ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ పాకేజ్‌: ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌గ‌తి

--- 32 కోట్ల మందికిపైగా పేద ప్ర‌జ‌లు ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ పాకేజ్ కింద రూ 29,352 కోట్ల రూపాయ‌లు అందుకున్నారు.

---ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న కింద‌5.29 కోట్ల‌మంది ల‌బ్ధిదారుల‌కు ఉచిత రేష‌న్ , ఆహార ధాన్యాల పంపిణీ చేయ‌డం జ‌రిగింది.

--- 97.8 ల‌క్ష‌ల ఉజ్వ‌ల సిలిండ‌ర్లు పంపిణీ చేయ‌డం జ‌రిగింది

---ఇపిఎఫ్ ఒ కి చెందిన 2.1 ల‌క్ష మంది స‌భ్యులు 510 కోట్ల రూపాయ‌ల మొత్తాన్ని నాన్ రిఫండ‌బుల్ అడ్వాన్స్‌గా ఆన్‌ లైన్ ద్వారా విత్‌డ్రా చేసుకునే ప్ర‌యోజ‌నం పొందారు.
---పిఎం- కిసాన్ తొలి వాయిదా : 7.46 కోట్ల మంది రైతుల‌కు రూ 14,946 కోట్ల రూపాయ‌ల బ‌దిలీ.

---జ‌న్‌ధ‌న్ ఖాతాలు క‌లిగిన 19.86 కోట్ల మంది మ‌హిళ‌ల‌కు 9930 కోట్ల రూపాయ‌ల పంపిణీ
---2.82 కోట్ల మంది వ‌యోధికులు, వితంతువులు, దివ్యాంగుల‌కురూ 1400 కోట్లు పంపిణీ.
---2.17 కోట్హ‌మంది భ‌వ‌న, నిర్మాణ రంగ కార్మికులు ఆర్థిక స‌హాయం కింద రూ 3071 కోట్లు అందుకున్నారు.

Posted On: 13 APR 2020 4:11PM by PIB Hyderabad
కోవిడ్ -19 కారణంగా సమాజంలోని బలహీన వర్గాలకు ప్రాథ‌మిక స‌దుపాయాలు కొన‌సాగేలా చేయ‌డానికి,  లాక్ డౌన్  ప్రభావం వారిపై పడకుండా చూసుకోవడానికి, ప్రధాన మంత్రి గారిబ్ కళ్యాణ్ ప్యాకేజీ (పిఎంజికెపి) కింద  1.70 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి ప్రకటించారు. లాక్‌డౌన్ ప్రభావం నుండి అలాంటి వారిని రక్షించడానికి 2020 మార్చి 26 న నిర్మల సీతారామన్ దీనిని ప్ర‌క‌టించారు.

 ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న ప్యాకేజ్‌కింద  ప్ర‌భుత్వంమ‌హిళ‌లు, పేద వ‌యోధికులు, రైతుల‌కు

  ఉచిత ఆహార ధాన్యాలు, న‌గ‌దు చెల్లింపును ప్ర‌క‌టించింది.  ఈప్యాకేజ్ ను వెంట‌నే అమ‌లు చేయ‌డంపై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నాయి.  లాక్‌డౌన్ ప‌రిస్థితుల‌కుఅనుగుణంగా అవ‌స‌ర‌మైన వారికి స‌హాయ‌క చ‌ర్య‌లు వెంట‌నే అందేలా చూసేందుకు ఆర్థిక మంత్రిత్వ‌శాఖ‌, సంబంధిత మంత్రిత్వ శాఖ‌లు ,కేబినెట్ సెక్ర‌టేరియ‌ట్‌, ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటోం

 ల‌బ్ధిదారుల‌కు స‌త్వ‌రం, స‌మ‌ర్థంగా ప్ర‌భుత్వం కల్పించేప్ర‌యోజ‌నాల బదిలీకి ఫైన్‌టెక్‌, డిజిట‌ల్ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ప్ర‌త్య‌క్ష ప్ర‌యోజ‌న బ‌దిలీ అంటే దీనికింద ల‌బ్ధిదారుల‌కు అంద‌వ‌ల‌సిన మొత్తాన్ని  నేరుగా వారి ఖాతాల‌లోనే జ‌మ‌చేస్తారు. దీనివ‌ల్ల మ‌ధ్య‌లో ఇత‌రులు తీసుకోవ‌డానికి వీలుండ‌దు. ఇది స‌మ‌ర్థ‌త‌ను పెంపొందిస్తుంది. ఈ విధానాన్ని అమ‌లు చేస్తున్నారు. ల‌బ్దిదారులు బ్యాంకుకు వెళ్లే అవ‌స‌రం లేకుండానే వారి ఖాతాల‌లోకి నేరుగా మొత్తాన్ని జ‌మ చేస్తున్నారు.
2020 ఏప్రిల్ 13 నాటికి 32.32 కోట్ల మంది ల‌బ్ధిదారులకు ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ (డిబిటి) ద్వారా రూ 29,352 కోట్ల రూపాయ‌లు ఈ ప్యాకేజ్ కింద న‌గ‌దుబ‌దిలీ చేశారు.
ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న‌:
ఇప్ప‌టివ‌ర‌కూ 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏప్రిల్‌కు కేటాయించిన 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌లో 20.11 ల‌క్ష‌ల ట‌న్నుల ఆహార ధాన్యాల‌ను తీసుకున్నాయి. ఏప్రిల్ 2020 నాటికి వారు అందుకోవ‌ల‌సిన ఆహార ధాన్యాల‌కు సంబంధించిన 1.19 కోట్ల రేష‌న్‌కార్డుల‌కు చెందిన 5.29 కోట్ల‌మంది ల‌బ్ధిదారులకు 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 2.65 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌ను పంపిణీ చేశాయి.
ప్ర‌ధాన‌మంత్రి ఉజ్వ‌ల యోజ‌న ల‌బ్ధిదారుల‌కు ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు:-
 ఈ పిఎంయువై పథకం కింద ఇప్పటివరకు మొత్తం 1.39 సిఆర్ సిలిండర్లు బుక్ చేయ‌గా ఇప్పటికే 97.8 లక్షల పిఎంయువై ఉచిత సిలిండర్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న బ్యాలెన్స్‌లో 75 శాతం తిరిగి చెల్లించని అడ్వాన్స్  లేదా 3 నెలల వేతనాలు, ఏదితక్కువ  అయితే దానికి  ఇపిఎఫ్‌ఓ స‌భ్యుల‌కు అనుమ‌తి : -
ఇపిఎఫ్ కు  చెందిన 2.1 ల‌క్ష‌ల స‌బ్యులు ఇప్ప‌టి వ‌ర‌కూ 510 కోట్ల రూపాయ‌ల‌ను ఆన్‌లైన్ ద్వారా ఉప‌సంహ‌రించుకున్నారు.
మూడు నెల‌ల కాలానికి ఇపిఎప్ కంట్రిబ్యూష‌న్‌య‌- వంద‌ మంది కంటే త‌క్కువ కార్మికులు గ‌ల సంస్థ‌ల‌లో నెల‌వారీ వేత‌నం రూ 15,000కంటే త‌క్కువ  అందుకుంటున్న ఇపిఎప్ఒ స‌భ్యుల‌కు వారి వేత‌నంలో 24 శాతం ఇపిఎఫ్ గా కంట్రిబ్యూష‌న్ చెల్లింపు
ఇపిఎఫ్‌ఓకు, ఈ పథకం కోసం 2020.78.74 లక్షల మంది లబ్ధిదారులు, సంబంధిత సంస్థలకు ఇప్పటికే రూ .1000 కోట్లు  విడుదల చేసినట్లు సమాచారం. దీనిని అమలు చేయడానికి ఒక పథకం ఖరారు చేశారు.
త‌ర‌చూ అడిగే ప్ర‌శ్న‌ల‌కు సంబంధించిన స‌మాచారం వెబ్‌సైట్‌లో పొందుప‌ర‌చ‌బ‌డింది.
ఎంఎన్ఆర్ ఇజిఎ:-
01-04-2020 నుంచి రేట్ల పెంపు నోటిఫై చేయ‌బ‌డింద‌. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో 19.56 ల‌క్ష‌ల మంది వ్య‌క్తుల ప‌నిదినాలు క‌ల్పింప‌బ‌డ్డాయి. అంతేకాకుండా  రూ 7100 కోట్ల‌రూపాయ‌ల‌నురాష్ట్రాల‌కు విడుద‌ల చేయ‌డం జ‌రిగింది.
ప్రభుత్వ ఆసుపత్రులు ,ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో ఆరోగ్య కార్యకర్తలకు బీమా పథకం:
ఈ పథకాన్ని న్యూ ఇండియా అస్యూరెన్స్  అమ‌లు చేస్తోంది.22.12 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు ఇది వ‌ర్తిస్తుంది. .
రైతులకు మద్దతు:
 మొత్తం పంపిణీలో, రూ .14,946 కోట్లు మొదటి విడత పిఎం-కిసాన్ కింద చెల్లింపు.
ఈ పథకం కింద, గుర్తించిన 8 కోట్లమంది ల‌బ్ధిదారుల‌లో దాదాపు 7.47 కోట్లు లబ్ధిదారులకు నేరుగా రూ 2,000ల‌ను వారి ఖాతాల‌లో జ‌మ చేయ‌డం జ‌రిగింది..
పిఎంజెడివై మ‌హిళా ఖాతాదారుల‌కు మ‌ద్ద‌తు :
దేశంలో  పెద్ద సంఖ్యలో ఇంటి బాధ్య‌త‌ల‌ను ఎక్కువగా మహిళలు నిర్వహిస్తున్నారు, ప్ర‌స్తుత‌ ప్యాకేజీ ప్రకారం, 19.86 కోట్ల మంది మహిళా జ‌న్‌ ధన్ ఖాతాదారులు తమ ఖాతాలో రూ500 వంతున‌ అందుకున్నారు. 2020 ఏప్రిల్ 13 నాటికి, ఈ ప‌ద్దు కింద‌ పంపిణీ చేసిన మొత్తం 9,930 కోట్లు.
వ‌యోధికులు , వితంతువులు, విక‌లాంగులకు మ‌ద్ద‌తు :

 2.82 కోట్ల వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ,జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్‌ఎస్‌ఎపి) సుమారు 4 1,400 కోట్లను పంపిణీ చేసింది. ప్రతి లబ్ధిదారునికి మొదటి విడతగా ఈ పథకం కింద రూ .500 ఎక్స్-గ్రేషియా నగదు చెల్లించారు. మరో విడత రూ .500 చొప్పున వచ్చే నెలలో చెల్లిస్తారు.
భవన, ఇతర నిర్మాణ కార్మికులకు మద్దతు:
2.17 కోట్ల మందికి పైగా భ‌వ‌న‌,నిర్మాణ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫండ్ నుండి ఆర్థిక సహాయం అందుకున్నారు. దీని కింద రూ .3,071 కోట్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
 
 
                                                             ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ పాకేజ్‌ 

                                               13-04-2020 వ‌ర‌కు జ‌రిగిన‌ మొత్తం ప్ర‌త్య‌క్ష బ‌దిలీ

ప‌థకం       ల‌బ్ధిదారుల సంఖ్య‌                 మొత్తం


పిఎంజెడివై మ‌హిళా ఖాతాదారుల‌కు మ‌ద్ద‌తు  

19.86 Cr(97%)

  9930 Cr

ఎన్ఎస్ ఎపి ( వ‌య‌సు పైబ‌డిన వితంతువులు, దివ్యాంగులు, వ‌యోధికులు)

2.82 Cr (100%)

  1405 Cr

పిఎం-కిసాన్ కింద రైతుల‌కు ఫ్రంట్ లోడెడె చెల్లింపులు

7.47 Cr (out of 8 Cr)

14,946 Cr

బిల్డింగ్‌, ఇత‌ర నిర్మాణ కార్మికుల‌కు మ‌ద్ద‌తు
 

2.17 Cr

   3071 Cr

                         మొత్తం  

32.32 Cr

29,352 Cr



(Release ID: 1614084) Visitor Counter : 316