సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ప్రతిష్ఠాత్మకమైన ఎనిమిది రిత్విక్ ఘటక్ సినిమాలను 4కేలో పునరుద్ధరించిన ఎన్ఎఫ్ డీసీ - ఎన్ఎఫ్ఏఐ


బ్రిటిష్ చలనచిత్ర సంస్థ (బీఎఫ్ఐ)తో భాగస్వామ్యంతో ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు

చేరువైన రిత్విక్ ఘటక్ కథన కళ: ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ మగ్దుం

प्रविष्टि तिथि: 03 JUN 2026 12:52PM by PIB Hyderabad

దిగ్గజ దర్శకుడు రిత్విక్ ఘటక్ రూపుదిద్దిన ఫీచర్ ఫిల్మ్‌లను.. సమాచారప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీపరిధిలోని జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ జాతీయ చలనచిత్ర భాండాగారం (ఎన్ఎఫ్‌డీసీ ఎన్ఎఫ్ఏఐ) 4కే సాంకేతికతతో విజయవంతంగా పునరుద్ధరించిందిసుసంపన్నమైన దేశ చలనచిత్ర వారసత్వ పరిరక్షణప్రపంచవ్యాప్తంగా దానికి ప్రాచుర్యం కల్పించే దిశగా ఇదొక చరిత్రాత్మక ముందడుగుదర్శకుడు ఘటక్ శతాబ్ది జయంత్యుత్సవాలను పురస్కరించుకుని – బ్రిటిష్ చలనచిత్ర సంస్థ (బీఎఫ్ఐభాగస్వామ్యంతో.. లండన్‌లోని ప్రతిష్ఠాత్మక బీఎఫ్ఐ సౌత్‌బ్యాంక్‌లో 2026 జూన్ నుంచి అలనాటి మన సినిమాలను ఎన్ఎఫ్‌డీసీ ఎన్ఎఫ్ఏఐ ప్రదర్శిస్తోందిఘటక్ విప్లవాత్మక కథనశైలినీలోతైన కళాత్మక దృష్టినీ.. అత్యంత స్పష్టంగాసహజంగా అంతర్జాతీయ ప్రేక్షకులు దృశ్య రూపంలో వీక్షించే అవకాశం ఈ సమగ్ర ప్రదర్శన ద్వారా లభిస్తుంది.

 

ఘటక్ చలనచిత్రాల పునరుద్ధరణ ప్రాజెక్టు జాతీయ చలనచిత్ర వారసత్వంలో అత్యంత ప్రశంసనీయమైన కృషిఈ అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థాగత ప్రాధాన్యంపై ఎన్‌ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మగ్దుమ్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన చలనచిత్ర పరంపర కలిగిన దేశాల్లో భారత్ ఒకటిఎన్‌ఎఫ్‌హెచ్‌ఎమ్ పరిధిలో ఈ చలనచిత్ర సంపదను అత్యున్నతమైన అంతర్జాతీయ ప్రమాణాలతో పునరుద్ధరించడంపరిరక్షించడం ఎన్‌ఎఫ్‌డీసీ ఎన్‌ఎఫ్‌ఏఐ బాధ్యతశ్రీ రిత్విక్ ఘటక్ శతాబ్ది జయంత్యుత్సవాలను జరుపుకొంటున్న తరుణంలో.. లండన్‌లో ఈ సినిమాల ప్రదర్శన కోసం బీఎఫ్ఐతో భాగస్వామ్యం కావడం మాకు సంతోషాన్నిస్తోందిశ్రీ ఘటక్ అద్భుత ప్రతిభను అంతర్జాతీయ చలనచిత్ర రంగం అనుభవ పూర్వకంగా తెలుసుకోవడానికిఅలనాటి సినిమాలను కాపాడుకోవడంలో దేశం తీసుకుంటున్న శ్రద్ధకు కూడా ఇది నిదర్శనం’’ అని అన్నారు.

 

 

 

దేశ దృశ్య శ్రవణ పరంపర సంరక్షణ కోసం సమాచారప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జాతీయ చలనచిత్ర వారసత్వ మిషన్ (ఎన్ఎఫ్‌హెచ్ఎంకింద ఈ కళాఖండాలను ఘనంగా ప్రదర్శించారుఎన్‌ఎఫ్‌డీసీ ఎన్‌ఎఫ్‌ఏఐ వద్ద దశాబ్దాలుగా భద్రంగా ఉన్న వివిధ మూల చిత్రాలతోపాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర చలనచిత్ర భాండాగారం నుంచి సేకరించిన అమూల్యమైన వనరులను ఉపయోగించి 4కే సాంకేతికతతో సునిశితంగా చిత్రాలను పునరుద్ధరించారుదృశ్య ప్రామాణికతనుఆ దిగ్గజ దర్శకుడి మౌలిక సినీ దృక్పథాన్ని నిలిపి ఉంచేలా.. జాతీయ అవార్డు గ్రహీతప్రముఖ భారతీయ సినిమాటోగ్రాఫర్ శ్రీ అవిక్ ముఖోపాధ్యాయ్ స్వయంగా కలర్ గ్రేడింగ్ ప్రక్రియను పర్యవేక్షించారుఎన్‌ఎఫ్‌హెచ్‌ఎమ్ పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రశంసిస్తూ.. “జాతీయంగాఅంతర్జాతీయంగా పేరున్న గొప్ప దర్శకులలో ఒకరైన ఘటక్ చిత్రాల పునరుద్ధరణలో భాగస్వామిని కావడం నాకెంతో గర్వంగాఆనందంగా ఉందిఒక సినిమాటోగ్రాఫర్‌గా ఆయన అద్భుత నైపుణ్యాన్ని చాలా దగ్గరగా పరిశీలించే అవకాశం నాకు లభించిందిఎంతో శ్రమతో కూడుకున్నప్పటికీఅద్భుతంగా కృషి చేసిన మొత్తం బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అన్నారు.

 

సుదీర్ఘమైనఖ్యాతిగడించిన ఘటక్ కెరీర్‌లోని వివిధ కాలాల నాటి సృజనాత్మక ప్రపంచాన్ని ఆస్వాదించే గొప్ప అవకాశం లండన్‌లో ఈ కళాకండాల ప్రదర్శన వల్ల లభిస్తుందిఈ విస్తృతమైన కార్యక్రమంలో భాగంగా.. ఆయన రూపుదిద్దిన ఎనిమిది అత్యంత ప్రభావవంతమైన కథా చిత్రాలను (నాగరిక్అజంత్రిక్బారి థేకే పాలియేమేఘే ఢాకా తారాకోమల్ గంధార్సువర్ణరేఖతితాస్ ఏక్తి నదీర్ నామ్జుక్తి తక్కో ఆర్ గప్పో) 4కే సాంకేతికతతో పునరుద్ధరించి ప్రదర్శించనున్నారుఈ కళాఖండాలతోపాటు.. ఆయన రూపొందించిన చారిత్రక ప్రాధాన్యమున్న లఘు చిత్రాలుడాక్యుమెంటరీలుఅరుదైన అసంపూర్ణ చిత్రాలను కూడా ప్రదర్శిస్తారువీటిలో బీహార్ కే దర్శనీయ స్థాన్ముసాఫిర్ఫియర్రెండీవూనాగరిక్ సంరక్షణ్సైంటిస్ట్స్ టుమారోయే క్యూమై లెనిన్పురులియార్ చౌదర్బార్ గతి పద్మహీరేర్ ప్రజాపతిచిన్నముల్రాంకింకర్ బైజ్రౌంగర్ గోలంబగలర్ బంగ దర్శన్ చిత్రాలున్నాయి.

 

 

 

ఎన్ఎఫ్‌డీసీ ఎన్ఎఫ్ఏఐబీఎఫ్ఐ మధ్య ఈ భాగస్వామ్యం.. భారతీయ సినీ సంపదను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పునరుద్ధరించడంలో మన నిబద్ధతను స్పష్టం చేస్తోందిజాతీయ చలనచిత్ర వారసత్వ మిషన్ కింద ఇలాంటి విస్తృత పునరుద్ధరణప్రోత్సాహక కార్యక్రమాలకు ఊతమివ్వడం ద్వారా.. ఈ అద్భుత కళాఖండాలు భౌగోళిక సరిహద్దులను దాటి విస్తరించిమరెన్నో దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు స్ఫూర్తినిచ్చేలా నిలిచి ఉండేలా భారత ప్రభుత్వం కృషి చేస్తోంది.

 

ఎన్ఎఫ్‌డీసీ - ఎన్ఎఫ్ఏఐ గురించి

జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ – జాతీయ చలనచిత్ర భండాగారం (ఎన్ఎఫ్‌డీసీ ఎన్ఎఫ్ఏఐ).. దేశ సినీ వారసత్వాన్ని పరిరక్షించిరికార్డు చేసిప్రాచుర్యం కల్పించేందుకు అంకితమైన అగ్రగామి సంస్థభావితరాల కోసం చారిత్రకసాంస్కృతికకళాత్మక ప్రాధాన్యం కలిగిన చలనచిత్రాలను గుర్తించడంసేకరించడంభద్రపరచడంపునరుద్ధరించడం దీని ముఖ్య లక్ష్యంప్రపంచ సినిమాకు ప్రాతినిధ్యం వహించే అద్భుతమైన కలెక్షన్‌ను కూడా ఈ సంస్థ నిర్వహిస్తోంది.

1969 నుంచి అంతర్జాతీయ చలనచిత్ర మూలప్రతుల సమాఖ్య (ఎఫ్ఐఏఎఫ్)లో సభ్యత్వమున్న ఎన్ఎఫ్‌డీసీ – ఎన్ఎఫ్ఏఐ.. దేశ చలనచిత్ర చరిత్రకు ఒక కీలక నిధిగా సేవలందిస్తోందిదీని పరిశోధన రికార్డుల విభాగంలో విస్తృతంగా సినిమాకి సంబంధించినవి అనేకం ఉన్నాయిఇందులో లక్షలకు పైగా ఫొటోలు, 40,000 సినిమా పోస్టర్లు, 24,000 పాటల పుస్తకాలు, 2.28 లక్షల పత్రికా వార్తలు కూడా ఉన్నాయిపరిరక్షణతోపాటు పరిశోధన పరిశోధన ప్రయోజనాల కోసం చాలా వరకూ వాటిని డిజిటల్ రూపంలో భద్రపరిచారు.

 

జాతీయ చలనచిత్ర వారసత్వ మిషన్ (ఎన్ఎఫ్‌హెచ్ఎంగురించి:

 

దేశంలో చలనచిత్ర పరిరక్షణ చర్యలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా.. 2015లో జాతీయ చలనచిత్ర వారసత్వ మిషన్‌ను భారత ప్రభుత్వం ప్రారంభించిందిప్రసిద్ధ భారతీయ చలనచిత్రాలను 2కే, 4కే సాంకేతికతల్లోకి మార్చడంతో పాటుఫిల్మ్ రీళ్ల స్థితిగతులను అంచనా వేయడంఅత్యాధునిక ఆర్కైవల్ వాల్టులను రూపొందించడంశిక్షణ తరగతులువర్క్‌షాపుల ద్వారా ఈ రంగంలో సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి కీలక చర్యలను.. ఈ మిషన్ కింద ఎన్ఎఫ్‌డీసీ – ఎన్ఎఫ్ఏఐ సంస్థలు సంయుక్తంగా చేపడుతున్నాయి.

ఈ కార్యక్రమాల ద్వారా సుసంపన్నమైన భారతీయ సినీ పరంపరను పరిరక్షించడంలో ఎన్ఎఫ్‌డీసీ ఎన్ఎఫ్ఏఐ కీలక పాత్ర పోషిస్తోందిఅజరామరమైన నిలిచే ఈ చిత్రాలు నేటి యువతకూభావి తరాలకూ అందుబాటులో ఉండేలా చూస్తోంది.

***


(रिलीज़ आईडी: 2268890) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Punjabi , Gujarati , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Bengali-TR , Tamil , Kannada , Malayalam