ప్రధాన మంత్రి కార్యాలయం

రేపు ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటలవరకూ జనతా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి


నిస్వార్థ సేవలందిస్తున్న వారికి రేపు సాయంత్రం 5 గంటలకు కృతజ్ఞతలు తెలపాలని వినతి

Posted On: 21 MAR 2020 6:37PM by PIB Hyderabad

 కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి కృషిలో భాగంగా మార్చి 22వ తేదీ ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటలవరకూ జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ పరీక్షా సమయంలో జాతికి నిస్వార్థ సేవలందిస్తున్న సేవాప్రదాతలకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేయాలని కూడా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు రేపు సాయంత్రం 5 గంటలకు తమతమ ఇళ్ల బాల్కనీలలో, ప్రవేశ ద్వారాలవద్ద నిలుచుని 5 నిమిషాలపాటు చప్పట్లు చరుస్తూ లేదా గంటలు మోగిస్తూ కృతజ్ఙతలు తెలపాలని ఆయన సూచించారు.
***(Release ID: 1607973) Visitor Counter : 173