రక్షణ మంత్రిత్వ శాఖ
కోవిడ్‌పై పోరుకు రక్షణ శాఖ ఉద్యోగుల ఒక్కరోజు వేతన విరాళం..- పీఎం-కేర్స్ ఫండ్‌కు దాదాపు రూ.500 కోట్ల సాయమందే అవకాశం
प्रविष्टि तिथि:
29 MAR 2020 3:05PM by PIB Hyderabad
కోవిడ్-19 (కరోనా వైరెస్) వ్యాప్తిని కట్టడి చేసేందుకు గాను మోడీ సర్కారు చేపడుతున్న చర్యలకు రక్షణ శాఖ సిబ్బంది ఆర్థిక తొడ్పాటును అందించనున్నారు. దేశ రక్షణ శాఖకు చెందిన సిబ్బంది కోవిడ్‌పై పోరుకు తమ ఒక్క రోజు వేతనాన్ని పీఎం-కేర్స్ ఫండ్‌కు విరాళంగా అందించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం సమ్మతి తెలిపారు. దీంతో రక్షణ శాఖలో భాగంగా ఉండే భారత సైన్యం, భారత వైమానిక దళం, భారత నావికా దళ సిబ్బందితో పాటు ప్రభుత్వ రంగంలోని రక్షణ సంస్థల ఉద్యోగులు కూడా తమ ఒక్క రోజు వేతనాన్ని స్వచ్ఛంద విరాళం రూపంలో పీఎం-కేర్స్ ఫండ్‌కు అందించనున్నారు. దీంతో దాదాపు రక్షణ శాఖలోని వివిధ విభాగాల నుంచి దాదాపు రూ.500 కోట్ల వరకు ఆర్ధిక సాయం పీఎం-కేర్స్ ఫండ్‌కు విరాళంగా అందే అవకాశం ఉందని అంచనా.
(रिलीज़ आईडी: 1609015)
आगंतुक पटल : 160
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam