ఆయుష్
azadi ka amrit mahotsav

యూట్యూబ్‌లో యోగా ప్రత్యక్ష ప్రసారం… భారీ సంఖ్యలో వీక్షకులు... ఆయుష్ మంత్రిత్వ శాఖ గిన్నిస్ రికార్డు


అంతర్జాతీయ యోగా దినోత్సవం – 2026 నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఆన్‌లైన్ యోగా కార్యక్రమంలో పాల్గొన్న 4,35,831 మంది ధ్రువీకృత వీక్షకులు

నాడు పోస్టు చేయడమైనది: 14 JUN 2026 12:56PM by PIB Hyderabad

అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) – 2026 నేపథ్యంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ రోజు చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిందిఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైన ప్రత్యేక ఆన్‌లైన్ యోగా కార్యక్రమంలో 4,35,831 మంది వీక్షకులు పాల్గొన్నారుదీంతో అత్యధిక మంది వీక్షించిన యూ ట్యూబ్ లైవ్ యోగా ప్రసారంగా సరికొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది.

ఐడీవై-2026 కోసం మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ రికార్డు కోసం ప్రయత్నించారుఈ కార్యక్రమంలో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగ సాధకులువిద్యార్థులుసంస్థలునిపుణులుఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేవారు ఉత్సాహంగా పాల్గొన్నారుకామన్ యోగా ప్రొటోకాల్ (సీవైపీ)ను ఈ కార్యక్రమం ప్రదర్శించిందిఅలాగే యోగా 365 ఉద్యమం ద్వారా యోగాను రోజువారీ సాధనగా ప్రోత్సహించాలనే మంత్రిత్వ శాఖ దార్శనికతను బలోపేతం చేసింది.

ఆయుష్ మంత్రిత్వ శాఖ 4,35,83మంది ధ్రువీకృత వీక్షకుల సంఖ్యను నమోదు చేసి 2024 నాటి 2,46,252 వీక్షకుల గిన్నిస్ ప్రపంచ రికార్డును అధిగమించిందిమునుపటితో పోలిస్తే 1,89,579 మంది ఎక్కువ వీక్షకులతో యూట్యూబ్ లైవ్ యోగా ప్రసారానికి అత్యధిక వీక్షణలు సాధించి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ఆరోగ్యంకుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ రావ్ జాదవ్ ప్రసంగించారుఈ చరిత్రాత్మక విజయాన్ని సాధించేందుకు దోహదపడిన ప్రపంచ పౌరులను అభినందించారు. ‘‘ఆరోగ్యంసంక్షేమం అనే ఉమ్మడి నిబద్ధత ద్వారా వివిధ ప్రాంతాలుసంస్కృతులుదేశాలకు చెందిన ప్రజలను అనుసంధానించడంలో యోగాకున్న అసాధారణ శక్తిని ఈ రోజు సాధించిన విజయం ప్రదర్శిస్తుందిజీవన మార్గంగా యోగాను అనుసరించడంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆమోదాన్ని ఈ సరికొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు ప్రతిబింబిస్తుందిదైనందిన జీవితంలో యోగాను సమగ్ర భాగంగా మార్చాలనే మన సమష్టి సంకల్పాన్ని  బలోపేతం చేస్తుందిఅంతర్జాతీయ యోగా దినోత్సవం – 2026 సమీపిస్తున్న తరుణంలో ‘యోగా-365’ స్ఫూర్తిని స్వీకరించాలనీఆరోగ్యమైనదృఢమైనస్థిరమైన సమాజాన్ని నిర్మించేందుకు సహకరించాలని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ఆయన అన్నారు.

భాగస్వాములకూఈ చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్నవారికీ ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా అభినందనలు తెలియజేశారు. ‘‘ఈ విజయం కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు మాత్రమే కాదుఇది మనం ప్రపంచానికి పంపుతున్న సందేశంఆరోగ్యానికీసంక్షేమానికీ శక్తిమంతమైన సాధనంగా యోగాకు పెరుగుతున్న గుర్తింపును ఈ భారీ భాగస్వామ్యం తెలియజేస్తుందియోగాను ఒక రోజు కార్యక్రమంగా పరిమితం చేయకుండా.. దైనందిన జీవితంలో భాగంగా చేసి ‘యోగా-365’ను సాకారం చేయడమే మా లక్ష్యం’’ అని మంత్రిత్వ శాఖ కార్యదర్శి చెప్పారు.

ఒడిశా ఆరోగ్యంకుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ముఖేష్ మహాలింగ్కేంద్ర పార్లమెంటరీమైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరెణ్ రిజిజుమధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ పంపిన ప్రత్యేక సందేశాలు ఈ కార్యక్రమంలో ప్రసారమయ్యాయిఈ చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్నవారిని అభినందిస్తూ.. నివారణ ఆరోగ్య సంరక్షణకూసమగ్ర ఆరోగ్యానికీ దోహదపడే సాధనంగా యోగాకున్న ప్రాధాన్యాన్ని వారు తెలియజేశారుదైనందిన కార్యకలాపాల్లో యోగాను భాగం చేసుకోవడం ద్వారా యోగా-365 స్ఫూర్తిని స్వీకరించాలని పౌరులకు పిలుపునిచ్చారు.

మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ (ఎండీఎన్ఐవై), ఇతర భాగస్వామ్య సంస్థల సహకారంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందిఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా నిర్వహించిన ప్రత్యక్ష ప్రసారంలో భారతదేశంతో పాటు ప్రపంచం నలుమూలలకు చెందినవారు పాల్గొన్నారుఈ కార్యక్రమం అంతటా హాబిల్డ్ నిపుణుల బృందం అందించిన మార్గదర్శకత్వంతో కామన్ యోగా ప్రొటోకాల్ (సీవైపీ)ను ప్రదర్శించారు.

‘‘ఆరోగ్యవంతమైన జీవనం కోసం యోగా’’ (స్వస్థ ఆయు కేలియే యోగాఅనే ఇతివృత్తంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం – 2026ను నిర్వహించేందుకు భారత్ సన్నద్ధమవుతోన్న నేపథ్యంలో ఈ విజయం లభించిందిఅన్ని వయసుల వారికి ఆరోగ్యంతో కూడిన దీర్ఘాయుష్షును ప్రోత్సహించడంలోనూజీవన నాణ్యతను పెంపొందించడంలోనూశారీరకమానసికభావోద్వేగ సంక్షేమానికి తోడ్పటంలోనూ యోగా పోషించే పాత్రను ఈ ఇతివృత్తం తెలియజేస్తుందిఅంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై)-2026 ప్రధాన వేడుక జూన్ 21న పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో జరుగుతుందిఆరోగ్యంసామరస్యం కోసం జరుగుతున్న ఈ అంతర్జాతీయ ఉద్యమం.. యోగా ఔత్సాహికులనూసాధకులనూభాగస్వాములనూ ఏకతాటిపైకి తీసుకువస్తుంది.

చరిత్రాత్మక విజయం సాధించేలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికీయోగా సంస్థలకూవిద్యా సంస్థలకూప్రభుత్వ విభాగాలకూకార్పొరేట్ సంస్థలకూసామాజిక బృందాలకూప్రవాస భారతీయులకూ ఆయుష్ మంత్రిత్వ శాఖ కృతజ్ఞతలు తెలియజేసింది.

అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 సమీపిస్తున్న నేపథ్యంలో యోగాను ఒక జీవన మార్గంగా ఎంచుకోవాలనీ, ‘‘హర్ ఘర్ యోగాహర్ దిన్ యోగా’’ సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనీ మంత్రిత్వ శాఖ కోరింది.

***


(రిలీజ్ ఐడి: 2272780) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam