ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్స్
Posted On:
12 APR 2020 6:38PM by PIB Hyderabad
దేశంలో కోవిడ్-19 వ్యాప్తిని ఎదుర్కొనే ఉమ్మడి కృషిలో భాగంగా, భారత ప్రభుత్వం , రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలసి కోవిడ్ -19 నిరోధం, నియంత్రణ, నిర్వహణకు పలు చర్యలు తీసుకుంటున్నది. ఇందుకు సంబంధించిన చర్యలను నిరంతరం ఉన్నతస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
కోవిడ్ -19 పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌కాలేజీలలో సామర్ధ్యాన్ని అత్యవసర ప్రాతిపదికన పెంచేందుకు దేశవ్యాప్తంగా గల విశిష్ఠ సంస్థల మద్య బాధ్యతలను సమానంగా పంచుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ సంస్థలు తమకు కేటాయించిన ప్రాంతాలలో మెడికల్ కాలేజీలకు మార్గదర్శకత్వం వహించి, ఆయా రాష్ట్రాలలో కోవిడ్ -19 పరీక్షా కేంద్రాల సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాయి. ఈ సంస్థలన్నింటినీ ఆయా రాష్ట్రప్రభుత్వాలతో సన్నిహిత సమన్వయంతో కలిసి పనిచేయాల్సిందిగా ఆదేశించారు.
నిన్నటినుంచి కోవిడ్ -19 నిర్ధారిత కేసుల సంఖ్య 909 పెరిగింది. 716 మందికి వ్యాధి నయమై ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇవాళ్టి వరకు 273 మరణాలు నమోదయ్యాయి.
ప్రాధమిక వైద్య మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది, ఇందులో కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రులు, ఐసోలేషన్ పడకలు, ఐసియు పడకలు , క్వారంటైన్ సదుపాయాలు ఉన్నాయి. 12.04.2020 నాటికి, 8356 కేసులకు 1671 పడకలు అవసరమని అంచనా వేయబడింది (ఒకమాదిరి , తీవ్రమైన, క్లిష్టమైన క్లినికల్ లక్షణాలతో ధృవీకరించబడిన కేసులలో 20శాతం), ప్రస్తుతం దేశవ్యాప్తంగా గల 601కోవిడ్ -19 ప్రత్యేక ఆస్పత్రులలో పడకల లభ్యత 1,05,980 .. దేశవ్యాప్తంగా కోవిడ్ ఆసుపత్రులలో ఐసోలేషన్ పడకల సంఖ్య మరింత పెంచుతున్నారు.
కోవిడ్ -19 పేషెంట్లకోసం ప్రత్యేకంగా కోవిడ్ -19 ఆస్పత్రుల ఏర్పాటు దేశవ్యాప్తంగా పెరుగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు, వివిధ ప్రైవేటు ఆస్పత్రులు, ప్రభుత్వరంగ సంస్థలు, సైనిక ఆస్పత్రులు, భారతీయ రైల్వేలు ఇందుకు గట్టి కృషి చేస్తున్నాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు మారుమూల ప్రాంతాలలో వైద్య మౌలిక సదుపాయాలను పెంచడానికి ప్రత్యేక తరహా టెంట్లను రూపొందించింది.
కోవిడ్ -19 ను ఎదుర్కొనే సన్నద్ధతలో కృషిలో భాగంగా ఎయిమ్స్, నిమ్‌హాన్స్‌వంటి సంస్థలచేత ఆరోగ్య సిబ్బంఇకి శిక్షణ ఇప్పించడం జరుగుతోంది. వెంటిలేటర్ మేనేజ్‌మెంట్, క్లినికల్ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫెక్షన్ నియంత్రణ, బయోమెడకల్ వ్యర్థాల నిర్వహణ, ఎపిడమాలజీ వంటి వాటిపై ఆన్ లైన్ శిక్షణ మాడ్యూళ్లు, వెబినార్లను ఈ సంస్థల చేత నిర్వహింపబడుతున్నాయి. కొవిడ్ -19 పై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందిని అన్ని రకాలుగా
సంసిద్ధం చేసేందుకు మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించడం జరిగింది.
.
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనలకోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/.
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in .కు పంపవచ్చు.
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
*****
(Release ID: 1613725)
Visitor Counter : 203
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam