ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్‌.. ఆస్ట్రేలియా.. కెనడా ప్రభుత్వాల సంయుక్త ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 22 NOV 2025 9:21PM by PIB Hyderabad

‘ఆస్ట్రేలియా-కెనడా-ఇండియా టెక్నాలజీ.. ఇన్నొవేషన్‌’ (ఏసీఐటీఐ) భాగస్వామ్యం పేరిట సాంకేతికత, ఆవిష్కరణల రంగంలో మూడు దేశాల ప్రభుత్వాలు ఈ రోజు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఈ మేరకు కీలక, ఆవిష్కరణాత్మక సాంకేతిక పరిజ్ఞానాలపై సహకారంలో తమ ఆకాంక్షను బలోపేతం సహా ఇప్పటికే కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాల అమలుపై మూడు పక్షాలూ అంగీకారానికి వచ్చాయి.

మూడు దేశాల సహజ శక్తిసామర్థ్యాలపై ఆధారపడిన ఈ ఒప్పందం కీలక ఖనిజాలు సహా కాలుష్య రహిత ఇంధనం, పునరుత్థాన సమర్థ సరఫరా వ్యవస్థల రూపకల్పనకు ప్రాధాన్యమిస్తుంది. అలాగే, నికర శూన్య ఉద్గారాల సంబంధిత ఆకాంక్షలకు, వ్యూహాత్మక సహకారానికి మరింత ఊతమిస్తుంది. తద్వారా సురక్షిత, సుస్థిర, పునరుత్థాన సమర్థ భవిష్యత్తు దిశగా సరఫరా వ్యవస్థల్లో వైవిధ్యాన్ని నడిపిస్తుంది. అంతేకాకుండా మూడు దేశాల పౌరుల జీవన సౌలభ్యం లక్ష్యంగా కృత్రిమ మేధ పరిజ్ఞానాల రూపకల్పన, సామూహిక అనుసరణను కూడా ఈ భాగస్వామ్యం పరిగణనలోకి తీసుకుంటుంది.

ఈ త్రైపాక్షిక ఒప్పందం సమగ్ర అమలుపై చర్చించేందుకు 2026 తొలి త్రైమాసికంలో అధికారుల స్థాయి సమావేశం నిర్వహించాలని మూడు ప్రభుత్వాలూ నిర్ణయించాయి.

***


(రిలీజ్ ఐడి: 2254308) సందర్శకుల సూచీ సంఖ్య : : 12