కేంద్ర మంత్రివర్గ సచివాలయం

రాష్ట్రాల ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, డిజిపిల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడిన కేబినెట్‌సెక్ర‌ట‌రీ

Posted On: 01 APR 2020 3:14PM by PIB Hyderabad

అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, డిజిపిల‌తో వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడిన కేబినెట్ సెక్ర‌ట‌రీ.
త‌బ్లిఘి జ‌మాత్ లో పాల్గొన్న వార‌లో ఎక్కువ‌మంది వైర‌స్ బారిన ప‌డిన వారున్న‌ట్టు తేలడంతో ఈ ప‌రిణామం, కోవిడ్ -19 వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌ను ప్ర‌మాదంలోకి నెట్టిన విష‌య‌మై రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌డం జ‌రిగింది.
ఈ స‌మావేశానికి హాజ‌రైన వారు ఎవ‌రెవ‌ర‌ని క‌లిశార‌న్న దానికి సంబంధించిన దానిని గుర్తించే ప్ర‌క్రియ‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల్సిందిగా కేంద్రం రాష్ట్రాల‌ను కోరింది.  
త‌బ్లిఘ్ జ‌మాత్‌లో పాల్గొన్న విదేశీయులు వీసా నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన‌ట్టు తేలింది. వీసా నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన విదేశీయుల‌పైన , నిర్వాహ‌కుల‌పైన చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌సిందిగా రాష్ట్రాల‌ను కోరారు.
 వ‌చ్చే వారం రోజుల‌లో రాష్ట్రాలు ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న‌ను అమ‌లు చేయాల‌ని కేంద్రం కోరింది. ల‌బ్ధిదారుల‌కు ఈ ప‌థ‌కం కింద పెద్ద మొత్తంలో న‌గ‌దు బ‌దిలీ చేయాల్సి ఉంటుంది. సామాజిక దూరం పాటిస్తూ దీనిని చేప‌ట్ట‌వ‌ల‌సిఉంటుంది.
    దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప‌టిష్టంగా అమ‌లు జ‌రుగుతున్న‌ట్టు గుర్తించ‌డం జ‌రిగింది. సామాజిక దూరం పాటిస్తూ, స‌ర‌కును ఎలాంటి అడ్డంకులు లేకుండా  రాష్ట్రాల మ‌ధ్య ర‌వాణా జ‌రిగేట్టు చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌సిందిగా రాష్ట్రాల‌ను కోర‌డం జ‌రిగింది.
    నిత్య‌వాస‌ర స‌ర‌కుల త‌యారీ జ‌రిగేట్టు చూడాల‌ని, అలాగే వీటి స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌లు స‌క్ర‌మంగా ప‌నిచేసేలా చూడాల‌ని రాష్ట్రాల‌ను కోరారు..


(Release ID: 1609935) Visitor Counter : 247