ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 అప్‌డేట్స్‌

Posted On: 07 APR 2020 6:21PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్ -19 నియంత్ర‌ణ‌, నిరోధం, నిర్వ‌హ‌ణ‌ల‌కు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌తో క‌లిసి కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు ముంద‌స్తు, సానుకూల , ద‌శ‌ల‌వారీ చ‌ర్య‌ల‌ను తీసుకుంది. ఈ చ‌ర్య‌ల‌ను ఉన్న‌త‌స్థాయిలో నిరంత‌రం స‌మీక్షించి, వాటిని ప‌ర్య‌వేక్షిస్తున్నారు..
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ వ్యాధి నిరోధం,  వ్యాధి వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి సంబంధించి ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. ఇందుకు సంబంధించి దేశ‌వ్యాప్తంగా వివిధ జిల్లాల‌లో నిఘాకు సాంకేతిక ప‌రిజ్ఞాన ఆధారిత చ‌ర్య‌లు, క్వారంటైన్ సౌక‌ర్యాల పర్య‌వేక్ష‌ణ‌, అనుమానిత పేషెంట్ల‌ను గుర్తించ‌డం, వారితో సంబంధం గ‌ల వారిని ఇంటివ‌ద్ద క్వారంటైన్ లో ఉంచ‌డం, పౌరుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు తాజా స‌మాచారం అందిచడం, హీట్ మ్యాప్ ల ద్వారా ముంద‌స్తు అంచ‌నాలు రూపొందించ‌డం, అంబులెన్స్‌ల ట్రాకింగ్‌,  వైర‌స్ నివార‌ణ సేవ‌లు,డాక్ట‌ర్లు, వైద్య సిబ్బందికి వ‌ర్చువ‌ల్ శిక్ష‌ణ‌, టెలి కౌన్సిలింగ్ వంటి చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.
కోవిడ్ -19 నియంత్ర‌ణ కోసం ఆధునీక‌రించిన‌ శిక్షణ వనరుల సామగ్రి , వీడియో మెటీరియ‌ల్‌ను మంత్రిత్వ శాఖ వెలువ‌రించింది.
 ఇది  https://www.mohfw.gov.in/  లో అందుబాటులో ఉంటుంది.
కోవిడ్ 19 నిర్దారిత కేసులు, అనుమానిత కేసులకు సంబందించి అనుస‌రించ‌వ‌ల‌సిన విధానాల‌పై ఒక మార్గ‌ద‌ర్శ‌క ప‌త్రాన్ని జారీచేశారు . ఇది కింది లింక్‌లో  గ‌మ‌నించ‌వ‌చ్చు.
https://www.mohfw.gov.in/pdf/FinalGuidanceonMangaementofCovidcasesversion2.pdf.

వివిధ కేట‌గిరీల‌ కోవిడ్ -19 రోగుల సంరక్షణకు  మూడు ర‌కాల స‌దుపాయాల‌ను  ఏర్పాటు  చేస్తారు.
ఇందుకు సంబంధించి  కోవిడ్ -19 రోగుల కోసం ప్ర‌త్యేక  కేంద్రాన్ని గుర్తించేందుకు శిక్ష‌ణ‌, త‌గిన నిర్ణ‌యం తీసుకునే యంత్రాంగంలో భాగంగా దీనిని ఏర్పాటు  చేస్తారు.
1. కోవిడ్ కేర్ సెంట‌ర్ (సిసిసి):
తేలికపాటి లేదా  మ‌రింత  తేలికపాటి కేసులు లేదా  కోవిడ్‌ అనుమానిత కేసులు.
తాత్కాలిక వ‌స‌తి సౌక‌ర్యాల క‌ల్ప‌న‌. వీటిని హాస్ట‌ళ్లు, హోట‌ళ్లు, పాఠ‌శాల‌లు, స్టేడియంలు, లాడ్జీలు త‌దిత‌ర ప్ర‌భుత్వ ప్రైవేటు ప్రాంగ‌ణాల‌లో ఏర్పాటు చేయ‌వ‌చ్చు.
అవ‌స‌ర‌మైన సంద‌ర్భాల‌లో క్వారంటైన్ కేంద్రాల‌ను కూడా కోవిడ్ సంర‌క్ష‌ణ కేంద్రాలుగా మార్చ‌వ‌చ్చు.
ఒకటి లేదా అంత‌కంటే ఎక్కువ కోవిడ్ -19 కోసం ప్ర‌త్యేకించిన ఆరోగ్య కేంద్రాల‌ను త‌ప్ప‌కుండా గుర్తించాలి. అలాగే  క‌నీసం ఒక ఆస్ప‌త్రిని  ప్ర‌త్యేకంగా కోవిడ్ రెఫ‌ర‌ల్  అవ‌స‌రాల‌కు  గుర్తించాలి.2.
2. ప్ర‌త్యేక కోవిడ్ ఆరోగ్య కేంద్రం (డిసిహెచ్‌సి)
 వైద్యపరంగా కేటాయించిన అన్ని కేసులకు సంరక్షణను అందించాలి
    ఇవి పూర్తి ఆసుపత్రిగా గానీ లేదా ఆసుపత్రిలో ప్రత్యేక ఎంట్రీ / ఎగ్జిట్ / జోనింగ్ ఉన్న ప్రత్యేక బ్లాక్ కానీ అయి ఉండాలి.
ఈ ఆస్ప‌త్రుల‌కు ఆక్స‌జ‌న్ స‌దుపాయంతో కూడిన బెడ్లు ఉండాలి.
3. ప్ర‌త్యేక కోవిడ్ ఆస్ప‌త్రి  (డిసిహెచ్‌)
ప్రధానంగా వైద్యపరంగా తీవ్రంగా  భావించిన‌ వారికి సమగ్ర సంరక్షణ అందించాలి.
పూర్తి ఆస్ప‌త్రి,  లేదా   ప్రత్యేక ప్ర‌వేశం,  లేదా నిష్క్రమణ ఉన్న ఆసుపత్రిలోని ప్రత్యేక బ్లాక్ అయి ఉండాలి.
 పూర్తిగా అమర్చిన ఐసియులు, వెంటిలేటర్లు  ఆక్సిజన్  స‌దుపాయంతో పడకలు ఉండాలి
ప్ర‌స్తుతానికి దేశంలో 4421 క‌రోనా వైర‌స్ నిర్ధారిత కేసులు న‌మోదుకాగా ఇందులో 117 మంది మ‌ర‌ణించిన‌ట్టు స‌మాచారం. 326 మంది వ్యాధి నివార‌ణ అయి కోలుకున్న త‌ర్వాత డిశ్చార్జి అయ్యారు.
  కోవిడ్ -19 సంబంధిత అధికారిక‌, తాజా స‌మాచారం , సాంకేతిక అంశాలు, మార్గ‌ద‌ర్శ‌కాలు, సూచ‌న‌ల‌కు రెగ్యుల‌ర్‌గా చూడండి
 https://www.mohfw.gov.in/.

కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతిక ప్ర‌శ్న‌ల‌ను technicalquery.covid19[at]gov[dot]in కు ఈమెయిల్ చేయ‌వ‌చ్చు. ఇత‌ర ప్ర‌శ్న‌ల‌ను  ncov2019[at]gov[dot]in కు మెయిల్ చేయ‌వ‌చ్చు.
కోవిడ్ -19 కు సంబంధించి ఏవైనా ప్ర‌శ్న‌లు ఉంటే , ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ  మంత్రిత్వ‌శాఖ హెల్ప్ లైన్ నెంబ‌ర్
+91-11-23978046 లేదా 1075 (Toll-free) నంబ‌ర్‌ల‌కు ఫోన్ చేయ‌వ‌చ్చు.
కోవిడ్ -19 కు సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ నంబ‌ర్లు
 https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  లింక్ లో అందుబాటులో ఉన్నాయి.


(Release ID: 1612077) Visitor Counter : 261