ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

టెల్ అవీవ్ చేరుకున్న ప్రధానమంత్రికి సాదర స్వాగతం పలికిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 25 FEB 2026 7:42PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అధికారిక పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. టెల్ అవీవ్‌లోని విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గౌరవ బెంజమిన్ నెతన్యాహు, ఆయన భార్య సారా నెతన్యాహు సాదర స్వాగతం పలికారు.

స్వాగత కార్యక్రమం అనంతరం ఇరువురు ప్రధానులు కొద్దిసేపు ముఖాముఖి సమావేశం నిర్వహించారు. హోటల్‌కి చేరుకున్న ప్రధానమంత్రికి ప్రవాస భారతీయులు, యూదులైన ప్రవాసుల సంఘ ప్రతినిధులు హృదయపూర్వకంగా, ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య శాశ్వత స్నేహానికి ప్రతీకగా ఈ స్వాగత కార్యక్రమంలో భారతీయ, ఇజ్రాయెల్ కళాకారులతో ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.

 
***

(रिलीज़ आईडी: 2232877) आगंतुक पटल : 79
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam