|
ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
అస్సాంలో బ్రహ్మపుత్ర నది కింద రెండు వరుసల ట్విన్ ట్యూబ్ టీబీఎం రహదారి అండర్ వాటర్ టన్నెల్ నిర్మాణానికి, ఒక ట్యూబ్‌లో రైల్వే మౌలిక సదుపాయాల ఏర్పాటుకూ కేబినెట్ ఆమోదం
మొత్తం పొడవు 33.7 కిలోమీటర్లు
నాడు పోస్టు చేయడమైనది:
14 FEB 2026 12:56PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 715 సెక్షన్‌లో ఎన్‌హెచ్-15లోని గోహ్‌పూర్ నుంచి నుమాలీగఢ్ వరకు 4-వరుసల యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ కనెక్టివిటీ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. బ్రహ్మపుత్ర నది కింద 15.79 కిలోమీటర్ల రోడ్ కమ్ రైల్ టన్నెల్‌ను అస్సాంలో రూ.18,662 కోట్ల మూలధన వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు.
ప్రస్తుతం, ఎన్‌హెచ్-715 లోని నుమాలిగఢ్, ఎన్‌హెచ్-15 లోని గోహ్‌పూర్ మధ్య కనెక్టివిటీ ఎన్‌హెచ్-52 లోని సిల్‌ఘాట్ సమీపంలో గల కాలియాభంభోరా రోడ్ వంతెన నుంచి 240 కిలోమీటర్ల దూరంలో ఉంది. నుమాలిగఢ్, కజిరంగా జాతీయ ఉద్యానవనం, బిశ్వనాథ్ పట్టణం గుండా సాగే ఈ ప్రయాణానికి 6 గంటలు పడుతుంది. ఈ సవాళ్లను పరిష్కరించడం కోసం ఈ ప్రాజెక్టును ఎన్‌హెచ్-15 లోని గోహ్‌పూర్ నుంచి నుమాలిగఢ్ వరకు 4-వరుసల యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ కనెక్టివిటీగా బ్రహ్మపుత్ర నది క్రింద రోడ్ కమ్ రైల్ టన్నెల్‌తో అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఇది ప్రపంచంలోనే రెండోది... దేశంలోని మొదటిది అయిన నీటి అడుగున నిర్మిస్తున్న రోడ్ కమ్ రైల్ టన్నెల్. ఈ ప్రాజెక్ట్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఇతర ఈశాన్య రాష్ట్రాలకు గణనీయ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచుతుంది. సరుకు రవాణా వ్యయాన్నీ తగ్గిస్తుంది. ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక వృద్ధిని పెంచుతుంది.
ఈ ప్రాజెక్ట్ అలైన్‌మెంట్ రెండు ప్రధాన జాతీయ రహదారులతో (ఎన్‌హెచ్-15, ఎన్‌హెచ్ -715), రెండు రైల్వే మార్గాలతో అనుసంధానం కానుంది. అవి గోహ్‌పూర్ వైపు ఎన్ఎఫ్ఆర్ రంగియా డివిజన్ కింద ఉన్న రంగియా-ముకోంగ్‌సెలెక్ రైల్వే సెక్షన్... నుమాలిగఢ్ వైపు ఎన్ఎఫ్ఆర్ టిన్సుకియా డివిజన్ కింద గల ఫుర్కేటింగ్-మరియాని లూప్ లైన్ సెక్షన్. ఈ ప్రాజెక్ట్ అస్సాంలోని కీలకమైన ఆర్థిక, సామాజిక, సరుకు రవాణా కేంద్రాలకు సజావైన కనెక్టివిటీని అందిస్తుంది. అదనంగా, ఈ ప్రాజెక్ట్ 11 ఆర్థిక కేంద్రాలు, 3 సామాజిక కేంద్రాలు, 2 పర్యాటక కేంద్రాలు, 8 సరుకు రవాణా కేంద్రాలతో అనుసంధానం ద్వారా బహుళ రవాణా విధానాల ఏకీకరణను మెరుగుపరుస్తుంది. 4 మేజర్ రైల్వే స్టేషన్స్, 2 విమానాశ్రయాలు, 2 ఇన్‌ల్యాండ్ జలమార్గాలతో మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. తద్వారా ఈ ప్రాంతం అంతటా సరుకులు, ప్రయాణికుల వేగవంతమైన రవాణాను సులభతరం చేస్తుంది.
ఈ ప్రాజెక్టు పూర్తయితే వ్యూహాత్మక పరిశీలనలు, ప్రాంతీయ ఆర్థిక వృద్ధి, ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడం, వాణిజ్యం-పారిశ్రామిక అభివృద్ధికి కొత్త మార్గాలను తెరవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాజెక్ట్ దాదాపు 80 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పనిదినాలనూ సృష్టిస్తుంది. పరిసర ప్రాంతాల్లో వృద్ధి, అభివృద్ధి, శ్రేయస్సులకు కొత్త మార్గాలను తెరుస్తుంది.
కారిడార్ మ్యాప్:
ప్రాజెక్ట్ వివరాలు
|
లక్షణం
|
వివరాలు
|
|
ప్రాజెక్ట్ పేరు
|
అస్సాం రాష్ట్రంలో ఈపీసీ విధానంలో బ్రహ్మపుత్ర నది కింద రెండు వరుసల ట్విన్ ట్యూబ్ టీబీఎమ్ రహదారి అండర్ వాటర్ టన్నెల్ నిర్మాణం. ఒక ట్యూబ్‌లో రైల్వే మౌలిక సదుపాయాల ఏర్పాటు. మొత్తం ప్రాజెక్టు పొడవు 33.7 కిలోమీటర్లు.
|
|
కారిడార్
|
ఎన్‌హెచ్-15పై గోహ్‌పూర్ - ఎన్‌హెచ్-715లో నుమాలిగఢ్
|
|
పొడవు (కిలోమీటర్లు)
|
33.7 కిలోమీటర్లు.
|
|
మొత్తం సివిల్ వ్యయం (రూ. కోట్లలో)
|
11,982.36 కోట్లు.
|
|
భూ సేకరణ వ్యయం (రూ. కోట్లలో)
|
716.65
|
|
మొత్తం మూలధన వ్యయం (రూ. కోట్లలో)
|
18,662.02
|
|
విధానం
|
ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ).
|
|
ప్రాజెక్ట్ పొడవు
|
33.77 కిలోమీటర్ల పొడవు గల తక్షణ ప్రాజెక్ట్
|
|
ఒక ట్యూబ్‌లో రైల్వే మార్గంతో కూడిన ట్విన్ ట్యూబ్ టీబీఎమ్ టన్నెల్
|
15.79 కిలోమీటర్లు
|
|
మొత్తం రహదారి కట్-కవర్
|
1.26 కిలోమీటర్లు
|
|
మొత్తం రైలు కట్-కవర్
|
4 కిలోమీటర్లు
|
|
అనుసంధానమైన ప్రధాన రహదారులు
|
జాతీయ రహదారులు – ఎన్‌హెచ్-15 & ఎన్‌హెచ్ 715
|
|
అనుసంధానిత రైలు మార్గం
|
గోహ్‌పూర్ వైపు ఎన్ఎఫ్ఆర్ రంగియా డివిజన్ కింద రంగియా-ముకోంగ్‌సెలెక్ రైల్వే సెక్షన్
నుమాలిగఢ్ వైపు ఎన్ఎఫ్ఆర్ టిన్సుకియా డివిజన్ కింద ఫుర్కేటింగ్-మరియాని లూప్ లైన్ సెక్షన్
|
|
అనుసంధానిత ఆర్థిక / సామాజిక / రవాణా కేంద్రాలు
|
విమానాశ్రయాలు (02 ) : డోనీ పాలో హోలోంగి విమానాశ్రయం ఇటానగర్, తేజ్‌పూర్ విమానాశ్రయం
రైల్వే స్టేషన్లు (04) : నుమాలిగఢ్ రైల్వే స్టేషన్, గోహ్‌పూర్ రైల్వే స్టేషన్, గోలాఘాట్ టౌన్ రైల్వే స్టేషన్, సిమలుగురి జంక్షన్
ఇన్‌ల్యాండ్ వాటర్ వే టెర్మినల్స్ (02): బిశ్వనాథ్ ఘాట్ వాటర్ వే టెర్మినల్, తేజ్‌పూర్ వాటర్ వే టెర్మినల్
ఆర్థిక కేంద్రాలు (11) : నుమాలిగఢ్ ఇండస్ట్రియల్ ఏరియా, జోర్హాట్ డీఐసీ, ఐఐడీసీ టిటాబోర్, ఇండస్ట్రియల్ ఏరియా జునాకినగర్, ఇండస్ట్రియల్ ఎస్టేట్ నాగావ్, ఐఐడీసీ డెమో, ఇండస్ట్రియల్ ఎస్టేట్ శివసాగర్, ఐఐడీసీ నల్తాలి, ఇండస్ట్రియల్ ఏరియా డోలాబరి, ఎ మినీ బివాజియా, మినీ ఇండస్ట్రియల్.
సామాజిక కేంద్రాలు (03) : 1 గిరిజన జిల్లా – డిమా హసావో; 02 ఆకాంక్షాత్మక జిల్లాలు-ఉదల్గురి & దర్రాంగ్
పర్యాటక కేంద్రాలు (02) : కజిరంగా జాతీయ ఉద్యానవనం, డియోపహార్ ఆర్కియాలజికల్ సైట్
|
|
అనుసంధానమైన ప్రధాన నగరాలు, పట్టణాలు
|
అస్సాంలోని నుమాలిగఢ్, తేజ్‌పూర్, గోహ్‌పూర్ దిబ్రూగఢ్, అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్
|
|
ఉపాధి కల్పన సామర్థ్యం
|
ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం 80 లక్షల పనిదినాలు
|
|
ఆర్థిక సంవత్సరం-2025లో వార్షిక సగటు రోజువారీ ట్రాఫిక్ (ఏఏడీటీ)
|
4680 ప్యాసింజర్ కార్ యూనిట్లు (పీసీయూ)గా అంచనా వేశారు.
|
(రిలీజ్ ఐడి: 2228219)
|