ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

షిల్లాంగ్ లోక్‌సభ సభ్యుడు డాక్టర్ రిక్కీ ఏజే సింగ్కాన్ మృతికి ప్రధాని సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 20 FEB 2026 9:31AM by PIB Hyderabad

షిల్లాంగ్ లోక్‌సభ సభ్యుడు డాక్టర్ రిక్కీ ఏజే సింగ్కాన్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టులో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

‘‘షిల్లాంగ్ లోక్‌సభ సభ్యుడు డాక్టర్ రిక్కీ ఏజే సింగ్కాన్ మృతి దిగ్భ్రాంతి కలిగించింది. మేఘాలయ ప్రజలకు చేసిన సేవలకు ఆయన చిరస్మరణీయంగా నిలిచిపోతారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, మద్దతుదారులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’’.


(రిలీజ్ ఐడి: 2230640) సందర్శకుల సూచీ సంఖ్య : : 79