రైల్వే మంత్రిత్వ శాఖ
అంతర్గతంగా పీపీఈల తయారీ చేపట్టిన భారతీయ రైల్వే
- వైద్యులు, పారా మెడికల్ సిబ్బందికి మరింత మేటి రక్షణ చర్యలు
- రోజుకు కనీసం 1000 వరకు పీపీఈల తయారీకి సన్నాహక చర్యలు
- దేశవ్యాప్తంగా దాదాపు 17 రైల్వే వర్క్‌షాప్‌లలో ఉత్పత్తి సన్నాహకాలు
- రానున్న రోజుల్లో ఇతర వైద్య నిపుణులకూ సరఫరా చేసే ఏర్పాట్లు..
Posted On:
07 APR 2020 12:45PM by PIB Hyderabad
కోవిడ్-19 వైరస్ కట్టడికి గాను ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బందికి మరింత మేటి రక్షణ కల్పించే దిశగా భారతీయ రైల్వే పలు చర్యలను ప్రారంభించింది. రైల్వేకు చెందిన ఆసుపత్రులలో వైరస్ కట్టడికి పని చేస్తున్న వైద్య, పారా మెడికల్ సిబ్బంది నిమిత్తం పీపీఈలను అంతర్గతంగానే తయారు చేసేలా భారతీయ రైల్వే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. వీటి ఉత్పత్తికి పంజాబ్‌లోని జగధారిలో సంస్థ అన్ని ఏర్పాట్లూ చేసింది. వీటికి డీఆర్‌డీవో ల్యాబ్ ఇటీవలే క్లియరెన్స్ ఇచ్చింది. డీఆర్‌డీవో అనుమతించిన డిజైన్, తయారీ సామగ్రితో భారతీయ రైల్వే వివిధ జోన్‌లలోని ఇతర వర్కషాప్‌లలోనూ వీటి ఉత్పత్తి చేపట్టనుంది. ముందుగా రైల్వే ఆసుపత్రులలోని డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందికి మరింత మేటి రక్షణను కల్పించేలా రోజుకు కనీసం 1000 పీపీఈ రక్షణ ఉత్పత్తులు తయారు చేసేలా రైల్వేలో వివిధ ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా సుమారు 17 వర్క్‌షాప్‌లలో ఉత్పత్తి కార్యక్రమాలు జరగనున్నాయి. రానున్న రోజుల్లో రైల్వేయేతర వైద్య నిపుణుల అవసరం మొత్తంలో దాదాపు సగం వరకు వినూత్నమైన పీపీఈ వస్ర్తాలను సరఫరా చేసే అంశాన్ని కూడా రైల్వే శాఖ పరిశీలిస్తోంది. వస్త్ర పరిశ్రమలు ఎక్కువగా ఉన్న పంజాబ్‌లో జగధారి నుంచి కేంద్రీకృత విధానం ఈ పీపీఈల తయారీకి అవసరమైన ముడి సరుకును రైల్వే శాఖ సమీకరిస్తోంది. పీపీఈల తయారీకి అవసరమైన సాంకేతిక ప్రమాణాలు తమ చేతికి అందాయని దీనికి తోడు కావాల్సిన పలు ముడి పదార్థాల సరఫరాదారులు కూడా సిద్ధంగా ఉన్నారని.. ఇకపై త్వరలోనే పీపీఈల ఉత్పత్తిని మొదలవుతుందని రైల్వే శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో ఉత్పత్తిని క్రమంగా పెంచుతూ ముందుకు సాగుతామని వివరించింది. గంటకు ఒక్కో కుట్టు యంత్రంపై మూడు సెట్ల పీపీఈ లను ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అవసరమైనన్ని రోజులు వీటి ఉత్పత్తని కొనసాగించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైల్వే యొక్క ఈ అంతర్గత ప్రయత్నం భారత ప్రభుత్వం అంచనా వేసిన కేంద్రీకృత అభ్యర్థన కంటే ఇది ఎక్కువగా ఉండడం విశేషం.
(Release ID: 1611940)
Visitor Counter : 189
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam