PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 14 APR 2020 7:07PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 

  • జాతీయ దిగ్బంధాన్ని మే 3దాకా పొడిగిస్తున్నట్లు ప్రకటించిన ప్రధానమంత్రి; ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరం తప్పక పాటించాలని ప్రజలకు వినతి
  • దేశంలో నిన్నటి నుంచి 1,211 కోవిడ్‌-19 కొత్త కేసులు, 31 మరణాలు నమోదయ్యాయి
  • దేశవ్యాప్తంగా అన్ని ప్రయాణికుల రైళ్లు మే 3వ తేదీదాకా రద్దు
  • కార్మికుల వేతన సంబంధ సమస్యల పరిష్కారానికి 20 కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసిన కార్మికశాఖ
  • భారత ఔషధ పరిశ్రమ దేశ అవసరాలకు తగినట్లుగా అత్యవసర మందులను తయారుచేస్తోంది

 

కోవిడ్‌-19పై ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి తాజా సమాచారం

దేశంలో నిన్నటినుంచి కొత్తగా నమోదైన కోవిడ్‌-19 నిర్ధారిత కేసులు 1,121కాగా- 31 మరణాలు కూడా నమోదయ్యాయి. వైరస్‌ బారినపడి కోలుకున్న/పూర్తిగా నయమైన 1,036  మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. ఇక నేటివరకూ కోవిడ్‌-19 రోగుల చికిత్స కోసం 1,06,719 ఏకాంత చికిత్స పడకలు, 12,024 ఐసీయూ పడకలతో 602 ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటయ్యాయి.

మరిన్ని వివరాలకు :  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614468

జాతీయ దిగ్బంధాన్ని మే 3వ తేదీకా పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటన

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కోవిడ్‌-19మీద భారత్‌ పోరాటంపై దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ మేరకు జాతీయ దిగ్బంధాన్ని మే 3వ తేదీదాకా పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, స్వల్ప ముప్పున్న ప్రాంతాల్లో ఏప్రిల్‌ 20 నుంచి కొన్ని ఆంక్షలను సడలిస్తామని, తీవ్ర ముప్పుగలవిసహా ఎక్కువ కేసులు నమోదైన ప్రదేశాల్లో మాత్రం నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఈ దిగ్బంధ సమయంలో వృద్ధుల రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవడం, సామాజిక దూరం పాటించడంసహా ఏడు సూత్రాలను కఠినంగా అనుసరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దిగ్బంధం విధింపువల్ల దేశానికి మేలు కలిగిందని ప్రధానమంత్రి చెప్పారు. ఆర్థికరంగ పరిణామాలరీత్యా కష్టాలున్నప్పటికీ దేశంలోని అనేకమంది ప్రాణాలకు రక్షణ లభించడాన్ని బట్టి దిగ్బంధం సరైన మార్గమేనని స్పష్టమైందన్నారు.

మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614332

ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614258

కోవిడ్‌-19 దిగ్బంధాన్ని మే 3దాకా పొడిగించిన దృష్ట్యా ప్రయాణికుల రైళ్లన్నీ రద్దు

యూటీఎస్‌, పీఆర్‌ఎస్‌సహా టికెట్‌ కౌంటర్లన్నిటినీ తదుపరి ఆదేశాలు జారీచేసేదాకా మూసివేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. అలాగే ఈ-టికెట్లుసహా అన్ని రకాల రైలు ప్రయాణ టికెట్ల ముందస్తు రిజర్వేషన్‌ ఉండదని పేర్కొంది. అయితే, ఆన్‌లైన్‌ద్వారా టికెట్ల రద్దుకు వెసులుబాటు ఉంటుందని తెలిపింది. దిగ్బంధం వల్ల రద్దుచేసిన రైళ్లకు రిజర్వేషన్‌ చేసుకున్న టికెట్లపై పూర్తి సొమ్ము వాపసు లభిస్తుందని పేర్కొంది. అంతేకాకుండా ఇప్పటిదాకా రద్దుకాని రైళ్లకు రిజర్వేషన్‌ చేసుకున్నవారికి కూడా టికెట్లు రద్దు చేసుకుంటే పూర్తిసొమ్ము వాపసు లభిస్తుందని తెలిపింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614340

కోవిడ్‌-19పై పోరుకోసం మే 3దాకా జాతీయ దిగ్బంధాన్ని పొడిగించే నిర్ణయం ప్రజల ప్రాణరక్షణకే కావచ్చు: శ్రీ అమిత్‌ షా

కోవిడ్‌-19పై పోరు దిశగా జాతీయ దిగ్బంధాన్ని మే 3వ తేదీదాకా పొడిగించాలన్న నిర్ణయంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ప్రాణరక్షణకే ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614355

దిగ్బంధం సందర్భంగా 20 రోజుల్లో వెయ్యి గూడ్సు రైళ్ల ఆహారధాన్యాలు రవాణా చేసిన ఎఫ్‌సీఐ

ఆహారధాన్యాల రవాణాలో భారత ఆహార సంస్థ అరుదైన ఘనత సాధించింది. ఈ మేరకు దిగ్బంధం సమయంలో 24.03.2020 నుంచి 20 రోజుల్లో వెయ్యి గూడ్సురైళ్ల ద్వారా దాదాపు 30 లక్షల టన్నుల ఆహారధాన్యాలను రవాణా చేసింది. మరోవైపు ఇదే వ్యవధిలో 950 గూడ్సు రైళ్ల (27 లక్షల టన్నుల) ఆహార ధాన్యాలను స్వీకరించింది. మొత్తంమీద దిగ్బంధం మొదలైన నాటినుంచి ఎఫ్‌సీఐ రోజుకు సగటున 3 లక్షల టన్నుల (ఒక్కొక్కటి 50కిలోలుగల 60 లక్షల సంచులు) ఆహారధాన్యాలను పంపడం, దించుకోవడం జరిగింది. సాధారణ సగటుతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614199

కార్మికుల వేతన సంబంధ సమస్యల పరిష్కారం కోసం 20 కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసిన కార్మిక మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 నేపథ్యంలో దేశవ్యాప్తంగా తలెత్తిన కార్మిక వేతన సంబంధ సమస్యల పరిష్కారం కోసం చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ (సీఎల్‌సీ) (సి) ఆధ్వర్యాన కేంద్ర కార్మిక-ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ 20 కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614322

ఈఎస్‌ఐ చందాల దాఖలుకు గడువును పొడిగించిన ఈఎస్‌ఐసి

కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ కారణంగా దేశంలోని అనేక సంస్థలు తాత్కాలికంగా మూతపడటంతో కార్మికులకు పని కరవైంది. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలకు, కార్మికులకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దీంతోపాటు ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) కూడా తమ భాగస్వాములకు... ప్రత్యేకించి యాజమాన్యాలు, బీమాదారులుసహా కోవిడ్‌-19పై పోరును బలోపేతం చేసేవిధంగా అనేక చర్యలు చేపట్టింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614519

కోవిడ్‌-19 సంక్షోభానంతరం పరిశ్రమల పునఃప్రారంభానికి ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుంది: పారిశ్రామికరంగ ప్రతినిధులకు శ్రీ నితిన్‌ గడ్కరీ హామీ

కోవిడ్‌-19 సంక్షోభం తర్వాత పరిశ్రమల పునఃప్రారంభానికి ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని కేంద్ర రోడ్డురవాణా-జాతీయ రహదారులు-ఎంఎస్‌ఎంఈ శాఖల మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇవాళ ఫిక్కి ప్రతినిధులతో వెబ్‌ ఆధారిత సదస్సుద్వారా ఆయన ముచ్చటించారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న పలు ఆర్థిక పరమైన నిర్ణయాల గురించి మంత్రి వారికి వివరించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614509

కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ పత్రికా ప్రకటన

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614385

కోవిడ్‌-19పై పోరాటంలో దేశానికి తోడ్పాటునిచ్చే దిశగా పలు చర్యలు చేపట్టిన నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన మంత్రిత్వ శాఖ

నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన మంత్రిత్వ శాఖ తన పరిధిలోని ఎంఎస్‌డీఈ నైపుణ్య పర్యావరణ వ్యవస్థ కింద శిక్షణ పొందిన 1,75,000 మంది ఆరోగ్యరంగ వృత్తి నిపుణులను రాష్ట్రాలకు అందించింది. అలాగే వివిధ రాష్ట్రాలకు క్వారంటైన్‌/ఏకాంత చికిత్స సెంటర్ల కోసం 33 క్షేత్రస్థాయి ఇన్‌స్టిట్యూట్లను అప్పగించింది. అలాగే జనశిక్షణ సంస్థాన దాదాపు 5 లక్షల మాస్కులు తయారుచేసి ఇచ్చింది. దిగ్బంధం కొనసాగినంత కాలం శిక్షణార్థులందరికీ పూర్తి శిక్షణ భత్యం ఇవ్వాలని అన్ని శిక్షణ సంస్థలనూ ఆదేశించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614334

కోవిడ్‌-19 సంక్షోభం ముగిశాక వ్యవసాయ రంగ ఎగుమతుల పునఃప్రారంభం కోసం  సంప్రదింపులకు ప్రభుత్వం శ్రీకారం

కోవిడ్‌-19 నేపథ్యంలో వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తుల ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై తాజా సమాచారం స్వీకరించేందుకు కేంద్ర వ్యవసాయ-సహకార-రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ కార్యదర్శి వారితో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా చర్చించారు. ఈ సమాచారం ఆధారంగా ప్రస్తుత సంక్షోభం నుంచి వారికి ఊరట కల్పించేందుకు మంత్రిత్వశాఖ అర్థవంతమైన చర్యలు తీసుకోనుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614386

కోవిడ్‌-19 దిగ్బంధ సమయంలో గగనతల కార్యకలాపాలకు మద్దతుగా  విశాఖపట్నంలోని నావికాదళ విమాన స్థావరం నిరంతర లభ్యత

కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధం కోసం దేశవ్యాప్త దిగ్బంధం విధించిన నేపథ్యంలో విశాఖపట్నంలో తూర్పు నావికాదళ కమాండ్‌ పరిధిలోని సంయుక్త వినియోగ ఐఎన్‌ఎస్‌ డేగా విమాన స్థావరాన్ని నిరంతరం వినియోగించుకునే వీలు కల్పించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614324

దిగ్బంధ సమయంలో ఐసీఏఆర్‌ కార్యకలాపాలపై వ్యవసాయశాఖ మంత్రి సమీక్ష

కోవిడ్‌-19వల్ల జాతీయ దిగ్బంధం నేపథ్యంలో రైతులు తమ సమస్యలను అధిగమించే దిశగా భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) చేపట్టిన కార్యకలాపాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ సమీక్షించారు. కాగా, ఐసీఏఆర్‌ పరిధిలోని 3 సంస్థలు మానవులలో కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా, దేశంలోని రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడంలో ఐసీఏఆర్‌ అనేకవిధాలుగా చర్యలు తీసుకుంటోంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614515

ప్రస్తుత కోవిడ్‌-19 దిగ్బంధం నేపథ్యంలో టోకు మార్కెట్లలో రద్దీ తగ్గించేందుకు, ఈ-నామ్‌ కింద సరఫరా క్రమం చురుగ్గా పనిచేసేందుకు అనేక చర్యలు తీసుకున్నాం: శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌

దేశంలో అదనంగా 415 మండీలను కలుపుతూ ఈ-నామ్‌ సదుపాయాన్ని విస్తరించినట్లు మంత్రి తెలిపారు. దీంతో మొత్తం మండీల సంఖ్య 1,000కి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో వ్యవసాయ విపణి సంస్కరణ దిశగా ఆన్‌లైన్‌ వేదిక ఈ-నామ్‌ ఒక భారీ ముందడుగు కాగలదని చెప్పారు. ఈ వేదిక పరిధిలో 1.66 కోట్లమందికిపైగా రైతులు, 1.28 లక్షల మందికిపైగా వ్యాపారులు నమోదైనట్లు తెలిపారు. రైతులు ఎప్పుడు కావాలన్నా తమ పేర్లు నమోదు చేసుకుని, ఉత్పత్తులను ఆన్‌లైన్‌ద్వారా విక్రయించుకోవచ్చునని చెప్పారు. అదేవిధంగా ఏ ప్రదేశంలోని వ్యాపారులైనా సరుకు కొనుగోలు చేయవచ్చునని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614197

దిగ్బంధ సమయంలో రైతులకు, వ్యవసాయ కార్యకలాపాలకు క్షేత్రస్థాయిలో వెసులుబాటు కల్పించే చర్యలు చేపట్టిన ప్రభుత్వం

పీఎం-కిసాన్‌ పథకం కింద 8.31 కోట్ల రైతు కుటుంబాలకు రూ.16,621 కోట్లు విడుదల... ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు 3,985 టన్నుల పప్పు దినుసులు సరఫరా చేయబడ్డాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614144

ఔషధ పదార్థాల, మందుల తయారీ పరిశ్రమలు, సంఘాల ప్రతినిధులతో కేంద్ర ఔషధ మంత్రిత్వశాఖ కార్యదర్శి దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం

ఔషధ పదార్థాల, మందుల, వైద్య పరికరాల తయారీ పరిశ్రమలు, సంఘాలతో ఔషధ మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్‌ పి.డి.వాఘేలా ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత ఔషధ పరిశ్రమల రంగం అత్యవసర మందుల... ప్రత్యేకించి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వంటివాటిని దేశీయ అవసరాలు-విదేశీ డిమాండ్‌కు తగిన పరిమాణంలో తయారుచేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడైంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఈ ఉత్పత్తుల తయారీ, రవాణా సజావుగా సాగేలా మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సహకారం పొందుతున్నట్లు అధికారులు వివరించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614198

స్పీడ్‌ పోస్టుద్వారా మందుల సరఫరా

దిగ్బంధం సమయంలో స్పీడ్‌ పోస్టుద్వారా మందుల సరఫరాకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని తపాలా శాఖ కార్యదర్శిని కేంద్ర సమాచార-న్యాయ-ఐటీశాఖల మంత్రి శ్రీ రవిశంకర్‌ ప్రసాద్‌ ఆదేశించారు. అదే సమయంలో మందుల స్వీకరణ, రవాణాలో తపాలాశాఖ ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614174

దిగ్బంధ సమయంలో ఆహారధాన్యాల పంపిణీపై రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల ఆహారశాఖ మంత్రులతో శ్రీ రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

దిగ్బంధ సమయంలో నిత్యావసరాల అక్రమ నిల్వను అరికట్టాలని, ధరలు అదుపు తప్పకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకూ సూచించింది. కాగా, రబీ మార్కెట్‌ సీజన్‌ 2020-21కి సంబంధించి గోధుమ కొనుగోళ్లు 2020 ఏప్రిల్‌ 15 నుంచి ప్రారంభం కానున్నాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614265

కోవిడ్‌-19 సవాలు నేపథ్యంలో కంపెనీల చట్టం-2013, తదనుగుణ నిబంధనల కింద కంపెనీల సాధారణ, ప్రత్యేక తీర్మానాల ఆమోదంపై స్పష్టీకరణ

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614265

ముమ్మర జనసమ్మర్ద ప్రాంతాల్లో కోవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణపై సాధారణ మార్గదర్శకాలు జారీచేసిన భారత ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహాదారు (పీఎస్‌ఏ) కార్యాలయం

అంటువ్యాధుల నియంత్రణ కోసం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలోగల ‘చేతులు శుభ్రం చేసుకునే’ కేంద్రాలను తక్షణం ఏర్పాటు చేయాలని ఈ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. చౌకగా అందుబాటులోగల ప్రభావవంతమైన ఉపకరణాలు వాటి విలువతో పోలిస్తే ఏ విధంగా అత్యధిక ప్రయోజనం ఇవ్వగలవో పీఎస్‌ఏ కార్యాలయ బృందం రూపొందించిన ఈ మార్గదర్శకాలు వివరిస్తున్నాయి. వీటిని తప్పక అమలు చేయాల్సిందిగా సామాజిక నాయకులను, స్వచ్ఛంద సంస్థలను ప్రొఫెసర్‌ రాఘవన్‌ కోరారు. హస్త పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్యం ఎంత అవసరమో నొక్కిచెప్పడంతోపాటు కీలక చర్యలను సూచించడమే ఈ మార్గదర్శకాల లక్ష్యమని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614144

కోవిడ్‌-19 నమూనాల సేకరణ కోసం కియోస్క్‌ రూపొందించిన డీఆర్‌డీవో

డీఆర్‌డీవో పరిధిలోని డీఆర్‌డీఎల్‌ సంస్థ హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐసీ శాఖ సహాయంతో ఈ యూనిట్‌ను రూపొందించింది. ‘కోవ్‌శాక్‌’ (COVSACK) పేరిట పిలిచే ఈ కియోస్క్‌ సహాయంతో ఆరోగ్య కార్యకర్తలు అనుమానిత కోవిడ్-19 బాధితుల నుంచి నమూనాలను సేకరించవచ్చు. పరీక్షల కోసం వచ్చే రోగులు ఈ కియోస్క్‌ గుండా నడిచేటప్పుడు అందులో అమర్చిన గ్లోవ్స్‌తో ఆరోగ్య కార్యకర్తలు బయటనుంచే వారి నాసిక, నోటి స్రావాలను సేకరిస్తారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614475

దేశంలో కోవిడ్‌-19 వ్యాప్తి నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్న పంచాయతీలు

అన్ని పంచాయతీల్లోనూ వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాలు, పోస్టర్లు, గోడరాతలతో అవగాహన పెంపు చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే రోగకారక నిర్మూలన ద్రవాలు చల్లడం, స్థానిక తయారీ రక్షణ సామగ్రి పంపిణీతోపాటు పేదల ముంగిటకు ఉచిత రేషన్‌, ఆర్థిక సహాయం, నిత్యావసరాల సరఫరా చేస్తున్నాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614471

కోవిడ్‌-19పై పోరులో వివిధ వ్యూహాలు, పరిష్కారాలను అనుసరిస్తున్న పీసీఎంసీ

పారిశుధ్య సేవలు, వ్యర్థాల నిర్వహణలో పింప్రి చించివాడ్‌ పురపాలక సంస్థ (పీసీఎంసీ) వినూత్న చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఇటీవలే కోవిడ్‌-19పై పోరాటంలో పీసీఎంసీ నిఘా, సత్వర ప్రతిస్పందనాత్మకత ప్రపంచం దృష్టికొచ్చాయి. వైరస్‌ వ్యాప్తి నిరోధం కోసం పురపాలిక అనేక వినూత్న, ప్రాముఖ్యంగల చర్యలు చేపట్టింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614144

రెండో విడత దిగ్బంధ కాలంలో విద్యార్థుల కోసం సుదృఢ భారతం-సీబీఎస్‌ఈ ద్వారా తొలిసారిగా శారీరక దృఢత్వ కార్యకలాపాలు

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఉద్యమం ‘సుదృఢ భారతం’ (ఫిట్‌ ఇండియా) కింద ‘ఫిట్‌ ఇండియా యాక్టివ్‌ డే’ పేరిట చేపట్టిన ప్రత్యక్ష దృఢత్వ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో కొత్త దృఢత్వ కార్యకలాపాలు ప్రారంభించింది. ఈసారి దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల కోసం ఫిట్‌ ఇండియా సహకారంతో కేంద్ర మాధ్యమిక విద్యాబోర్డు దృఢత్వ కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆరోగ్య జీవనంపై ఆయుష్‌ మంత్రిత్వ శాఖ జారీచేసిన మార్గదర్శకాలను విద్యార్థులకు బోధించనున్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614390

విద్యాభ్యాసానికి నోచుకోనివారి కోసం విద్యను వారి ముంగిటకు తీసుకెళ్లడంపై హెచ్‌ఆర్‌డి శాఖలోని ఎన్‌ఐఓఎస్‌ వినూత్న విధానం

కోవిడ్‌-19 నేపథ్యంలో ఎన్‌ఐఓఎస్‌ వినూత్న రీతిలో స్కైప్‌ద్వారా ప్రత్యక్ష పాఠాల బోధనను ప్రారంభించింది. ఇందుకోసం కేవీఎస్‌, ఎన్‌వీఎస్‌, సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీల సహకారం తీసుకోవడంతోపాటు స్వయంప్రభ డీటీహెచ్‌ చానెళ్లను వినియోగించుకుంటోంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614474

ఐఎస్‌వో క్లాస్‌-3 ప్రమాణాలతో 1.10 లక్షల కవరాల్స్‌ తయారు చేయనున్న ఓఎఫ్‌బీ

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు (ఓఎఫ్‌బీ) ప్రస్తుతం ఐఎస్‌వో క్లాస్‌-3 ప్రమాణాలతో కవరాల్స్‌ సరఫరాను ప్రారంభించింది. ఇందులో భాగంగా హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌ నుంచి వచ్చిన ప్రారంభ ఆర్డరు మేరకు 1.10 లక్షల కవరాల్స్ తయారీని 40 రోజుల్లోగా పూర్తిచేయనుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614357

‘దేఖో అప్నాదేశ్‌’ పేరిట వెబినార్‌ సిరీస్‌ను ఇవాళ్టినుంచి ప్రారంభించిన పర్యాటకశాఖ

దేశంలోని అనేక సందర్శనీయ ప్రాంతాలు, భారతీయ సంస్కృతి-వారసత్వాల గురించి సమగ్ర సమాచారమిచ్చే దిశగా కేంద్ర పర్యాటక శాఖ నేటినుంచి ‘దేఖో అప్నాదేశ్‌’ (మన దేశాన్ని చూద్దాం) పేరిట వెబినార్‌ సిరీస్‌ను ప్రారంభించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614392

ఎన్‌ఎఫ్‌ఎల్‌ ద్వారా రైతులకు నిరాటంకంగా యూరియా సంబంధ ఉత్పత్తుల లభ్యత

కోవిడ్‌-19వల్ల జాతీయ దిగ్బంధం కొనసాగుతున్న నేపథ్యంలో రైతులకు నిరాటంకంగా యూరియా సంబంధ ఉత్పత్తుల నిరంతర లభ్యతకు నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ చర్యలు చేపట్టింది. ఈ మేరకు 100 శాతం ఉత్పాదక సామర్థ్యానికి మించి ఉత్పత్తిని కొనసాగిస్తోంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614393

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • అరుణాచల్‌ ప్రదేశ్‌: రాష్ట్రంలోని హోలోంగి తనిఖీ కేంద్రం వద్ద చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వ్యక్తిని అధికారులు పట్టుకుని వైద్య పరీక్ష చేయించడంతోపాటు క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.
  • అసోం: అసోంలోని గువహటి ఐఐటీలో ఒక బృందం వ్యక్తిగత రక్షణ సామగ్రి కిట్లపై చల్లేందుకు వీలైన  సూక్ష్మకణ నాశక పూతను రూపొందించింది. దీనివల్ల సదరు సామగ్రి మీదకు వ్యాపించే సూక్ష్మకణాలు ఈ పూత సోకగానే నాశనమవుతాయి.
  • మణిపూర్‌: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద బియ్యం పంపిణీని ముఖ్యమంత్రి సమీక్షించారు.
  • మిజోరం: రాష్ట్రానికి ఇవాళ భారత వాయుసేనకు చెందిన డోర్నియర్‌ విమానంలో చేరిన 32 కిలోల ఐసీఎంఆర్‌ టెస్టింగ్‌ కిట్లను ప్రభుత్వం ఐజ్వాల్‌లోని జోరమ్‌ వైద్య కళాశాలకు పంపింది.
  • నాగాలాండ్‌: రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కోవిడ్‌-19 పర్యవేక్షక బృందంలో 9 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రభుత్వం సభ్యులుగా చేర్చింది. కాగా, రాష్ట్రంలో తొలి కోవిడ్‌-19 రోగిని గుర్తించడం అవసరమని, తద్వారా అతడితో సంబంధంగలవారిని గుర్తించడం అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
  • సిక్కిం: రాష్ట్రంలో దిగ్బంధాన్ని 2020 మే 3వ తేదీదాక పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ఏప్రిల్‌ 20వ తేదీన సడలించే అవకాశం ఉంది.
  • త్రిపుర: దిగ్బంధం ఉపసంహరణ తర్వాత చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం కోరిన మేరకు ముఖ్యమంత్రికి 6,000 సలహాలు-సూచనలు అందాయి.
  • కేరళ: దేశంలోని రాష్ట్రాల ఆర్థిక అవసరాలను తీర్చడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని కేరళ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రిజర్వు బ్యాంకుద్వారా రుణాలు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేసింది. కాగా, తదుపరి సూచనలు అందేదాకా రాష్ట్రంలో ప్రస్తుత ఆంక్షలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రాష్ట్రంలో నిన్న సాయంత్రం వరకూ 197 మంది కోలుకోగా, 178 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. మరో 1,12,183 మంది పరిశీలన పరిధిలో ఉన్నారు.
  • తమిళనాడు: చెన్నైలో మరణించిన నెల్లూరు డాక్టరుకు స్థానికుల నిరసనల నడుమ అధికారులు పటిష్ఠ బందోబస్తుతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, బుధవారం నుంచి ఇంటింటి పరీక్షలకు చెన్నై కార్పొరేషన్‌ సిద్ధమైంది. మాస్కులు ధరించకుండా కార్లలో ప్రయాణిస్తున్నవారిని పోలీసులు అరెస్ట్‌ చేసి, కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 1,173కు చేరిన నేపథ్యంలో 11 మరణాలు నమోదు కాగా, 58 మందికి వ్యాధి నయమైంది.
  • కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ 11 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 258కి చేరింది. మృతుల సంఖ్య 9కి చేరగా, నయమై ఇళ్లకు వెళ్లినవారి సంఖ్య 65గా ఉంది.
  • ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులద్వారా విద్యాభ్యాసం చేయాలని సూచించింది. కాగా, అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఉంటున్న వలస కార్మికులు పోలీసులతో ఘర్షణకు దిగారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 473కు చేరగా, మృతులు 9 మంది; నయమైనవారు 14 మంది ఉన్నారు. ఇక కేసుల సంఖ్యరీత్యా గుంటూరు 109, కర్నూలు 91, నెల్లూరు 56, కృష్ణా 44, ప్రకాశం 42, కడప 31 వంతున అగ్రస్థానాల్లో ఉన్నాయి.
  • తెలంగాణ: హైదరాబాద్‌లోని 126 ప్రాంతాలను నియంత్రణ సమూహాలుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కాగా, దిగ్బంధం కొనసాగింపు ప్రకటనతో వలస కార్మికులు నగరం వీడి వెళ్లేందుకు యత్నించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 592కు చేరగా, 103 మందికి వ్యాధి నయమై ఇళ్లకు వెళ్లారు. మరో 472 మందికి చికిత్స కొనసాగుతోంది.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో నేడు 121 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,455కు చేరింది. ఇవాళ నమోదైన కేసులలో ముంబై 92, నవీ ముంబై 13, థానె 10, వసాయ్‌-విరార్‌ 5, రాయ్‌గఢ్‌ 1 వంతున ఉన్నాయి.
  • గుజరాత్‌: రాష్ట్రంలో ఇవాళ 45 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 617కు చేరింది. వీటిలో అహ్మదాబాద్‌ 31, సూరత్‌ 9, మెహ్‌సానా 2సహా భావ్‌నగర్‌, దహోద్‌, గాంధీనగర్‌లలో ఒక్కొక్కటి వంతున ఉన్నాయి (ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ప్రకటన).
  • రాజస్థాన్‌: రాష్ట్రంలో నేడు 72 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క జైపూర్‌లోనే 71 నమోదవగా మరో కేసు ఝన్‌ఝనులో నమోదైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 969కి పెరిగిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
  • మధ్యప్రదేశ్‌: రాష్ట్రంలో 1,171 నమూనాలను పరీక్షించగా, 126 నిర్ధారణ కావడంతో ఒక్కరోజులో నమోదైన కేసుల సంఖ్య రికార్డుస్థాయిని చేరింది. వీరిలో 98 మంది ఇండోర్‌ వాసులు కాగా, 20 మంది భోపాల్‌కు చెందినవారున్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 730గా ఉంది.
  • గోవా:  ఈ ఉదయం గోవాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 2వద్ద స్థిరంగా ఉంది. కాగా, ఇంతకుముందు నమోదైన 7 పాజిటివ్‌ కేసులలో ఐదుగురు ఇంతకుముందే కోలుకుని ఇళ్లకు వెళ్లారు.

#కోవిడ్‌-19 పై వాస్తవ తనిఖీ

https://pbs.twimg.com/profile_banners/231033118/1584354869/1500x500

*******


(Release ID: 1614556) Visitor Counter : 343