ప్రధాన మంత్రి కార్యాలయం

సిఒవిఐడి-19 సంబంధిత స‌మీక్షా స‌మావేశాని కి అధ్య‌క్ష‌త వ‌హించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 18 MAR 2020 10:38PM by PIB Hyderabad

సిఒవిఐడి-19 (కోవిడ్‌-19) వ్యాప్తి ని అరిక‌ట్ట‌డం కోసం ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న కృషి ని స‌మీక్షించ‌డం కోసం జరిగిన ఒక ఉన్న‌త‌ స్థాయి స‌మావేశాని కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త వ‌హించారు.

భార‌త‌దేశం యొక్క స‌న్న‌ద్ధ‌త ను మ‌రింత గా బ‌లోపేతం చేసేందుకు అనుస‌రించ‌వ‌ల‌సిన మార్గాల ను గురించి ఈ స‌మావేశం లో చ‌ర్చించారు.  ప‌రీక్షా కేంద్రాల సంఖ్య ను మ‌రింత గా పెంచ‌డం అనేది ఈ చ‌ర్చ‌ల లో చోటు చేసుకొంది.  

కోవిడ్‌-19 కంటకభూతం తో పోరాడ‌డానికి త‌గిన వ్యూహాల‌ ను సిద్ధం చేయడం లో సంస్థ‌ల ను, స్థానిక స‌ముదాయాల ను మ‌రియు వ్య‌క్తుల‌ ను క్రియాశీలమైన రీతి లో నిమగ్నం చేయడం ఎంత‌యినా అవ‌స‌ర‌ం అని ప్ర‌ధాన మంత్రి ఈ సందర్భం లో స్ప‌ష్టం చేశారు. 
త‌రువాయి గా చేప‌ట్ట‌వ‌ల‌సిన చ‌ర్య‌ల పై సంప్ర‌తింపులు జ‌ర‌ప‌వ‌ల‌సిందిగా సాంకేతిక నిపుణుల కు మ‌రియు అధికారుల కు ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

కోవిడ్‌-19 ని ఎదుర్కోవ‌డం లో ముందు వ‌రుస‌ లో నిల‌బ‌డ్డ వివిధ రాష్ట్ర ప్ర‌భుత్వాలు, వైద్య స‌మాజం, పారామెడిక‌ల్ స్టాఫ్, సాయుధ ద‌ళాలు, అర్థ సైనిక బ‌ల‌గాలు, విమాన‌యాన రంగం తో అనుబంధం ఉన్నటువంటి న‌వారు, మ్యూనిసిప‌ల్ సిబ్బంది మరియు ఇత‌రుల‌ తో స‌హా, అంద‌రి కి ప్ర‌ధాన మంత్రి కృత‌జ్ఞ‌త‌ ను వ్య‌క్తం చేశారు.

దేశ ప్ర‌జ‌ల ను ఉద్దేశించి 2020వ సంవ‌త్స‌రం మార్చి 19వ తేదీ న రాత్రి 8 గంట‌ల కు ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగించ‌నున్నారు.  ఈ క్ర‌మం లో కోవిడ్‌-19 కి సంబంధించిన అన్ని అంశాల ను గురించి మ‌రియు దానితో పోరాడ‌టానికి చేస్తున్న ప్ర‌య‌త్నాల ను గురించి ఆయ‌న మాట్లాడుతారు.


**



(Release ID: 1607114) Visitor Counter : 174