మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్- 2026కు నామినేషన్ల ఆహ్వానం

నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ 2026 జూలై 31

నేషనల్ అవార్డ్స్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్లో నామినేషన్ల సమర్పణ

प्रविष्टि तिथि: 27 APR 2026 12:02PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా పిల్లల అసాధారణ విజయాలను గుర్తించిఏటా ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి పురస్కారమైన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (పీఎంఆర్‌బీపీ)- 2026 కోసం భారత ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానించింది. ధైర్యంక్రీడలుసామాజిక సేవవిజ్ఞాన శాస్త్రాలు - సాంకేతికతపర్యావరణం, కళలు - సంస్కృతి రంగాలలో జాతీయ స్థాయి గుర్తింపునకు అర్హులైన బాలలకు ఈ పురస్కారాలను అందజేస్తారు.

భారత పౌరులై ఉండి దేశంలో నివసిస్తూ.. 2026 జూలై 31 నాటికి అయిదేళ్లు నిండి, 18 సంవత్సరాలు వయస్సు దాటని బాలలు ఈ పురస్కారాలకు అర్హులు.

https://awards.gov.in లోని జాతీయ అవార్డుల పోర్టల్ ద్వారా పౌరులెవరైనా నామినేషన్లను సమర్పించవచ్చు. ఆన్లైన్ ద్వారా మాత్రమే నామినేషన్లను స్వీకరిస్తారు. స్వీయ నామినేషన్, సిఫార్సులు రెండింటినీ పరిగణిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 2026 జూలై 31. మరిన్ని వివరాల కోసం జాతీయ పురస్కారాల పోర్టల్‌ను (https://awards.gov.in) చూడవచ్చు.  


(रिलीज़ आईडी: 2255986) आगंतुक पटल : 65
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali-TR , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam