖ ఆదేశం

లాక్ డౌన్ ఆంక్షల సడలింపు హాట్ స్పాట్ లు/ కట్టడి జోన్లకు వర్తించదు

Posted On: 25 APR 2020 12:47AM by PIB Hyderabad

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హాట్ స్పాట్ లు/ కట్టడి జోన్ లు మినహా ఇతర ప్రాంతాల్లో కొన్ని రకాల కార్యకలాపాలను అనుమతిస్తూ 2020 ఏప్రిల్ 15వ తేదీన కోవిడ్-19పై పోరాటానికి సవరించిన ఏకీకృత మార్గదర్శకాలు జారీ చేసింది.

 (https://www.mha.gov.in/sites/default/files/MHA%20order%20dt%2015.04.2020%2C%20with%20Revised%20Consolidated%20Guidelines_compressed%20%283%29.pdf)

వాణిజ్య, ప్రైవేట్ సంస్థల విభాగంలో సడలింపులు ఇస్తూ అన్ని రాష్ట్రప్రభుత్వాలు/  కేంద్రపాలిత ప్రాంతాలకు ఎంహెచ్ఏ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆయా రాష్ర్టాలు/  కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన దుకాణాలు, వాణిజ్య సంస్థల చట్టాల కిందకు వచ్చే నివాస గృహ సముదాయాల్లోని దుకాణాలు సహా జనావాస ప్రాంతాల్లోని దుకాణాలు తెరిచేందుకు అనుమతించవచ్చు.

మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలోకి వచ్చేవి మినహా అన్ని మార్కెట్ సముదాయాల్లోని దుకాణాలు తెరిచేందుకు అనుమతించవచ్చు. అయితే ఏ ప్రదేశంలోనూ సింగిల్ బ్రాండ్, మల్టీ బ్రాండ్ మాల్స్ లోని దుకాణాలకు మాత్రం అనుమతి ఇవ్వకూడదు.

నిబంధనలకు అనుగుణంగా తెరిచే దుకాణాలేవైనా 50 శాతం పనివారితో మాత్రమే పని చేయాలి. అందరూ మాస్క్ లు ధరించడం, సామాజిక దూరం నిబంధనలు పాటించడం తప్పనిసరి. ఈ సడలింపులేవీ హాట్ స్పాట్ లు, కట్టడిజోన్లకు వర్తించవు.

***
 


(Release ID: 1618124) Visitor Counter : 277