హోం మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా వర్షపాతం, నైరుతి రుతుపవనాల పరిస్థితిని క్రియాశీలకంగా పర్యవేక్షిస్తోన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో.. భారీ వర్షాల వల్ల తలెత్తుతున్న సమస్యలను ఎదుర్కొనేందుకు వీలుగా ప్రభావిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తోన్న ఎంహెచ్ఏ
ఐఎండీ, సీడబ్ల్యూసీ, ఇన్‌కాయిస్ వంటి ఇతర కేంద్ర సంస్థలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర, జిల్లా అత్యవసర కేంద్రాలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసేందుకు నిరంతరం పనిచేస్తోన్న హోం మంత్రిత్వ శాఖకు చెందిన 'ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం'
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాలకు ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు అన్ని రక్షణ చర్యలను 24 గంటలూ పర్యవేక్షిస్తోన్న కంట్రోల్ రూం
గడిచిన వారంలో ప్రభావితమైన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 52 మందిని సురక్షితంగా రక్షించగా 2,206 మందిని ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించిన యంత్రాంగం
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఆదేశాల మేరకు నష్ట తీవ్రతను అంచనా వేసి ఎన్‌డీఆర్ఎఫ్ నుంచి ఆయా రాష్ట్రాలకు అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు జూలై 07 నుంచి 10 వరకు అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే పర్యటించిన వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన కేంద్ర బృందాలు
వరుస వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి అంచనా వేయడానికి 2026 జూలై 25 నుంచి అస్సాంలోని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన మరొక కేంద్ర బృందం
प्रविष्टि तिथि:
23 JUL 2026 6:08PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా వర్షపాతం, నైరుతి రుతుపవనాల పరిస్థితిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ క్రియాశీలకంగా పర్యవేక్షిస్తోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ).. భారీ వర్షాల వల్ల తలెత్తుతున్న సమస్యలను ఎదుర్కొనేందుకు వీలుగా ప్రభావిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తోంది.
2026 జూలై నెలలో నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, గుజరాత్, మహారాష్ట్ర, దాద్రా నగర్ హవేలీ, డామన్, జమ్మూ కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్) వంటి ఇతర కేంద్ర సంస్థలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర, జిల్లా అత్యవసర ఆపరేషన్ కేంద్రాలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసేందుకు హోం మంత్రిత్వ శాఖకు చెందిన 'ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం' (ఐసీఆర్-ఈఆర్) నిరంతరం పనిచేస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు అన్ని రక్షణ చర్యలను ఈ కంట్రోల్ రూం నిరంతరం పర్యవేక్షిస్తోంది.
ఈ ప్రాంతాలన్నింటిలోనూ మానవ ప్రాణ నష్టాన్ని నివారించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన బలగాలు (ఎన్‌డీఆర్ఎఫ్).. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు, రాష్ట్ర పోలీసు బలగాలు, ఎస్డీఆర్ఎఫ్లతో కలిసి నిరంతరం రక్షణ, సహాయక చర్యలలో పాల్గొంటున్నాయి. ప్రతిస్పందన సమయాన్ని తగ్గించడానికి ఎన్‌డీఆర్‌ఎఫ్ తన బృందాలను ప్రమాదకర ప్రాంతాల్లో ముందస్తుగానే మోహరించింది. గడిచిన వారంలో ప్రభావితమైన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 52 మందిని సురక్షితంగా రక్షించిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు 2,206 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ…. చిక్కుకుపోయిన ప్రజలను కాపాడటానికి, సిబ్బందితో పాటు సహాయక సామగ్రి రవాణాలో రక్షణ సంస్థలకు సహకరించేందుకు, సహాయక సామగ్రిని పంపిణీ చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఓడీ) అతి తక్కువ సమయంలోనే తన వనరులను సమకూర్చింది.
దేశవ్యాప్తంగా రుతుపవనాల కాలం కంటే ముందే 2026 మే 10న వరదలు, వడగాలుల విషయంలో సన్నాహక చర్యలపై కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లో భారీ వర్షాలు, కుండపోత, వరదలు, కొండచరియలు విరిగిపడ్డ ఘటనల విషయంలో పూర్తి సన్నాహక చర్యలపై సమీక్షించేందుకు హోం మంత్రిత్వ శాఖ 2026 జూన్ 03న మరొక సమావేశాన్ని నిర్వహించింది. ఛార్ ధామ్ యాత్రా మార్గంలో చేసిన ఏర్పాట్లపై కూడా హోం మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా సమీక్షించింది.
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఆదేశాల మేరకు ఎన్‌డీఆర్‌ఎఫ్ నిధుల విడుదల కోసం నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన కేంద్ర బృందాలు 2026 జూలై 07 నుంచి 10 వరకు అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే పర్యటించాయి. ఎడతెరిపి లేని వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి అంచనా వేయడానికి వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన మరొక కేంద్ర బృందం 2026 జూలై 25 నుంచి అస్సాంలోని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది.
ఇటీవలి వర్షాలు కొన్ని రాష్ట్రాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగించినప్పటికీ మొత్తం మీద ఇవి గతంలో అంచనా వేసిన దాదాపు 30 శాతం వర్షపాత లోటును సుమారు 15 శాతానికి తగ్గించాయి.
***
(रिलीज़ आईडी: 2288730)
आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Khasi
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam