ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 తాజా సమాచారం

Posted On: 06 APR 2020 5:27PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్ -19 నివారణ, నియంత్రణ, నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిని క్రమం తప్పకుండా ఉన్నత స్థాయిలో సమీక్షించడంతో పాటు పర్యవేక్షిస్తున్నారు.

కేబినెట్ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లా అధికారులతో అత్యాధునిక స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. కోవిడ్ -19 నివారణ కోసం జిల్లా స్థాయిలో సంక్షోభ నిర్వహణ ప్రణాళికను కలిగి ఉండాలని అన్ని జిల్లాలకు సూచించారు.

కోవిడ్ -19 వ్యాప్తికి దిగ్బంధం సౌకర్యాల ఏర్పాటు కోసం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు అనుమానాస్పద మరియు అధిక రిస్క్ గల పరిచయాలను వీలైనంత త్వరగా ఇతర నిర్బంధ వ్యక్తుల నుంచి వేరు చేయడం మీద దృష్టి పెడతాయి. ఈ మార్గదర్శకాల గురించి ఈ లింక్ నుంచి పూర్తిగా తెలుసుకోవచ్చు.

https://www.mohfw.gov.in/pdf/90542653311584546120quartineguidelines.pdf

కోవిడ్ -19 రోగుల చికిత్స/ రోగ నిర్ధారణ / నిర్బంధ సమయంలో ఉత్పత్తి అయిన వ్యర్థాల నిర్వహణ, చికిత్స మరియు ఉత్పత్తి చేయబడిన వ్యర్థాలను నిర్వహించడం, చికిత్స చేయడం మరియు పారవేయడానికి సంబంధించిన విషయాల్లో మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. దీన్ని https://www.mohfw.gov.in/pdf/63948609501585568987wastesguidelines.pdf. నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

దీనితో పాటు అదనంగా కోవిడ్ -19 వ్యాప్తి సమయంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళను అధిగమించడానికి కొన్ని సమాచార వీడియోలు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో పోస్ట్ చేయబడ్డాయి.

దిగ్బంధ కేంద్రాలు, అంకితమైన కోవిడ్ -19 ఆస్పత్రులు మరియు ఇతర వైద్య పరికరాలు, రోగుల చికిత్స మరియు అన్నింటికీ సంబంధించిన అన్ని కార్యకలాపాలను చేపట్టడానికి కోవిడ్ -19 నిర్వహణకు సంబంధించిన ఇతర కార్యకలాపాల కోసం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్.హెచ్.ఎం) మరియు రాష్ట్ర విపత్తు సహాయ నిధి (ఎస్.డి.ఆర్.ఎఫ్) కింద నిధులను ఉపయోగించాలని రాష్ట్రాలకు ఇప్పటికే సూచనలు అందాయి., వీటితో పాటు ఎన్.హెచ్.ఎం. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఇస్తామని ప్రకటించిన రూ.1100 కోట్లు, మరియు 3000 కోట్లు అదనపు నిధులు ఈ రోజు విడుదలయ్యాయి. అలాగే ఎన్-95 మాస్క్ లు, వెంటిలేటర్లు మరియు పి.పి.ఈ.లను సెంట్రల్ పూల్ నుంచి సేకరించి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నారు.

ప్రస్తుతానికి 4,067 కేసులు ధృవీకరించబడగా, 109 మరణాలు నమోదు అయ్యాయి. 291 మంది ఇప్పటి వరకూ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం మొత్తం ధృవీకరించబడిన కేసుల విశ్లేషణ ఈ క్రింది విధంగా ఉంది.

·        లింగ ప్రాతిపదికన

o  76% మంది పురుషులు

o  24% స్త్రీలు

·        వయస్సు ప్రాతిపదికన

o   40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు - 47% మంది

o   40 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు - 34% మంది

o   60 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు - 19% మంది

కోవిడ్ - 19 కారణంగా నమోదు అయిన 109 మరణాలను విశ్లేషించేటప్పుడు ఈ క్రింది అంశాలను గమనించవచ్చు:

·        లింగ ప్రాతిపదికన

o  73% మంది పురుషులు

o  27% స్త్రీలు

·        వయస్సు ప్రాతిపదికన

o   40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు - 7% మంది

o   40 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు - 30% మంది

o   60 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు - 63% మంది

ప్రస్తుతానికి, 86% మరణాలు మధుమేహం, దీర్ఘకాలిక మూత్ర పిండాల సమస్యలు, రక్తపోటు మరియు గుండె సంబంధిత సమస్యలకు సంబంధించిన కొమొర్బిడిటీని ప్రదర్శించాయి. వృద్థుల్లో కేవలం 19 శాతం కేసులే నమోదు, వాటిలో 63 శాతం మరణాలు చూస్తుంటే వృద్ధులు అధిక ప్రమాదాన్ని కలిగి ఉన్నారనే విషయం స్పష్టమౌతోంది. ఇంకా, 37 శాతం మరణాలు 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారిలో సంభవించినప్పటికీ, సుమారుగా అనారోగ్యంతో బాధపడుతున్న వారిలో 86 శాతం మరణాలు నమోదు అయ్యాయి. అంటే అనారోగ్యంతో ఉన్న యువకుల్లో కూడా కోవిడ్ -19 ప్రమాదం ఎక్కువగా ఉందనే విషయాన్ని ఇది సూచిస్తోంది.

కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు మరియు సలహాల కోసం అన్ని ప్రామాణిక మరియు నవీనీకరించబడిన సమాచారం కోసం దయచేసి క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించండి.

కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతిక అనుమానాలు ఏవైనా ఉంటే  technicalquery.covid19[at]gov[dot]in కు మెయిల్ చేయగలరు. అదే విధంగా ఇతర ప్రశ్నలు ఏవైనా ఉంటే ncov2019[at]gov[dot]in కు ఈ మెయిల్ చేయవచ్చు. కోవిడ్ -19 కు సంబంధించిన ఏవైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ హెల్ప్ లైన్ నంబర్లు : + 91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు కాల్ చేయవచ్చు. అదే విధంగా కోవిడ్ -19 కు సంబంధించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నంబర్ల జాబితా https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  లింక్ లో అందుబాటులో ఉంది.



(Release ID: 1611778) Visitor Counter : 259