ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గ్యాంగ్‌టక్‌లో ‘సిక్కిం 50వ రాష్ట్రావతరణ వేడుకల ముగింపు’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రశాంతతకు, వ్యాపార చాతుర్యానికి నిలయంగా వేగంగా అభివృద్ధి చెందుతోన్న సిక్కిం: ప్రధాని మోదీ

నా ప్రయాణమంతటా నన్ను ఆకట్టుకున్న అత్యుత్తమ అంశం సిక్కిం రోడ్ల పరిశుభ్రత: ప్రధానమంత్రి

కనుచూపుమేర ఎక్కడా చెత్త కనిపించదు... గాలిలోనూ, రోడ్లపైనూ అంతా స్వచ్ఛతే... సిక్కిం ప్రజలు ప్రకృతికి నిజమైన రక్షకులు, దానికి బ్రాండ్ అంబాసిడర్లు: ప్రధానమంత్రి

సిక్కింలో అనుసంధానం, మౌలిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం... గడిచిన కొన్నేళ్లలో ఇక్కడ వందల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మితమయ్యాయి... ప్రతి గ్రామాన్ని రోడ్లతో అనుసంధానించే పనులు వేగంగా పురోగమిస్తున్నాయి: ప్రధానమంత్రి

సిక్కింలో క్రీడల రంగానికి అపారమైన అవకాశాలు... అంతర్జాతీయ వేదికలపై తమ సామర్థ్యాన్ని, ప్రతిభను ప్రదర్శించిన ఇక్కడి యువత: ప్రధానమంత్రి

పటిష్టమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలతో పాటు ప్రజలకు తక్కువ ధరకే వైద్యం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధానమంత్రి

ఆయుష్మాన్ కార్డుల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నాం... ఇప్పుడు 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం... జన ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకే మందులు లభిస్తున్నాయి: ప్రధానమంత్రి

సిక్కిం అనుసరిస్తున్న సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ నమూనా యావత్ దేశానికే స్ఫూర్తిదాయకం: ప్రధానమంత్రి

సిక్కిం ప్రజల జీవనశైలి, వారి సంకల్పం నేడు దేశ దార్శనికతలో అంతర్భాగం: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 28 APR 2026 3:00PM by PIB Hyderabad

సిక్కిం రాష్ట్రం ఏర్పడి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో జరిగిన ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిక్కిం అభివృద్ధికి బాటలు వేస్తూ వేల కోట్ల రూపాయల విలువైన 30కి పైగా అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించిశంకుస్థాపన చేశారు.

పాల్జోర్ స్టేడియంలో జరిగిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ... సిక్కిం రాష్ట్రంతో తనకున్న విడదీయలేని అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పర్యటనలో భాగంగా ఆర్కిడ్ తోటలను సందర్శించిన అనుభవాన్ని వివరిస్తూ అక్కడి ప్రకృతి వర్ణాలుఆ ఉత్సాహం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సహజ సంపదలను ప్రస్తావిస్తూ ఈస్టర్న్ పారడైజ్ (తూర్పు స్వర్గం)గా పిలవబడే ఇక్కడి ఆర్కిడ్ తోటలు సాటిలేని అందాన్నిప్రశాంతతను, ఆధ్యాత్మికానందాన్ని అందిస్తాయని తెలిపారు. ‘‘ఇలాంటి అనుభూతి అదృష్టం ఉంటేనే దక్కుతుంది. నా మనసు ఇంకా ఆ రంగుల వేడుకలోనే లీనమై ఉంది’’ అని ప్రధాని శ్రీ మోదీ తెలిపారు.

సిక్కిం 50 ఏళ్ల ప్రస్థానాన్ని ఇంతటి పవిత్రమైన వాతావరణంలో జరుపుకోవడం విశేషమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక సందర్భంఇలాంటి దివ్యమైన వాతావరణంలో జరిగినప్పుడు దాని వైభవం రెట్టింపు అవుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలుకళాకారుల అద్భుత ప్రదర్శనలుప్రజల ఉత్సాహంపర్వతాలు-ఆకాశం కలగలిసిన దృశ్యం పాల్జోర్ స్టేడియంలో ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించాయి. ‘‘ప్రకృతిసంస్కృతి రెండూ కలిసి జీవం పోసుకున్నట్లు అనిపించింది. ఈ జ్ఞాపకాలు నా హృదయంలో కలకాలం నిలిచిపోతాయి’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

ఎట్టకేలకు సిక్కిం చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  గత పర్యటనలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ... అప్పట్లో వాతావరణం అనుకూలించకపోవడంతో గ్యాంగ్‌టక్ చేరుకోలేకపోయాననిబాగ్డోగ్రా నుంచి ఆన్‌లైన్ ద్వారానే మాట్లాడాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఆ సమయంలో ప్రజలను నేరుగా కలవలేకపోయానన్న అసంతృప్తి తనలో అలాగే ఉండిపోయిందనిఅందుకే ఈ అవకాశం కోసం ఎంతోకాలంగా ఎదురుచూసినట్లు చెప్పారు. ‘‘ఈ కార్యక్రమం ద్వారా నా నిరీక్షణ నేడు ఫలించింది’’ అని ప్రధాని శ్రీ మోదీ అన్నారు.

సిక్కిం ప్రజలను కలవడం ఒక ప్రత్యేకమైన అనుభవమని... వారి మంచితనంనిరాడంబరతచిరునవ్వుతో కూడిన వదనాలు తనకు ఎల్లప్పుడూ ప్రశాంతతను ఇస్తాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ప్రధాన కార్యక్రమానికి ముందు ఆయన సిక్కింకు చెందిన ప్రముఖ పౌరులుపద్మ అవార్డు గ్రహీతలుకళాకారులుఫుట్‌బాల్ క్రీడాకారులతో సహా పలువురు ప్రతిభావంతులను కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ‘‘సిక్కిం ప్రజలను కలవడం నాకు ఎప్పుడూ ఒక విభిన్నమైన సంతృప్తిని ఇస్తుంది’’ అని తెలిపారు.

గత రాత్రి జరిగిన రోడ్‌షోను ఒక మర్చిపోలేని అనుభవంగా ప్రధానమంత్రి అభివర్ణించారు. గంజు లామా ద్వార్ నుంచి లోక్ భవన్ వరకు సిక్కిం ప్రజలు ఎంతో గొప్పగా తమ ప్రేమాభిమానాలను కురిపించారని తెలిపారు. 21 జాతుల ప్రజలు తమదైన వస్త్రధారణసంగీతంఆచారాలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారనిఆ ప్రాంతమంతా ఒక పండగలా మారిపోయిందని అన్నారు.  ‘‘ప్రకృతి ఒడిలో రకరకాల రంగుల పూలు వికసించినట్లుగా ఆ దృశ్యం కనిపించింది. ప్రజల చేతుల్లో మన త్రివర్ణ పతాకం... భారత్ మాతా కీ జైవందేమాతరం నినాదాల హోరు... ఆ వాతావరణమంతా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబించింది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

రోడ్‌షోలో భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళలుపిల్లలువృద్ధులను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడారు.  ప్రమాణ మార్గం పొడవునా సిక్కిం రోడ్ల పరిశుభ్రత తనను ఎంతగానో ఆకట్టుకుందని కొనియాడారు. ఎక్కడా చిన్నపాటి చెత్త కూడా కనిపించలేదనిగాలిలోనూరోడ్లపైనూ స్వచ్ఛత వెల్లివిరిసిందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ‘‘మీరు ప్రకృతికి నిజమైన రక్షకులుబ్రాండ్ అంబాసిడర్లు’’ అని సిక్కిం ప్రజలపై ప్రశంసలు కురిపించారు.

రోడ్‌షోఈ వేడుకను ఇంత ఘనంగా నిర్వహించినందుకు పౌరులకుకళాకారులకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. సిక్కిం ప్రజలకుదేశప్రజలందరికీ ఈ ఉత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ఒక బలమైన హామీనిస్తూ...‘‘మీరు నాపై కురిపించిన ఈ ప్రేమాభిమానాలుఆశీర్వాదా రుణాన్ని తీర్చుకోవడానికి  నేను అన్ని విధాలా కృషి చేస్తాను’’ అని స్పష్టం చేశారు.

సిక్కిం ప్రస్థానాన్ని మానవీయ విలువలువారసత్వంఅభివృద్ధి కలగలిసిన ప్రయాణంగా ప్రధానమంత్రి అభివర్ణించారు. ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎన్నో తరాలు కృషి చేశాయని ఆయన గుర్తుచేశారు. సిక్కిం వారసత్వాన్ని కాపాడుతూనేఅభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. తమ ప్రభుత్వానికి సిక్కింఈశాన్య రాష్ట్రాలు కేవలం దేశంలో భాగం మాత్రమే కాదనిఅవి దేశపు ‘అష్టలక్ష్మి’ స్వరూపాలని అన్నారు. ‘‘అందుకే మేము ‘యాక్ట్ ఈస్ట్’ పాలసీతో పాటుఈశాన్య ప్రాంతం కోసం ‘యాక్ట్ ఫాస్ట్’ అనే సంకల్పాన్ని కూడా తీసుకున్నాం’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

నేడు రోడ్లువిద్యుత్పర్యాటకంఆరోగ్యంవిద్యా రంగాలకు సంబంధించి వేల కోట్ల రూపాయల విలువైన 30కి పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలుప్రారంభోత్సవాలు జరిగాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు. ముఖ్యంగా 2023 తర్వాత ఉత్తర సిక్కిం ప్రాంతాల్లో దెబ్బతిన్న అనుసంధానాన్ని పునరుద్ధరించడంపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. ‘‘ఎక్కడైతే రవాణా వ్యవస్థ దెబ్బతిందోఅక్కడ అనుసంధానాన్ని బలోపేతం చేయడంపై మేం దృష్టి సారించాం’’ అని తెలిపారు.

సిక్కిం ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగమే అతిపెద్ద బలమని ప్రధానమంత్రి అన్నారు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో సిక్కిం వాటా ఒక శాతం కంటే తక్కువగా ఉన్నప్పటికీదేశంలోని మొత్తం పుష్ప వైవిధ్యంలో  25 శాతానికి పైగా ఇక్కడే ఉందని ఆయన గుర్తుచేశారు. సుమారు 500 రకాల పక్షులుదాదాపు 700 రకాల సీతాకోకచిలుకలుఅందమైన అటవీ సంపదఅద్భుతమైన కాంచనజంగా పర్వతం ఇక్కడి ప్రత్యేకతలని కొనియాడారు. ‘‘ఇన్ని విశిష్టతలు ఉన్నందునేప్రతి ఒక్కరూ సిక్కింను మళ్ళీ మళ్ళీ సందర్శించాలని కోరుకుంటారు’’ అని పేర్కొన్నారు.

పర్యాటకం ద్వారా సిక్కింలో అధిక సంఖ్యలో ప్రజలకు ఆదాయం లభిస్తుందనిఅయితే అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడే పర్యాటక రంగం అభవృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి తెలిపారు  గత కొన్నేళ్లుగా వందల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించామనిప్రతి గ్రామానికి రోడ్లను విస్తరించే పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఒకప్పుడు ఊహించలేని ఆధునిక మౌలిక సదుపాయాలు ఇప్పుడు నిజమవుతున్నాయని పేర్కొంటూ.. ‘‘అందుకే మేం సిక్కిం అనుసంధానం, మౌలిక సదుపాయాలపై అత్యధికంగా దృష్టి సారిస్తున్నాం’’ అని అన్నారు.

ప్రధాన అనుసంధాన ప్రాజెక్టులను ప్రముఖంగా ప్రస్తావిస్తూ... 'బాగ్డోగ్రా-గాంగ్‌టక్ ఎక్స్‌ప్రెస్‌వే', 'సేవోక్-రాంగ్‌పో రైలు మార్గం' లు సిక్కింను దేశం మొత్తంతో కలిపే కీలక వారధులుగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. కొత్త జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది... గాంగ్‌టక్ వంటి నగరాల్లో రింగ్ రోడ్ల వంటి భవిష్యత్తుకు అత్యంత ఆవశ్యకమైన ప్రాజెక్టులూ పురోగతిలో ఉన్నాయి... "ఈ దిశగా పనులు ముందుకు సాగుతున్నాయి" అని శ్రీ మోదీ తెలిపారు.

2008-09లోనే ఆమోదం పొందినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎటువంటి పనులు జరగక కేవలం దస్త్రాలకే పరిమితమైన 'సేవోక్-రాంగ్‌పో' రైలు మార్గం ఉదాహరణను ఉటంకిస్తూ...  కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి ఊపందుకుందని ఆయన పేర్కొన్నారు. "తొలిసారి రైల్వే సేవలు సిక్కింకు చేరుకుంటున్నాయి" అని శ్రీ మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కొత్త ఆలోచనల ఆవశ్యకతను స్పష్టం చేస్తూ భలేధుంగ, యెన్-యెంగ్, పెల్లింగ్‌లలో రోప్‌వేల నిర్మాణం... భలేధుంగలో నిర్మిస్తున్న స్కైవాక్... సింగ్‌షోర్ బ్రిడ్జ్ వద్ద గ్లాస్ డెక్ స్కైవాక్ కోసం జరుగుతున్న సన్నాహాలను వినూత్న ఆలోచనలకు ఉదాహరణలుగా ప్రధానమంత్రి అభివర్ణించారు. నాథులా, నమ్లి వంటి ప్రదేశాల్లో సరిహద్దు అనుభవాలను మెరుగుపరిచే పనులూ పురోగతిలో ఉన్నాయని ఆయన తెలిపారు. "ఈ ప్రయత్నాలు మీ జీవితాలను సులభతరం చేస్తాయి, పర్యాటకుల సంఖ్యను పెంచుతాయి, మీ ఆదాయాన్నీ పెంచుతాయి, మరిన్ని ఉపాధి అవకాశాలనూ సృష్టిస్తాయి..." అని శ్రీ మోదీ హామీ ఇచ్చారు.

సిక్కింలో పర్యావరణ-హితమైన పర్యాటకానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని, దీనిని ప్రభుత్వం చురుగ్గా ప్రోత్సహిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. స్థానిక ప్రజలకు గరిష్ట పర్యాటక ఆదాయం అందేలా చూసేందుకు గానూ 1,000 హోమ్‌స్టేలను నిర్మిస్తున్నారని, సాహస పర్యాటకానికి అవసరమైన మౌలిక సదుపాయాలకు మద్దతునిస్తున్నారని ఆయన తెలిపారు. "పర్యాటకం ద్వారా స్థానిక ప్రజలు నేరుగా లబ్ధి పొందేందుకు మేం అవకాశాలను కల్పిస్తున్నాం," అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

సిక్కింకు అపార సామర్థ్యం ఉన్న మరో రంగం క్రీడారంగమని ప్రముఖంగా ప్రస్తావిస్తూ... ఫుట్‌బాల్, బాక్సింగ్, ఆర్చరీ వంటి ప్రధాన క్రీడల్లో తమ సామర్థ్యాన్ని, ప్రతిభను నిరూపించుకుని రాష్ట్రానికీ, దేశానికీ కీర్తిని తెచ్చిపెట్టిన యువతను ప్రధానమంత్రి ప్రశంసించారు. "సిక్కిం యువ ప్రతిభావంతులు ఈ రాష్ట్రానికి, దేశానికీ గర్వకారణంగా నిలిచారు" అని శ్రీ మోదీ ప్రశంసించారు.

రాష్ట్రానికీ, దేశానికీ ఇప్పటికే కీర్తిని తెచ్చిపెట్టిన సిక్కిం రాష్ట్ర అసాధారణ క్రీడా ప్రతిభను మరింత మెరుగుపరచాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తూ... 'ఖేలో ఇండియా', 'ఫిట్ ఇండియా' ఉద్యమాల ద్వారా ప్రభుత్వం అనుసరిస్తున్న బహుముఖ విధానాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. రాష్ట్ర క్రీడా అకాడమీ పునరుజ్జీవనం, సిక్కిం ప్రీమియర్ లీగ్ వంటి ఈవెంట్ల ప్రోత్సాహంతో పాటుగా జస్ లాల్ ప్రధాన్ పేరుతో అత్యాధునిక బాక్సింగ్ అకాడమీ, సమీకృత క్రీడా-సాంస్కృతిక గ్రామాల వంటి రాబోయే ప్రాజెక్టులతో ఈ రాష్ట్రం ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. "ఇవి సిక్కిం యువతకు మెరుగైన సౌకర్యాలను అందించి, వారు తమ క్రీడల్లో మరింత మెరుగ్గా రాణించడానికి సహాయపడతాయి" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

ఈ రోజు ప్రారంభించిన ప్రాజెక్టుల్లో ఆరోగ్య రంగానికి సంబంధించిన అనేక కీలక పనులు ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య సేవలు అత్యంత పరిమితంగా ఉండి, పర్యాటకులనూ ఇక్కడికి రాకుండా నిరుత్సాహపరిచిన గత కాలాన్ని గుర్తుచేసుకుంటూ... ప్రస్తుతం చోటుచేసుకున్న పరివర్తనను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. "ఈ రోజు, ఆ సవాలు కూడా అంతమైపోతోంది" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను వివరిస్తూ... సిక్కింలో ప్రస్తుతం సుమారు 200 'ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు' పనిచేస్తున్నాయన్నారు. వీటితో పాటు నాలుగు జిల్లా ఆసుపత్రులు, తృతీయ శ్రేణి చికిత్స ఆసుపత్రులు, వెల్‌నెస్ కేంద్రాలూ ఉన్నాయని, వీటి ద్వారా వేలాది మంది ప్రజలు 'ఆయుష్' సదుపాయాల ప్రయోజనాలను పొందుతున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. "డ్రెజాంగ్ నామ్‌గ్యాల్ సోవా రిగ్పా ఆసుపత్రి ప్రారంభోత్సవంతో, సిక్కిం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు అదనపు బలం చేకూరుతుంది" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

ఆరోగ్య మౌలిక సదుపాయాలతో పాటు, అందుబాటు ధరల్లో వైద్య చికిత్సను అందించాలన్న ప్రభుత్వ నిబద్ధతను స్పష్టం చేసిన ప్రధానమంత్రి పలు కార్యక్రమాలనూ ప్రస్తావించారు. తొలుత, పేదలకు ఉచిత వైద్యం కోసం 'ఆయుష్మాన్ కార్డులు' అందించాం. ఇప్పుడు ఈ సదుపాయం 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వృద్ధులందరికీ విస్తరించాం. 'జన్ ఔషధి కేంద్రాల' వద్ద మందులు అత్యంత సరసమైన ధరలకు లభిస్తున్నాయి. "ఈ ప్రయత్నాలు మీ జీవితాలను సులభతరం చేయడమే కాకుండా, మీ వైద్య ఖర్చులనూ తగ్గించాయి" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఆర్థిక పురోగతి, వనరుల పట్ల ప్రపంచ దృక్పథం వేగంగా మారుతోందని... ప్రస్తుతం ప్రపంచం సుస్థిర జీవనశైలి, పరిశుద్ధ ఇంధనం, సేంద్రీయ ఆహారాలపై ప్రధానంగా దృష్టి సారిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ భవిష్యత్ ఆధారిత వృద్ధికి ఈశాన్య ప్రాంతం, సిక్కిం ప్రధాన కేంద్రాలుగా నిలవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సిక్కిం రాష్ట్రం మన దేశం మొత్తానికి దిశానిర్దేశం చేసిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. "సిక్కిం 2016లోనే తనను తాను పూర్తిగా సేంద్రియ వ్యవసాయం గల రాష్ట్రంగా ప్రకటించుకుని, దేశానికే ఆదర్శంగా నిలిచింది" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

సేంద్రియ వ్యవసాయంలో సిక్కిం చేపట్టిన మార్గదర్శక ప్రయత్నాలను ప్రశంసిస్తూ... డెమాజాంగ్ ఇప్పుడు కేవలం వరి ఉత్పత్తికే కాకుండా సేంద్రియ వరికీ ప్రసిద్ధి చెందిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పెద్ద యాలకులు, అల్లం, పసుపు, అవకాడో, కివీ పండ్లు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు చేరుకుంటుండగా... వందలాది రకాల ఔషధ మొక్కలు స్థానిక ప్రజలకూ ఆదాయ వనరులుగా మారుతున్నాయి. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, రైతులకు ప్రత్యక్ష మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు ఒక సేంద్రియ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలిపారు. "సిక్కిం సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ నమూనా యావత్ దేశానికి స్ఫూర్తిదాయకం. మీ జీవనశైలి, సంకల్పం దేశ దార్శనికతలో భాగమయ్యాయి" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

సిక్కిం ఆర్థిక ప్రగతిలో స్వయం సహాయక సంఘాలు, మహిళలు పోషిస్తున్న కీలక పాత్రను గుర్తిస్తూ... వారి ఉత్పత్తులు విస్తృత మార్కెట్లకు చేరుకోవడంలో 'డిజిటల్ ఇండియా' కీలక పాత్రను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. " 'స్వయం సిక్కిం' వంటి వేదికలు నేడు ఈ మహిళలకు సాధికారత కల్పిస్తున్నాయి " అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే, పరిశుద్ధ ఇంధన రంగంలో సిక్కిం రాష్ట్ర అపార సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ సిక్కిం ప్రజల నైజమని అంగీకరిస్తూ... 'ఏక్ పేడ్ మా కే నామ్' కార్యక్రమాల్లో, స్థానికంగా నిర్వహిస్తున్న 'మేరో రుఖ్ మేరో సంతతి' కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యాన్ని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమం కింద ప్రతి బిడ్డ పుట్టినప్పుడు 108 మొక్కలను నాటుతున్నారు. "ఈ కార్యక్రమం యావత్ ప్రపంచానికీ స్ఫూర్తిదాయకమని నేను నమ్ముతున్నాను" అని శ్రీ మోదీ అన్నారు.

పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలను అదే అంకితభావంతో కొనసాగించాలని అందరికీ పిలుపునిస్తూ... దీనిని రాబోయే తరాల కోసం కాపాడుకోవాల్సిన వారసత్వంగా ప్రధానమంత్రి అభివర్ణించారు. "ఇది మన వారసత్వం... దీనిని మనం భవిష్యత్ తరాల కోసం కాపాడుకోవాలి" అని శ్రీ మోదీ పిలుపునిచ్చారు.

ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ... సిక్కిం అభివృద్ధిని వేగవంతం చేయడానికి, వికసిత్ భారత్ కలను సాకారం చేసుకోవడానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సంకల్పంతో సిక్కింను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడం పట్ల తన నిబద్ధతను వ్యక్తం చేస్తూ... అందరికీ మరోసారి అభినందనలు తెలిపారు. "మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు, నిరంతర శ్రేయస్సు కలగాలని ఆకాంక్షిస్తున్నాను" అని చెబుతూ శ్రీ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

<center

సిక్కిం రాష్ట్ర ఆవిర్భావ 50వ వార్షికోత్సవ ముగింపు వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రశాంతతకు, కార్యశీలతకు ప్రసిద్ధి చెందిన ఈ రాష్ట్రం వేగవంతమైన ప్రగతిని సాధించింది అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. https://t.co/hFUftLcfk7

— శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) April 28, 2026


(रिलीज़ आईडी: 2281447) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Nepali , Assamese , Manipuri , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam