ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' అనే కర్తవ్యాన్ని ప్రకటించిన కేంద్ర బడ్జెట్


రైతుల ఆదాయాన్ని పెంచడం, దివ్యాంగులను శక్తిమంతులను చేయడం, బలహీన వర్గాలకు అండగా నిలవడంతో పాటు పూర్వోదయ రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు లక్షిత చర్యలను ప్రకటించిన ఆర్థిక మంత్రి

కొబ్బరి ప్రోత్సాహక పథకం, భారతీయ జీడిపప్పు- కోకో కోసం ప్రత్యేక కార్యక్రమం, చందనం సాగును ప్రోత్సహించడం, అక్రోటు- బాదం - పైన్ నట్స్ కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రకటించిన ప్రభుత్వం

నాడు పోస్టు చేయడమైనది: 01 FEB 2026 12:50PM by PIB Hyderabad

ప్రతి కుటుంబంవర్గంప్రాంతంరంగానికి వనరులుసౌకర్యాలుఅవకాశాలను అందుబాటులో ఉండేలా చూడటం ద్వారా ప్రతి ఒక్కరూ అర్థవంతమైన తీరులో భాగస్వాములు కావాలన్న 'మూడో కర్తవ్యంప్రభుత్వ ఆలోచన అయిన 'సబ్ కా సాత్సబ్ కా వికాస్'కు అనుగుణంగా ఉందని కేంద్ర ఆర్థికకార్పోరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్.. నేటి 2026-27 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు

ఈ మూడో కర్తవ్యాన్ని సాధించేందుకు ఆర్థిక మంత్రి ఒక సమగ్రమైన రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. “దీనికి ఈ అంశాలపై లక్షిత చర్యలు అవసరంచిన్నఉపాంత రైతులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఉత్పాదకత పెంపువ్యవస్థాపకత ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం బీఉపాధి అవకాశాలుశిక్షణనాణ్యమైన సహాయక పరికరాల ద్వారా దివ్యాంగులను శక్తిమంతులను చేయటం సీమానసిక ఆరోగ్యంట్రామా కేర్ పొందేలా బలహీన వర్గాలకు సాధికారత కల్పించడం డీఅభివృద్ధిఉపాధి అవకాశాలను వేగవంతం చేయడానికి పూర్వోదయ రాష్ట్రాలుఈశాన్య ప్రాంతంపై దృష్టి సారించడం” అని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు

రైతుల ఆదాయం పెంచటం

రైతుల ఆదాయాన్ని పెంచే విస్తృత లక్ష్యంలో భాగంగా 500 జలాశయాలుఅమృత్ సరోవర్‌ల సమగ్ర అభివృద్ధితీర ప్రాంతాలలో మత్స్య రంగ విలువ వ్యవస్థను బలోపేతం చేయడంచేపల రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో కలిసి అంకురాలుమహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తూ మార్కెట్ అనుసంధానాలను కల్పించే నిబంధనలను బడ్జెట్‌లో పొందుపరిచారు

రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కీలకమైన రంగాల్లో పశుసంవర్ధక రంగం ఒకటిగా ఉంటుందని శ్రీమతి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారుగ్రామీణపాక్షిక పట్టణ ప్రాంతాల్లో నాణ్యమైన ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం ఈ విధానాల ద్వారా పశుసంవర్ధక రంగంలో వ్యవస్థాపకత అభివృద్ధికి మద్దతునిస్తుంది: (రుణ ఆధారిత రాయితీ పథకం (బీపశుసంవర్ధక సంస్థల విస్తరణఆధునికీకరణ (సీపశుసంపదడైరీపౌల్ట్రీ ఆధారిత సమగ్ర విలువ ఆధారిత అనుసంధాన వ్యవస్థలను సృష్టిని పెంపొందించడం (డీపశుకాపరుల ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటును ప్రోత్సహించడం

తీరప్రాంతాల్లో కొబ్బరిచందనంకోకోజీడిపప్పు వంటి అధిక విలువ కలిగిన పంటలకు మద్దతు ఇవ్వడం ద్వారా ‘ఉన్నత విలువ కలిగిన వ్యవసాయంగురించి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రధానంగా దృష్టి సారించారు. “ఈశాన్య రాష్ట్రాల్లో అగర్ చెట్లు.. పర్వత ప్రాంతాల్లో బాదంవాల్‌నట్స్పైన్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ సాగుకు కూడా మద్దతు లభిస్తుంది” అని అన్నారు

ప్రపంచంలోనే కొబ్బరి ఉత్పత్తిలో భారత్‌ అగ్రస్థానంలో ఉందిదాదాపు 10 మిలియన్ల రైతులు సహా 30 మిలియన్ల మంది ప్రజలు జీవనోపాధి కోసం కొబ్బరిపై ఆధారపడుతున్నారుకొబ్బరి ఉత్పత్తిలో పోటీతత్వాన్ని మరింత పెంచడానికిప్రధాన కొబ్బరి సాగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉత్పాదకత లేని చెట్ల స్థానంలో కొత్త మొక్కల రకాలను నాటడం వంటి వివిధ చర్యల ద్వారా ఉత్పత్తిఉత్పాదకతను పెంచేందుకు నేను ఒక కొబ్బరి అభివృద్ధి పథకాన్ని ప్రతిపాదిస్తున్నానుఅని కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు

రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంలో భాగంగా పచ్చి జీడిపప్పుకోకో ఉత్పత్తిలో భారత్‌ను స్వయం సమృద్ధిగా మార్చడానికిఎగుమతి పోటీతత్వాన్ని పెంచేందుకు, 2030 నాటికి భారతీయ జీడిపప్పు -  కోకోలను అంతర్జాతీయ ప్రీమియం బ్రాండ్‌లుగా మార్చేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని 2026-27 బడ్జెట్  ప్రతిపాదించింది.

భారతీయ చందన వ్యవస్థకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకుసాగు పంట అనంతర ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేయనుంది.

తక్కువ దిగుబడినిచ్చే పాత తోటలను పునరుద్ధరించడానికి.. వాల్‌నట్స్బాదంపైన్ నట్స్ వంటి వాటిని అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడాన్ని విస్తరించేందుకు.. యువతను భాగస్వామ్యం చేస్తూ విలువ జోడింపు ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచే ప్రత్యేక కార్యక్రమానికి బడ్జెట్ మద్దతునిస్తుంది.

'భారత్-విస్తార్’

భారత్-విస్తార్ (వ్యవసాయ వనరులను పొందేందుకు వర్చువల్ ఇంటిగ్రేటెడ్ వ్యవస్థప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ‘విస్తార్‌’ను బహుభాషా ఏఐ సాధనంగా రూపొందించనున్నారుఇది అగ్రిస్టాక్ పోర్టల్‌లనువ్యవసాయ పద్ధతులకు సంబంధించిన ఐకార్ ప్యాకేజీని ఏఐ వ్యవస్థలతో అనుసంధానిస్తుందిఇది వ్యక్తిగతీకరించిన సలహాల విషయంలో మద్దతునివ్వటం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందిదీనితో పాటు రైతులు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పించటంతో పాటు నష్టభయాన్ని ఇది తగ్గిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2221470) సందర్శకుల సూచీ సంఖ్య : : 118