కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
పిఎంజికెవై కింద మినహాయింపు పొందిన పిఎఫ్ ట్రస్టుల 40,826 మంది సభ్యులకు రూ 481.63 కోట్ల రూపాయల పంపిణీ
Posted On:
20 APR 2020 6:57PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఇపిఎఫ్ పథకం నుండి ప్రత్యేక ఉపసంహరణకు ప్రభుత్వం వీలు కల్పించడం, ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (PMGKY) పథకంలో భాగం. ఇందు కోసం , 2020 మార్చి 28న ఒక అత్యవసర నోటిఫికేషన్ ద్వారా ఇపిఎఫ్ పథకంలో పేరా 68 L (3) ను ప్రవేశపెట్టడం జరిగింది.
ఈ ప్రొవిజన్ కింద మూడు నెలల వరకు మూల వేతనాలు, కరవు భత్యం లేదా ఇపిఎఫ్ చందాదారు ఖాతాలో నిల్వ ఉన్న 75 శాతం మొత్తం వరకు ఏది తక్కువ అయితే అది తిరిగి చెల్లించనవసరం లేని ఉపసంహరణకు వీలు కల్పిస్తారు. ఇంతకంటే తక్కువ మొత్తానికి కూడా సభ్యుడు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో మినహాయింపు పొందిన పి.ఎఫ్ ట్రస్టులు కూడా మంచిపనితీరు కనబరిచడం సంతోషం కలిగించే విషయం.
17.04.2020 మధ్యాహ్నం నాటికి మినహాయింపు పొందిన పిఎఫ్ ట్రస్టులు కోవిడ్ -19 కోసం పేరా 68-ఎల్ కింద 40,826 మంది పిఎఫ్ సభ్యులకు రూ481.63 కోట్లు (రూ. 481,63,76,714) ముందుగానే పంపిణీ చేశాయి.
మినహాయింపు పొందిన మొదటి పది ఎస్టాబ్లిష్ మెంట్లు:
మినహాయింపు పొందిన కొన్ని సంస్థలు కూడా ఈ విషయంలో మంచి పని తీరు కనబరచాయి. 17.04.2020 నాటికి, కోవిడ్ -19 క్లెయిమ్‌ల కోసం పంపిణీ చేసిన మొత్తానికి సంబంధించి టాప్ 10 మినహాయింపు పొందిన సంస్థలు క్రింద సూచించడం జరిగింది:
క్రమ
సంఖ్య
|
ఎస్టాబ్లిష్‌మెంట్ పేరు
|
కోవిడ్ -19 క్లెయిమ్ ల
కిందఅందుకున్న దరఖాస్తులు
|
పరిష్కరించిన
కోవిడ్ -19
క్లెయిములు
|
మెత్తం
పంపిణీ
|
1
|
నైవేలి లిగ్నయిట్ కార్పొరేషన్,నైవేలి,701- కడలూరు , 607802
|
3255
|
3255
|
84,44,00,000
|
2
|
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, ముంబాయి.
|
9373
|
9373
|
43,34,04,641
|
3
|
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, వైజాగ్
|
1708
|
1708
|
40,99,37,800
|
4
|
ఎన్.టి.పి.సి లిమిటెడ్, ఢిల్లీ
|
925
|
925
|
28,74,21,531
|
5
|
హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్
,హిందూస్థాన్ఇన్ స్ట్రుమెంట్ లిమిటెడ్.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ ,గుర్గావ్
|
6938
|
4415
|
27,14,03,862
|
6
|
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్,ఢిల్లీ
|
1263
|
1089
|
26,17,32,403
|
7
|
ఒఎన్ జిసి , డెహ్రాడూన్
|
2297
|
1723
|
24,17,00,000
|
8
|
బిహెచ్ఇఎల్ ఆర్.సి.పురం
|
1367
|
1199
|
22,22,15,000
|
9
|
మెస్సర్స్ బిహెచ్ ఇ ఎల్, భోపాల్
|
1758
|
926
|
16,42,00,001
|
10
|
హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ముంబాయి.
|
461
|
461
|
14,33,10,000
|
***
(Release ID: 1616505)
|