ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పర్యావరణ పరిరక్షణలో ఘనతను సాధించిన అస్సాం ప్రజలను అభినందించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 05 JUN 2026 11:42PM by PIB Hyderabad

పర్యావరణ పరిరక్షణలో ప్రశంసనీయమైన ఘనతను సాధించినందుకు అస్సాం ప్రజలకు, ముఖ్యంగా ఆ రాష్ట్ర నారీశక్తికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. సుస్థిరమైన భూమండలాన్ని సాధించే లక్ష్యంతో చేపట్టిన ఈ గొప్ప ప్రయత్నంలో ఆ రాష్ట్ర నారీశక్తి ముందుండి నడిపించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

" ప్రశంసనీయమైన ఘనత. సుస్థిరమైన భూమండలాన్ని సాధించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రయత్నంలో ముందుండి నడిచిన అస్సాం ప్రజలకు, ముఖ్యంగా ఆ రాష్ట్ర నారీశక్తికి నా హృదయపూర్వక అభినందనలు."


(रिलीज़ आईडी: 2269923) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Gujarati , Tamil