పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమాసియాలో సంఘర్షణ వల్ల తలెత్తిన ప్రపంచ ఇంధన సరఫరా అంతరాయాల పరిష్కారం దిశగా చేపట్టిన చర్యలపై పార్లమెంటులో కేంద్ర పెట్రోలియం-సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 12 MAR 2026 5:09PM by PIB Hyderabad

గౌరవనీయ అధ్యక్షా!

పశ్చిమాసియాలో సంఘర్షణ ఫలితంగా ప్రపంచ ఇంధన సరఫరాకు అంతరాయం కలిగిన నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం-సహజ వాయువు శాఖ తీసుకున్న చర్యల గురించి మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ఈ ఇవాళ లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. మారుతున్న ప్రపంచ పరిస్థితుల నడుమ దేశ ఇంధన భద్రత పరిరక్షణలో భాగంగా పెట్రోలియం ఉత్పత్తుల నిరంతర లభ్యతకు భరోసా ఇస్తూ తాము తీసుకుంటున్న చర్యల గురించి ఆయన సభకు కింది విధంగా వివరించారు:

గౌరవనీయ అధ్యక్షా!

పశ్చిమాసియా సంఘర్షణ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి సభకు వివరించడానికి అనుమతి కోరుతున్నాను.

గౌరవనీయ అధ్యక్షా!

1. ఆధునిక ఇంధన చరిత్రలో ప్రపంచం ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ ఎదుర్కొనలేదు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య సైనిక సంఘర్షణల నేపథ్యంలో ప్రపంచానికి సరఫరా అయ్యే ముడి చమురు, సహజ వాయువు, వంటగ్యాస్‌ పరిమాణంలో 20 శాతం హార్ముజ్ జలసంధి గుండా రవాణా కావాల్సి ఉంటుంది. అయితే, ఆ మార్గం మూసివేత తర్వాత నేటికి 13వ రోజు గడుస్తుండగా, ఆ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల పయనం స్తంభించింది. ఈ సంఘర్షణలో భారత్‌ పాత్ర ఏ మాత్రం లేనప్పటికీ, అనేక దేశాల తరహాలో ఆ కల్లోలం పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తోంది.

2. ఇతర దేశాలపై ఈ సంక్షోభ ప్రభావంతో పోలిస్తే భారత్‌ చురుగ్గా ప్రతిస్పందించి, ఉపశమన చర్యలు చేపట్టింది. మన పొరుగు దేశం ఒకటి రెండు వారాలపాటు పాఠశాలలన్నీ మూసివేయగా, ప్రభుత్వ కార్యాలయాల పనిదినాలను వారంలో 4 రోజులకు కుదించింది. ప్రభుత్వోద్యోగులలో 50 శాతానికి ఇంటి నుంచే పని అప్పగించింది. అధికార వాహనాలకు ఇంధన భత్యాన్ని 50 శాతం, ప్రభుత్వ వాహన వినియోగాన్ని 60 శాతం వంతున తగ్గించింది. అలాగే ఆ దేశ చరిత్రలో ఒకే రోజు ఎన్నడూ లేనంత ఇంధన ధర పెరుగుదలను చవిచూసింది. ముఖ్యంగా పెట్రోల్ ధర వారం వ్యవధిలో దాదాపు 20 శాతం పెరిగింది. మరొక పొరుగు దేశం విశ్వవిద్యాలయాలను ఎప్పుడో మూసివేసింది. ఇంధన ఆదా కోసం రంజాన్‌ సెలవులను ముందుకు జరిపింది. మరోవైపు ఆగ్నేయాసియా దేశాలు కూడా ఇంధనంపై రేషన్ విధింపుతోపాటు పరిరక్షణ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.

మరోవైపు ప్రత్యామ్నాయ సేకరణ ద్వారా కొరతను గణనీయంగా తగ్గించామని సభకు తెలియజేయడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. ప్రత్యామ్నాయ సరఫరా మార్గాల ద్వారా పెద్ద మొత్తంలో ఎల్‌ఎన్‌జీ రవాణా నౌకలు దాదాపు నిత్యం దేశానికి వస్తున్నాయి. సంఘర్షణ దీర్ఘకాలం కొనసాగినా ఈ పరిస్థితిని భారత్‌ కొనసాగించగలదు. ఆ మేరకు తగినంత గ్యాస్ ఉత్పత్తి-సరఫరా ఏర్పాట్లు భారత్‌కు ఉన్నాయి. కాబట్టి, ప్రతి ఇల్లు, పరిశ్రమ కోసం విద్యుదుత్పాదనకు పూర్తిగా రక్షణ లభిస్తుంది.

రోజులుగా నిర్ణయించాం. అలాగే, గ్రామీణ, దుర్గమ క్షేత్ర ప్రాంతాల్లో 45 రోజులుగా నిర్దేశించాం. ఓఎంసీ క్షేత్రస్థాయి అధికారులు, కల్తీ నిరోధక విభాగం సంయుక్తంగా పంపిణీదారుల స్థాయిలో అమలును సమన్వయం చేస్తున్నాయి. రాష్ట్ర స్థాయి వ్యవహారాలను కేంద్ర సరఫరా-అమలు చట్రంతో సమన్వయం చేయడానికి హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ఒక సమావేశం కూడా నిర్వహించారు.

గౌరవనీయ అధ్యక్షా!

8. వాణిజ్య ఎల్‌పీజీ బ్లాక్ మార్కెటింగ్‌ నిరోధం దిశగా పటిష్ఠ నియంత్రణ విధించాం. ఇది ఆతిథ్య రంగానికి ఇబ్బందులు సృష్టించడానికి ఉద్దేశించింది కాదు. వాణిజ్య ఎల్‌పీజీ పూర్తిగా నియంత్రణ రహిత, ఓవర్-ది-కౌంటర్ మార్కెట్‌లో మార్కెట్ ధరకు, ప్రభుత్వ సబ్సిడీ లేకుండా లభిస్తుంది. దీనికి రిజిస్ట్రేషన్ వ్యవస్థ లేదు.. బుకింగ్ అవసరం లేదు.. డిజిటల్ ప్రామాణీకరణ అవసరం ఉండదు.. సరఫరా నిర్ధారణ విధానం లేదు. ఏదైనా వ్యాపారం లేదా వ్యక్తి సాధారణ సమయాల్లో ప్రభుత్వ నియంత్రణ లేకుండా, అమ్మకపు సమయంలో ఏ పరిమాణంలోనైనా సిలిండర్లను కొనుగోలు చేసుకోవచ్చు. ప్రజల ఆందోళన ఎక్కువగా ఉన్న సరఫరా-నిర్బంధ వాతావరణంలో ఈ నియంత్రణ లేని వ్యవస్థ అక్రమ నిల్వ, మళ్లింపు, పెరిగిన ధరలతో పునఃవిక్రయానికి ప్రత్యక్ష-అనియంత్రిత మార్గాన్ని సృష్టిస్తుంది. వాణిజ్య సరఫరాను పూర్తిగా నియంత్రించకపోతే, కౌంటర్ ద్వారా కొనుగోలు చేసిన సిలిండర్లను నిజమైన వాణిజ్య, గృహ వినియోగదారులు అక్రమ మార్కెట్‌కు మళ్లించే అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వం బాధ్యతాయుత చర్యలు చేపట్టి విస్పష్ట ప్రాధాన్యాలు, పారదర్శక కేటాయింపు విధానంతో ఈ వ్యవస్థను నియంత్రిస్తోంది. ఐఓసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కూడిన త్రిసభ్య కమిటీని ఈ నెల 9వ తేదీన ఏర్పాటు చేశాం. దేశవ్యాప్తంగా రాష్ట్ర పౌర సరఫరా విభాగాలు, రెస్టారెంట్ సంఘాలతో విస్తృత సమావేశాలు నిర్వహించగా, ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అందుబాటులోగల వాణిజ్య పరిమాణం నుంచి ముందుగా వాస్తవ వినియోగదారుల అవసరాలు తీర్చేలా భౌగోళికంగా-రంగాలవారీగా నిజమైన అవసరాలను ఈ కమిటీ అంచనా వేసింది. ఓ ప్రధాన నిర్ణయం కింద సగటు నెలవారీ వాణిజ్య ఎల్‌పీజీ అవసరాల్లో 20 శాతాన్ని ఇవాళ్టినుంచి రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ‘ఓఎంసీ’లు కేటాయిస్తాయి. కాబట్టి, అక్రమ నిల్వ లేదా బ్లాక్ మార్కెటింగ్‌కు అవకాశం ఉండదు.

గౌరవనీయ అధ్యక్షా!

9. ఎల్‌పీజీ, గ్యాస్ సరఫరా లైన్లపై ఒత్తిడి తగ్గించేలా ప్రత్యామ్నాయ ఇంధన వినియోగ మార్గాన్ని అమలులోకి తెస్తున్నారు. ఈ మేరకు చిల్లర విక్రయ కేంద్రాలు, ప్రజా పంపిణీ కేంద్రాల ద్వారా కిరోసిన్ అందుబాటులోకి వస్తుంది. పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు ఇంధన చమురు లభిస్తోంది. ఈ సంక్షోభ సమయంలో ఆతిథ్య, రెస్టారెంట్ విభాగానికి ప్రత్యామ్నాయ ఇంధనం కింద బయోమాస్, ఆర్డీఎఫ్‌ గుళికలు, కిరోసిన్‌ లేదా బొగ్గును ఒక నెల పాటు వినియోగించేలా అనుమతినివ్వాలని పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులకు సూచించింది. తద్వారా విస్తృత శ్రేణి సంస్థలు ప్రాధాన్య జాబితాలోని వినియోగదారులకు ఎల్‌పీజీని మళ్లించేందుకు, సరఫరా చేయడానికి వీలు కల్పిస్తుంది.

10. ప్రపంచ మార్కెట్ పరిస్థితుల నుంచి వినియోగదారు ధరలకు రక్షణ లభించింది. ఈ మేరకు 2023 జూలై 2626 మార్చి మధ్య సౌదీ కాంట్రాక్ట్ ధర 41 శాతం పెరిగినప్పటికీ, పీఎంయూవై లబ్ధిదారులకు సిలిండర్‌ ధర 32 శాతం తగ్గింది. అలాగే ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ.613 వద్ద ఉండగా, సబ్సిడీ రహిత వినియోగదారుల ధర ఇటీవల రూ.60 పెంపుతో రూ.913 కాగా, మార్కెట్ ని ధర సుమారు రూ.987గా ఉంటుంది. ప్రస్తుత ప్రపంచ మార్కెట్ పరిస్థితుల ప్రకారం సిలిండర్‌కు రూ.134 పెంచాల్సి ఉన్నా ప్రభుత్వం రూ.74 మేర భారం భరిస్తోంది. దీనివల్ల ‘పీఎంయూవై’ కింద గృహ వినియోగదారులకు రోజుకు 80 పైసలకు మించి ఖర్చు పెరగదు. అయితే, పొరుగునగల పాకిస్థాన్‌లో ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.1,046 కాగా, , శ్రీలంకలో రూ.1,242, నేపాల్‌లో రూ.1,208గా ఉంది. ‘ఓఎంసీ’లకు 2024-25లో వాటిల్లిన సుమారు రూ.40,000 కోట్ల నష్టాన్ని ప్రభుత్వం రూ.30,000 కోట్ల పరిహారంతో భర్తీ చేసింది.

గౌరవనీయ అధ్యక్షా!

11. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తి సహకారం, చురుకైన సమన్వయంతో స్పందించాయి. ఈ మేరకు ఈ నెల 11న ఓఎంసీ సీనియర్ అధికారులు ప్రతి ప్రధాన రాష్ట్ర పాలన యంత్రాంగ అధికారులతో సమావేశమయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, గోవా, ఒడిషా, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్ ప్రభుత్వాధికారులతో చర్చించారు. తదనుగుణంగా సరఫరా స్థాయి, ప్రాధాన్య క్రమం, అమలు చట్రంపై ప్రధాన కార్యదర్శులు, సీనియర్ అధికారులకు విధివిధానాలను వివరించారు. ఇందులో భాగంగా జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటవుతాయి. అనేక రాష్ట్రాల్లో ఇంధనం దారిమళ్లింపును నిరోధిస్తూ ఆకస్మిక దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేయబడ్డాయి. ఈ జాతీయ సంక్షోభ సమయంలో తదనుగుణ సమన్వయ స్పందన మన సహకారాత్మక సమాఖ్యవాదానికి నిదర్శనం.

గౌరవనీయ అధ్యక్షా!

12. భారత్‌, ప్రపంచ చరిత్రలోనే అత్యంత తీవ్ర అంతర్జాతీయ ఇంధన అంతరాయాన్ని ఎదుర్కొంటున్నందున వదంతులు పుట్టించడానికి లేదా తప్పుదోవ పట్టించే కథనాలకు ఇది సమయం కాదు. ముడి చమురు సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇళ్లకు, పొలాలకు గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఎల్‌పీజీ ఉత్పత్తి 28 శాతం పెరిగింది. మార్కెట్లు, ప్రాంతీయ వ్యత్యాసాలతో పోలిస్తే నిర్దేశించిన దానికన్నా వినియోగదారు ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. పాఠశాలలు సజావుగా పనిచేస్తున్నాయి. పెట్రోలుకు అగ్ర ప్రాధాన్యం ఉంది. రాజకీయ సిద్ధాంతాలతో నిమిత్తం లేకుండా ప్రతి పౌరుడికీ ఇందులో వాటా ఉంది. తదనుగుణంగా దేశం తన ఇంధన యోధులకు, ఈ సంక్షోభాన్ని నిభాయించే సంస్థలకు, ముఖ్యంగా జాతీయ ప్రయోజనాలకు వెన్నుదన్నుగా నిలవాలి. ఈ నేపథ్యంలో భారత్‌ సన్నద్ధత రికార్డు, ప్రతిస్పందన రికార్డులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయి.

***


(రిలీజ్ ఐడి: 2239139) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam